ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇది చరిత్రాత్మక రోజు అని అభివర్ణించారు. ప్రజల పట్టుదల, నిర్ణయాత్మక శైలి వంటివి పోలింగ్ సమయంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని.. ఇవి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన క్యూలలో ఎంతో ఓపికగా వేచి ఉన్నారని.. తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయా పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడంతోపాటు తగిన వసతులు కల్పించాలని ఆయన విన్నవించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
కాగా, రాష్ట్రంలో సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ అన్ని ప్రాంతాల్లోనూ సాయంత్రం ఆరు తర్వాత కూడా కొనసాగింది. ఉదయం కొంత ఎండ ఉండడంతో ఓటర్లు వెనుకాడినా.. 11 గంటలకే విజృంభించారు. ఆ తర్వాత.. ఒక గంట కొంత మేరకు మందకొడిగా సాగింది. అయితే.. వాతావరణం అనుకూలించడంతో(ఒకటి రెండు ప్రాంతాల్లో ఈదురు గాలులు వర్షాలు కురిశాయి. బాపట్ల, తిరుపతిలాంటి చోట) మళ్లీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. దీంతో సాయంత్రం ఆరు తర్వాత.. కూడా పెద్ద ఎత్తున క్యూలైన్లలో ఉన్నారు.
వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 6గంటలకే పోలింగ్ సమయం అయిపోతుంది.అయినా.. ఓటర్ల ఉత్సాహం నేపథ్యంలో ఈ సమయాన్ని పొడిగిస్తున్నట్టురాష్ట్ర ఎన్నికల అధికారులు సైతం పేర్కొన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నేపథ్యంలో నే చంద్రబాబు పైవిధంగా విన్నవించారు. గత 2019 ఎన్నికల సమయంలోనూ ఇలానే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పోటెత్తారు. అప్పట్లో రాత్రం 9-10 గంటల వరకు కూడా పోలింగ్ జరగడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates