టీడీపీ అధినేత చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఉండవల్లిలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాత.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాలోని ఒకటి రెండు నియోజకవర్గాలు సహా.. కడపలోని కమలాపురం నియోజకవర్గంలోనూ.. స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రెంటచింతల(పల్నాడు)లో వైసీపీ, టీడీపీ పోలింగ్ ఏజంట్లు గాయపడ్డారు. ఇక్కడ స్వల్ప ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి.
ఈ పరిణామాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు సరికాదని.. ప్రజాస్వామ్య పండుగను ధ్వంసం చేయరాదని ఆయన పేర్కొన్నారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తే.. తమ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు బాగానే ఉన్నాయని తెలిపారు.
ఏం జరిగింది?
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న రెంటచింతల మండలం లో సోమవారం ఉదయం కొందరు హల్చల్ చేశారు. దీనిని ఇరు పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన వారు గాయపడ్డారు. వీరిలో వైసీపీ, టీడీపీ ఏజెంట్లు కూడా ఉండడం గమనార్హం. అయితే.. ఈ దాడిపై పరస్పరంఆరోపణలు చేసుకున్నారు.
సీఎం జగన్ మేనమామ పోటీలో ఉన్న కడప జిల్లాలోని కమలాపురంలోనూ.. ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా నకిలీ ఓట్లు వేసేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే.. వీరు టీడీపీ వారేనని వైసీపీ, కాదువైసీపీ ముఠాయేనని టీడీపీ ఆరోపించుకుని.. పరస్పరందాడులకు దిగాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates