వైసీపీలో మౌనం.. కూట‌మి శిబిరంలో జోష్‌..

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమ‌రం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే స‌మ‌యానికి ఇంకా కొన్ని చోట్ల మాత్ర‌మే పోలింగ్ జ‌రుగుతోంది. అయితే.. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన పోలింగ్‌లో్ రాత్రి 8 గంట‌ల స‌మ‌యానికి మొత్తం 72 శాతానికి పైగా పోలింగ్ న‌మోదైంది. ఇది కొద్దిగా అటు ఇటు మారే అవ‌కాశం ఉంది. అంటే మొత్తంగా 75 శాతానికి చేరే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఇదే విష‌యాన్ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కూడా స్ప‌ష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయ అంచ‌నాలు మారుతున్నాయ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. అధికార పార్టీ మార్పు త‌ప్ప‌ద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుత ఓటింగ్ స‌ర‌ళి, పోలింగ్ శాతం పెర‌గ‌డంపై అధికార ప‌క్షం వైసీపీలో మౌనం ఆవ‌హించింది. ఒక‌రిద్ద‌రు నాయ కులు మాట్లాడుతున్నా.. వారిలో సంతోషం సన్న‌గిల్లింది. అంతేకాదు.. ముఖంలోనూ క‌ళ లేన‌ట్టే ఉంది. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, పేర్ని నాని వంటివారు మీడియాతో మాట్లాడినా… పెద్ద‌గా ఉత్సాహం అయితే.. క‌నిపించ‌లేదు. అంతేకాదు.. ధైర్యంగా కూడా వారు ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితిలో ఉన్నారు. మ‌రోవైపు ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం 2019లో 79 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది .. అప్ప‌టి ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌చ్చింది. దీంతో వైసీపీలో మ‌రింత డీలా క‌నిపించింది.

ఎందుకంటే 70 శాతానికి మించి పోలింగ్ న‌మోదైతే.. అది ప్ర‌తిప‌క్షానికి క‌లిసి వ‌స్తుంద‌నే లెక్క‌లు వ‌స్తుండ‌డ‌మే. మ‌రోవైపు.. యువ‌త పోటెత్తారు. కొత్త‌గా ఓటు హ‌క్కు ద‌క్కించుకున్న‌వారు కూడా ఈ ద‌ఫా ఓటేశారు. అందుకే పోలింగ్ కేంద్రాల్లో ఆల‌స్యం జ‌రిగింద‌ని ఎన్నిక‌ల సంఘం కూడా పేర్కొంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీలో జోష్ క‌నిపించ‌డం లేదు. ఇదిలా వుంటే.. మ‌రోవైపు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కూట‌మి పార్టీ టీడీపీలో మాత్రం జోష్ క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు, నారా లోకేష్‌లు.. విజ‌యంపై ధీమా వ్య‌క్తం చేస్తూ.. ఓట‌ర్ల‌కు అప్పుడే శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు కూడా తెలిపారు.

ఇక‌, కూట‌మిలో మ‌రో పార్టీ జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.. ఇదే వ్యాఖ్య చేశారు. ఓటింగ్ శాతం పెరుగుతుండ‌డం సంతోష‌మ‌ని.. ఇది కూట‌మి విజ‌యానికి ప్ర‌జ‌లు ఇస్తున్న ఆశీర్వాద‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సో.. మొత్తంలో ఏపీలో అధికార పార్టీ డీలా ప‌డ‌డం, విప‌క్షంలో జోష్ క‌నిపించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. అయితే..వాస్త‌వ ఫ‌లితం కోసం 21 రోజులు అంటే జూన్ 4వ తేదీ వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.