ప్రగతి భవన్‌లోకి ఎంఎల్ఏలకు నోఎంట్రీ బోర్డు కనబడుతోందట. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో కేసీయార్ ను కలిసి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడుదామని, పరిష్కారలపై చర్చించాలని అనుకుంటున్న ఎంఎల్ఏలకు ప్రగతిభవన్‌లోకి నోఎంట్రీ బోర్డు కనబడుతోందని సమాచారం. గడచిన వారంరోజులుగా ముందుగా అపాయిట్మెంట్ తీసుకోకుండా నేరుగా వచ్చేస్తున్న ఎంఎల్ఏలను లోపలకు పంపటంలేదట. గేటు దగ్గరే సెక్యూరిటి వాళ్ళు ఆపేసి పంపేస్తున్నారట. వచ్చిన ఎంఎల్ఏకి అపాయిట్మెంట్ ఉందా లేదా అన్నది సెక్యూరిటి వాళ్ళు కనుక్కుంటున్నారట. …
Read More »అమరావతిలో పవన్.. 3 రోజులు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరిపాలన భవనాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. ఆదివారం సాయంత్రం వరకు పవన్ కల్యాణ్ అమరావతిలోనే బస చేయనున్నట్లు జనసేన నేతలు వెల్లడించారు. ఈ రెండు రోజులు పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్లు, ప్రైవేట్ మీటింగుల కోసం కేటాయించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరెవరితో భేటీ కానున్నారనే అంశాలపై ఇప్పటి …
Read More »నిన్న జగన్.. ఈ రోజు చంద్రబాబు.. ఒకే పనిచేశారుగా!!
ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని అంటారు. అలాగే.. పరస్పర విరుద్ధమైన పార్టీల నేతల అభిప్రాయాలు .. లక్ష్యాలు కూడా కలవవు. ముఖ్యంగా ఏపీ వంటిరాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ ఒకటంటే.. ప్రతిపక్షం టీడీపీ మరొకటి అంటుంది. అలాంటి రెండు పార్టీలు కూడా ఒక విషయంలో కలిసిపోయాయి. ఇరు పార్టీలు కూడా ప్రధాని మోడీ విషయానికి వచ్చేసరికి రెండు పార్టీలు కూడా.. జై కొట్టాయి. అదే.. కొత్త పార్లమెంటు భవనం …
Read More »రారండో రండో రండి.. తమ్ముళ్లకు చంద్రబాబు లేఖ
సమసమాజ స్థాపన కోసం మహాకవి శ్రీశ్రీ రారండో రండో రండి అని పిలుపునిచ్చినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ నాయకులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు కదనోత్సాహంతో ‘మహానాడు 2023’కు తెలుగుదేశం పార్టీ సిద్ధమైందని.. తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరిలో ఈనెల 27, 28 తేదీల్లో తలపెట్టిన ఈ పసుపు శ్రేణుల పండగకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొదటి రోజున ప్రతినిధుల సభ, రెండో రోజున …
Read More »డిప్యూటీ సీఎం వస్తున్నారని ఊరంతా తాళాలు
ఏపీ ఉప ముఖ్యమంత్రిని అనూహ్య అనుభవం ఎదురైంది. సాధారణంగా ఈ స్థాయి నేత తమ ఊరికి వస్తున్నారంటే.. ఆ హడావుడి వేరే ఉంటుంది. అందుకు భిన్నంగా ఊరంతా తాళాలు వేసుకొని బయటకు వెళ్లిపోయిన ఉదంతం బయటకు రావటంతో ఇప్పుడీ అంశం సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం వస్తున్న వేళ.. ఊరు వదిలి ఎందుకు వెళ్లాలి? ఆ అవసరం ఏమిటి? అన్న ప్రశ్నలకు ఆసక్తికర ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గ్రామస్తుల తీరుపై డిప్యూటీ …
Read More »కేజ్రీ, కవిత వెంటపడుతున్న సుఖేష్
ఢిల్లీ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖరన్ వారానికి ఒక లేఖను విడుదల చేయటం ద్వారా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితలను బాగా చికాకుపెడుతున్నాడు. ఇప్పటికే ఒకసారి కేజ్రీవాల్ ఇంటి ఫర్నీచర్ బిల్లులను తానే చెల్లించానని చెప్పి కొన్ని ఆధారాలంటు మీడియాకు అందించాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కవితకు తాను హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీసులో కోట్ల రూపాయలున్న బ్యాగును కారులో పెట్టి అందిచానని చెప్పాడు. …
Read More »ప్రపంచానికి మోడీ హగ్ థెరపీ
ఇద్దరు ప్రముఖులు కలిస్తే ఏం చేస్తారు? మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అలా చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకత ఏముంటుంది? భారతీయుల మార్క్ గా చెప్పే నమస్కారం.. అనుబంధానికి.. అప్యాయతకు గుర్తుగా ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం తెలిసిందే. ఈ విధానాన్ని పాటించటం ద్వారా.. మిగిలిన వారికి భిన్నమైన రీతిలో నిలిచారు మోడీ. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఆయన పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేశారు. అప్పటివరకు రెండు.. …
Read More »యువగళం ఆషామాషీ కాదు తమ్ముళ్లూ.. బీ కేర్‌ఫుల్!!
