వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. వివాదం అందరికీ తెలిసిందే. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో పిన్నెల్లి.. రెచ్చిపోయారు.. మాచర్లలోని పోలింగ్ బూత్‌లో విధ్వంసం సృష్టించారు. అనంతరం.. సీఐ నారాయణ స్వామిని చావబాదారు. పోలింగ్ ఏజెంట్ శేషగిరిపైనా దాడి చేయించారు. ఈఘటనల నేపథ్యంలో పిన్నెల్లిని అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిం చింది. వాస్తవానికి ఈ ఘటనలన్నీ జరిగింది మే 13న. కానీ 20వ తేదీ వరకువెలుగులోకి రాలేదు.
అంటే.. దాదాపు 7 రోజుల పాటు వీటిని దాచిపెట్టారు. కట్ చేస్తే.. ఈ లోపే పిన్నెల్లి మాచర్ల సహా ఏపీని వదిలి వెళ్లిపోయారు. చిత్రం ఏంటంటే.. ఈయనను పట్టుకునేందుకు పోలీసులు 4 బృందాలుగా ఏర్పడ్డారు. మూడు రాష్ట్రాలకు వెళ్లారు. చెన్నై, బెంగళూరు.. హైదరాబాద్‌కు కూడా వెళ్లి శోధించారు. కానీ.. 8 రోజుల పాటు ఆయన ఆచూకీని కనీసం కూడా పట్టుకోలేక పోయారు. ఇంకోవైపు.. ఇంకేముంది.. పిన్నెల్లి దేశం వదిలి పారిపోయారన్న ప్రచారం కూడా తెరమీదికి వచ్చింది.
మొత్తంగా చూస్తే.. హైకోర్టు నుంచి ముందస్తు బెయిళ్లు వచ్చే వరకు కూడా.. పిన్నెల్లిని ఎవరూ గుర్తించలేదు.. తనంతట తాను వచ్చి ఎస్పీ కార్యాలయంలో లొంగిపోతే తప్ప.. ఎవరూ పట్టుకోలేదు. దీంతో మరి ఆ 8 రోజులు పిన్నెల్లి ఎక్కడ ఉన్నారు? ఎవరు ఆయనకు షెల్టర్ ఇచ్చారు? అనే ప్రశ్నకు తాజాగా కొన్ని విషయాలు హల్చల్ చేస్తున్నాయి. తెలంగాణలో కీలక నేత.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఓ నాయకుడు పిన్నెల్లికి బంధువు అవుతారని.. ఆయన సౌజన్యంతోనే పిన్నెల్లికి షెల్టర్ లభించిందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఇక్కడ మరో భారీ ట్విస్ట్ కూడా ఉందని అంటున్నారు. కర్ణాకటకు చెందిన కాంగ్రెస్ కీలక నాయకుడు.. ప్ర స్తుతం ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్న ఒక నేత కూడా.. పిన్నెల్లికి సహకరించారని సమాచారం.. అయితే.. ఈ మొత్తం పరిణామాలకు కూడా.. అసలు కీ ఏపీలోనే ఉందని.. ఆ డైరెక్షన్‌లోనే అన్నీ జరిగాయని రాజకీ య వర్గాలు చర్చించుకుంటున్నాయి. సో.. ఈ పరిణామాలను గమనిస్తే.. పిన్నెల్లి వెనుక చాలానే రాజకీయం ఉందని అంటున్నారు.