ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ – ప్యాక్ నిర్వహించిన సర్వే ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వైసీపీ నేతల్లో విజయావకాశాలు తగ్గిపోతున్నాయని ఐ ప్యాక్ తేల్చినట్లు సమాచారం. ఐదుగురు మంత్రులకే ఛాన్స్ ఏపీ కేబినెట్లో పాతిక మంది మంత్రులున్నారు. అందులో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా, విశ్వరూప్, దాడిశెట్టి రాజా లకు మాత్రమే గెలుపు అవకాశం ఉన్నట్లు ఐ …
Read More »నేను తీవ్రవాదిగా మారితే.. తట్టుకోలేరు: పవన్ హాట్ కామెంట్స్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు సంధించారు. “నేను తీవ్రవాదిగా మారితే తట్టుకోలేరు” అని వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడుతున్నారని.. రాష్ట్రాన్ని మూడు ముక్కలుచేయాలని తలపోస్తున్నారని.. ఇదే కనుక జరిగితే.. తాను తీవ్రవాదిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. అప్పుడు వైసీపీ నేతలు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతమని.. వైసీపీనో.. సజ్జల రామకృష్ణారెడ్డి సొంతమో కాదని …
Read More »పవన్‌కు పాల్‌కు ముడిపెట్టి సటైర్లు వేసిన ఏపీ మంత్రి
ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో 3 రాజధానులే ఏర్పడుతాయని చెప్పారు. ఇది వైసీపీ ప్రభుత్వ విధానమని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులు తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అయితే, అదేసమయంలో జనసేన అధినేత పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని అభివృద్ధి చేస్తుంటే పవన్‌కు ఎందుకు ఇబ్బందని ప్రశ్నించారు. …
Read More »ఓ ఎస్సైని జగన్ జైల్లో కొట్టారంటోన్న పవన్
సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు సెల్యూట్ కొడుతున్న ఈ ముఖ్యమంత్రి గతంలో ఓ ఎస్సైని కొట్టారని పవన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. పులివెందులలో ఓ ఎస్ఐని జైల్లో పెట్టి మరీ జగన్ కొట్టారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. అటువంటి జగన్ చేతిలో ఇప్పుడు పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ఉన్నాయని పవన్ …
Read More »అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల కాంబినేషన్ లో వచ్చిన వీర సింహారెడ్డి చిత్రం హిట్ టాక్ తో మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో మాట్లాడిన బాలయ్య…అక్కినేని నాగేశ్వరరావు ఎస్వీ రంగారావులపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్లు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అక్కినేని …
Read More »నో డౌట్.. యువగళం తో చాలా నోళ్లు మూయించాలి
ఔను! టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో అనేక లాభాలు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా గతంలో వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా లోకేష్‌పై వేసిన పప్పు అనే ముద్రను తుడిచేసుకోవడం కనిపిస్తోంది. లోకేష్‌కు మాట్లాడడమే చేతకాదు.. అని మంత్రులు రోజా.. వంటివారు బహిరంగంగానే విమర్శించేవారు. మంగళగిరికి, మందలగిరికి తేడా తెలీదు అని ఎద్దేవా చేసేవారు. ఇక, వర్ధంతికి, జయంతికి కూడా తేడా తెలియదని …
Read More »బీఆర్ఎస్ లో చేరిన మాజీ సీఎం
బీఆర్ఎస్ దిల్లీకి బీజేపీ ఇంటికి అంటూ భారీ డైలాగులు కొడుతున్న కేసీఆర్ తన పార్టీలో చేర్చుకుంటున్న నాయకులను చూస్తుంటే వీరందరినీ పట్టుకుని బీజేపీతో ఎలా పోరాడుతారన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీలో తోట చంద్రశేఖర్ వంటి నాయకులను చేర్చుకున్న కేసీఆర్ ఆ తరువాత గుర్తింపు ఉన్న నాయకులను ఎవరినీ ఇంతవరకు తన పార్టీలో చేర్చుకోలేకపోయారు. మిగతా రాష్ట్రాలలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు …
Read More »జగన్ దూకుడు.. ఆ విషయాన్ని బయట పెట్టేస్తోందా…!
ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మంచివే అని కొందరు.. కాదు.. ప్రజా కంటకమని మరికొంద రు చెబుతున్నారు. ఇక, వీటిపై కోర్టులకు ఎక్కిన వాటిని గమనిస్తే.. అక్కడ తీర్పులను పరిశీలిస్తే.. పంటి కింద రాళ్లు తగులుతున్నాయి. మరి ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా సీఎం జగన్‌కు ఇబ్బందిని తీసుకువస్తున్నాయి. నిజానికి ఆది నుంచి కూడా కొన్ని దూకుడు నిర్ణయాల కారణంగా …
Read More »కాళ్లు బావుంటే నేనే పోటీ
రాయపాటి సాంబశివరావు… ఆ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కాంగ్రెస్, టీడీపీలో ఆయన హవా కొనసాగింది. ప్రజల మనిషిగా ఆయనకు మంచి పేరే ఉంది. అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తారన్న ట్రాక్ రికార్డు ఉంది. ఓడిపోతూ, గెలుస్తూ రాజకీయాలు చేసే గుంటూరు, నరసరావుపేట మాజీ ఎంపీ గత ఎన్నికల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఇంకేముందు వయోభారంతో రాజకీయాలను నుంచి తప్పుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. రెండు సంవత్సరాలు మౌనంగా …
Read More »కసితీరా మాట్లాడిన తమిళిసై
మేడమ్ సార్ కి చాలా రోజుల నుంచి తెలంగాణ సీఎం అంటే ఆగ్రహం. ఇరగదీద్దామన్న ఆవేశం కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె మౌనం వహిస్తుంటారు. అప్పుడప్పుడు ప్రెస్ మీట్స్ పెట్టి తన మంచితనాన్ని చెప్పుకుంటుంటారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే చర్యల్లో భాగంగా ఫైళ్లు తొక్కిపెడతారు. ఇప్పటికే ఏడెనిమిది పైళ్లు రాజ్ భవన్లో చెదలు పట్టుకుని ఉన్నాయి. ఆమె తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌదరరాజన్. రిపబ్లిక్ దినోత్సవం రోజున …
Read More »మోడీ పద్మ వ్యూహం.. గమనించారా…!
కొన్ని కొన్ని విషయాలు.. చూసేందుకు చాలా బాగుంటాయి. వినేందుకు ఇంకా బాగుంటాయి. కానీ, వాటి మాటున అసలు సిసలు రాజకీయం దాగి ఉంటుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కూడా.. ఇదే రాజకీయ వ్యూహాన్ని చాలా మెత్తగా.. కమ్మగా.. ఆవిష్కరించింది. పైకి ఎంతోమెప్పుగా కూడా ఉన్న ఈ వ్యూహం ఫక్తు.. తన స్వలాభానికేనన్న విషయం సుస్పష్టం. తాజాగా రెండుతెలుగు రాష్ట్రాలకు భారీ ఎత్తున పద్మ అవార్డులు …
Read More »రాక్షస పాలన అంతానికే వారాహి తెచ్చాము
బెజవాడలోని దుర్గమ్మ సన్నిలో పవణ్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహికి వేద మంత్రాల నడుమ పూజలు జరిపించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పయనంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రరాష్ట్రంగా ఉండాలని అన్నారు. గుడిలో రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేసిన ఆయన రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడమే వారాహి లక్ష్యం అని మాత్రం చెప్పారు. …
Read More »