యువగళం పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. అహరహం శ్రమిస్తున్నారు. యాత్ర సాగుతున్న తీరును నిరంతరం ఆయన సమీక్షించుకుంటు న్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి క్విక్‌గా తయారై.. వెంటనే సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎంత మంది వచ్చినా.. సెల్ఫీలు తీసుకుంటున్నా రు. అదేవిధంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో సమస్యలు తెలుసుకుంటున్నారు. దీనిపై ప్రత్యేకంగా నోట్స్ కూడా రాసుకుంటున్నారు. పైకి …
Read More »టీడీపీ+ జనసేన = మైనస్ కొడాలి నాని ?
వైసీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి , ఫైర్ బ్రాండ్ కొడాలి నాని విషయంలో ఈసారి అనుకున్న విధంగా పరిస్థితి ఉండే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఆది నుంచి ఆయనను వెనుకేసుకు వస్తున్న కాపు సామాజిక వర్గం.. ఈ సారి ఆయనను వదిలేసే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఉమ్మడి కృష్నా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం నుంచి వరుస విజయాలు అందుకుంటున్న నాని.. 2024లోనూ విజయం దక్కించుకుని రికార్డు సృష్టించాలని …
Read More »రూ. 10 వేల కోట్లు పది మెలికలు
కేంద్రం నుంచి పది వేలకోట్లు తీసుకొచ్చి జగన్ విజయం సాధించారని అనుకుంటున్న వైసీపీ నేతలకు….అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. వచ్చిన డబ్బును వాడేసుకునే హడావిడిలో ఉన్న అధికారులకు…. వచ్చిన ఉత్తర్వుల్లో నాలుగో నిబంధన చదివిన తర్వాత మైండ్‌బ్లాంక్ అయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెవెన్యూలోటుతో ఏర్పడిన ఏపీకి కేంద్ర ప్రభుత్వం 2014-15 ఆర్థికసంవత్సరంలో సుమారు 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ అంశాన్ని అకౌంటెంట్ జనరల్ …
Read More »చిన్నమ్మ పెద్ద బాంబే పేల్చారుగా!
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురంధేశ్వరి ఉరఫ్ చిన్నమ్మ.. సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అరాచక, విధ్వంస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఊబిలోకి నెట్టేసినట్లు.. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా అర్హులైన లబ్ధిదారునికి అందించకుండా.. వచ్చే నిధులను దారి మళ్లించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత దీనావస్థలో ఉందంటే.. చివరికి …
Read More »జగన్ మేనత్త సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత,సీఎం జగన్ మేనత్త విమలారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో సీబీఐ విచారణ నుంచి తప్పించుకుంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని చెబుతున్నారు. ఆయన మాతృమూర్తి శ్రీలక్ష్మి వైద్యం పొందుతున్న కర్నూలు జిల్లాలోని విశ్వభారతి వైద్యాలయం కూడా ఇదే విషయాన్ని బులెటిన్ రూపంలో వెల్లడించింది. దీంతో అందరిలోనూ కొంత సింపతీ ఏర్పడింది. అయితే.. అందరూ ఇలా అనుకుంటున్న సమయంలో …
Read More »