వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ న్యాయ పోరాటంలో మరో మెట్టు ఎక్కారు. ఇటీవల తన పార్టీకి 11 మంది ఎమ్మెల్యే లే ఉన్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించాలని కోరుతూ ఆయన హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఒక విడత విచారణ కూడా జరిగింది. ఇక, ఇప్పుడు మరో కీలక అంశంతో జగన్ హైకోర్టు మెట్లెక్కారు. తనకు కల్పిస్తున్న వ్యక్తిగత భద్రతను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొలగించిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు.. తన ప్రాణాలకు ముప్పు విషయాన్ని కూడా ఆయన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఐదేళ్లు ము ఖ్యమంత్రిగా చేసిన తనకు కొన్ని అసాంఘిక శక్తుల నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రబుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తనకు ఉన్న భద్రతను తొలగించినట్టు జగన్ వివరించారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత భద్రతను తొలగించిన ప్రభుత్వాన్ని మందలిస్తూ.. తనకు భద్రతను పెంచేలా ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు.
అదేవిధంగా తనకు కల్పిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పాతదని. ఎక్కడికక్కడ మొరాయిస్తోందని జగన్ తన పిటిషన్‌లో వివరించారు. ఇది కూడా తనను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించాలని చేస్తున్న ప్రయత్నమేనని పేర్కొన్నారు. కాబట్టి.. అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తనకు కేటాయించేలా ఆదేశించాలని పిటిషన్‌లో జగన్ అభ్యర్థించారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని.. తన భద్రతకు సంబంధించి సర్కారుకు తగిన విధంగా సూచనలు ఇవ్వాలని జగన్ కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates