ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపు వెనుక టీడీపీ నాయకుల త్యాగం కూడా ఉంది. ముఖ్యంగా ఆ 31 మంది నాయకులు ఏమీ ఆశించకుండా కూటమి విజయం కోసం కష్టపడ్డారు. ఇప్పుడు వీళ్లను పదవులతో గౌరవించేందుకు బాబు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇంతకీ ఆ 31 మంది ఎవరూ అంటే.. పొత్తులో భాగంగా టికెట్లు వదులుకున్న టీడీపీ నాయకులే. ఏపీ అసెంబ్లీ …
Read More »హరీష్ రావడమే మార్గమా? కానీ రానిస్తారా?
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇలాంటి కష్టకాలం వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఊహించి ఉండరు. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన షాక్‌తో కుంగిపోయిన కేసీఆర్‌ను.. లోక్‌సభ ఎన్నికల్లో సున్నా ఫలితం మరింత దెబ్బకొట్టింది. దీంతో పార్టీ ఉనికి ప్రమాదంలో పడటంతో నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ సమయంలో బీఆర్ఎస్‌ను కాపాడేది హరీష్ రావు మాత్రమేనన్న …
Read More »అమర్‌నాథ్ అంత మాట అనేశాడేంటి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేయడమే కాక.. నిత్యం సోషల్ మీడియా, మీడియాలో కనిపిస్తూ బాగానే హైలైట్ అయ్యాడు గుడివాడ అమర్‌నాథ్. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న అమర్‌నాథ్.. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రి అయి తెలుగుదేశం మీద.. అలాగే జనసేన మీద చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి. మిగతా వైసీపీ నేతల తరహాలో బూతులు మాట్లాడకపోవడం మంచి విషయమే అయినా.. …
Read More »అమరావతి రైతులు మొక్కులు చెల్లించారు.. షాక్ ఏంటంటే!
ఏపీ రాజధాని అమరావతి రైతులు.. ఆదివారం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరి మొక్కులు చెల్లించుకున్నారు. తుళ్లూరు నుండి పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని విజయవాడ అమ్మవారి గుడికి బయలు దేరిన అమరావతి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో తమ మొక్కులను చెల్లించుకుంటున్నామని …
Read More »అమిత్ షాకు నో చెప్పిన చంద్రబాబు
చంద్రబాబు మారిపోయారు. పూర్తిగా మారిపోయారు. దశాబ్దాల తరబడి ఒకే తీరును ప్రదర్శించే ఆయన ఇప్పుడు కొత్త వెర్షన్ లో కనిపిస్తున్నారు. అధికారం.. ప్రతిపక్షం ఆయనకు అలవాటే అయినప్పటికీ గడిచిన ఐదేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన్ను పూర్తిగా మార్చేశాయి. తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించి తెలిస్తే.. బాబులో మార్పు ఎంతన్న విషయం మరింత బాగా అర్థమవుతుంది. ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూనే కేంద్రంలో చక్రం తిప్పాలన్న తహతహ బాబులో …
Read More »ఆ ఆరుగురు ఎవరు ? .. కొత్త మంత్రుల కొట్లాట !
లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. గత డిసెంబరులో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎమ్మెల్సీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పేరుతో ప్రతి పనికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగడంతో ఇప్పుడు అందరిదృష్టి మంత్రి పదవుల మీద పడింది. డిసెంబరులో 12 మందిని మంత్రి వర్గంలోకి తీసుకోగా మరో 6 పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మంత్రులయ్యే ఆ ఆరుగురు ఎవరు అన్న …
Read More »ఏపీలో ఉచిత బస్సు.. ఎప్పటి నుంచంటే!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైంది.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనినే ఎన్నికలకు ఏడాది ముందు.. నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన ఆరు హామీల్లో ఒకటిగా చేర్చారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హామీ ఎప్పుడంటూ చర్చ ప్రారంభమైంది. చంద్రబాబు కూటమి …
Read More »కేసీఆర్ చేస్తే రైటూ.. రేవంత్ చేస్తే రాంగా?
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు! అధికారం ఉంది కదా.. రాష్ట్రంలో అడ్డు ఎవరు? అనే అహంకారంతో సాగే వాళ్లకు కాలమే సమాధానం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లోని ఎమ్మెల్యేలను చేర్చుకుని ఈ పార్టీలను కేసీఆర్ దెబ్బకొట్టారు. ప్రత్యర్థి పార్టీ అనేదే లేకుండా చూడాలనుకున్నారు. కానీ కేసీఆర్‌కు ఇప్పుడు అదే దెబ్బ రిటర్న్‌లో తగులుతోంది. …
Read More »పవన్ షూట్ ఇప్పుడే కాదట
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే పవన్ రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి పెండింగ్‌లో ఉన్న తన సినిమాల షూటింగ్ పూర్తి చేసే పనిలో పడతాడని ఇంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఫలితాల తర్వాత కథ మారిపోయింది. కూటమి ఘనవిజయం సాధించింది. జనసేన అద్భుత ఫలితాలు రాబట్టింది. పవన్ ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. నాలుగు మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నాడు. దీంతో సీరియస్‌గా రాజకీయాల …
Read More »జగన్‌పై పులివెందులలో తిరుగుబాటు?
కడప జిల్లా, ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఉన్న పట్లు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అక్కడ ఆ కుటుంబం తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. వైఎస్ అయినా, ఆయన వారసుడు జగన్ అయినా.. పులివెందులకు వెళ్లకుండా, ఎన్నికల ప్రచారం కూడా చేయకుండానే అక్కడ ఎన్నికల్లో గెలిచేస్తుంటారు. వారికి భారీ మెజారిటీలు కూడా గ్యారెంటీ. ఐతే ఈసారి మాత్రం ఎన్నికల్లో జగన్‌కు మెజారిటీ కొంచెం తగ్గింది. …
Read More »వైసీపీ వెర్సస్ కూటమి.. అసెంబ్లీలో తేడా క్లియర్
అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం కొత్తేమీ కాదు. ఈ క్రమంలో గొడవలు జరిగి అసెంబ్లీ రణరంగంగా మారిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఐతే దశాబ్దాలుగా చూస్తున్న అసెంబ్లీ సెషన్లకు భిన్నమైన దృశ్యాలు గత ఐదేళ్లలో చూశాం. ప్రతిపక్ష నేతల మీద దారుణాతి దారుణంగా వ్యక్తిగత వ్యాఖ్యలు, ఆరోపణలు చేసి రాజకీయాల మీద జనాలకు అసహ్యం పుట్టేలా చేశారనే విమర్శలను వైసీపీ నేతలు ఎదుర్కొన్నారు. “లోకేష్ ఎలా …
Read More »విధ్వంసం అంటే ఇది కాదు జగన్ !
గుంటూరు జిల్లా శివారులోని తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ.. శనివారం ఉదయం అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. 7 బుల్డోజర్లను వినియోగించి, పటిష్టమైన భద్రత మధ్య ఈ భవనాలను కూల్చేశారు. అయితే.. దీనిపై స్పందించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని.. రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates