జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. గతానికి భిన్నంగా ఆయన ఈ సారి భార్యతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయడం విశేషం. మంగళగిరిలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు, పోలింగ్ సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. తాగునీటి వసతి కల్పించాలని.. టెంట్లు ఇంకా ఎక్కువ వేయాలని సూచించారు.
అదేవిధంగా కేంద్రాల ముందు ప్రజలు బారులు తీరారని.. వారిని ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇక, మెగా స్టార్ చిరంజీవి దంపతులు.. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఓటేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చిరు సూచించారు. ఈయన మేనల్లుడు.. బన్నీ అల్లు అర్జున్ ఉదయాన్నే ఓటేశారు. ఈయన మాట్లాడుతూ.. తన స్నేహితులు ఎక్కడున్నా ప్రచారం చేసేందుకు వెళ్తానని.. ఇది తప్పుకాదని.. పార్టీలకు అతీతంగా స్నేహితులు తనకు ఉన్నారని అన్నారు.
అదేవిధంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా పలువురు ఉదయాన్నే పోలింగ్ బూతుల్లో కనిపిం చారు. యువత వచ్చి ఓట్లేయాలని.. పోలింగ్ డే.. హాలీడే కాదని వారు పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచి పోటీలో ఉన్నారు. కానీ, ఆయన మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయాన్నే.. ఓటర్లు పోలింగ్ బూతులకు పోటెత్తారు. ఎండవేడికి దీనికి కారణమని తెలుస్తోంది. మొత్తానికి గతానికి భిన్నంగా ఉదయం 5 గంటల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉదయం 6 నుంచి నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates