Political News

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 160 స్థానాలు ప‌క్కా

టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాడు.. మ‌హానాడులో హైలెట్ ప్ర‌సంగం చేశారు. ప్ర‌తి మాట‌లో నూ తూటా పేల్చారు. రెచ్చిపోయి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలను టీడీపీ గెలుచుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. టీడీపీది ఎప్పుడూ ప్రజాపక్షమే అన్నారు. 2019లో ఓ దోపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారన్నారు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. …

Read More »

వివేకా హత్య: నిజం చెబితే చంపేస్తా.. అన్నాడు

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో త‌వ్విన కొద్దీ అనేక సంచ‌ల‌నాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగ‌య్య‌ను ‘నిజం చెబితే చంపేస్తా’ అని ఏ1 గంగిరెడ్డి తీవ్రంగా బెదిరించిన విష‌యం తాజాగా వెలుగు చూసింది. వివేకా హత్య గురించి పోలీసులకు నిజాలు చెబితే చంపేస్తానని వాచ్‌మన్‌ రంగన్నను ఈ కేసులో ఏ–1 ఎర్ర గంగిరెడ్డి బెదిరించారని …

Read More »

మ‌హానాడు.. అస‌లు ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే..

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రిజిల్లా కేంద్రం రాజ‌మండ్రి (రాజ‌మహేంద్ర‌వ‌రం)లో శ‌నివారం నుంచి రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న మ‌హానాడుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు దేశం పార్టీ ఏర్ప‌డి 41 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. తెలుగు వారి తెర వేల్పు అన్న‌గారు ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత‌.. కొన్నాళ్ల నుంచి మ‌హానాడును పార్టీ అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. అయితే.. తాజా మ‌హానాడు నేప‌థ్యంలో అస‌లు ఈ మ‌హానాడు …

Read More »

అవినాష్ చుట్టూ బంగార్రాజులు.. ఏం చేస్తున్నారంటే..!

ఏపీలో ఏం జ‌రిగినా బెట్టింగు రాయ‌ళ్లు రంగంలోకి దిగుతున్నారు. కోడి పందేల నుంచి క్రికెట్ వ‌ర‌కు దేనినీ వారు వదిలి పెట్ట‌డం లేదు. ఇలానే.. ఇప్పుడు సంచ‌ల‌నంగా మారిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ.. సీఎం జ‌గ‌న్‌కు త‌మ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డి వ్య‌వ‌హారం కూడా .. బెట్టింగుల‌కు దారి తీసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా? చేయ‌రా? అనేది తీవ్ర …

Read More »

మోడీ 9 ఏళ్ల పాల‌న‌పై కాంగ్రెస్ 9 ప్ర‌శ్న‌లు..

కేంద్రంలో న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి 9 సంవ‌త్స‌రాలు పూర్తయిన నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు సంబ‌రాలు చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా సంబ‌రాల్లో మునిగిపోయింది. అయితే.. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ మోడీ పాల‌న‌పై 9 ప్ర‌శ్న‌లు సంధించింది. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పే ద‌మ్ముందా? అంటూ.. స‌వాల్ విసిరింది. ఇవీ ప్ర‌శ్న‌లు.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం భారతదేశంలో ఉవ్వెత్తున ఎగసిపడటానికి కారణం ఏమిటి? ధనవంతులు మరింత ధనవంతులు, పేదలు …

Read More »

ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ

ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ పై టీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం స్టే సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంలో తాజాగా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంపై సుప్రీంలో జరిగిన విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గంగిరెడ్డి విడుదల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం తాజాగా స్టే జారీ …

Read More »

అందరికీ షాకిచ్చిన సుప్రీంకోర్టు!

Supreme Court

కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలన్న వాదనను విపక్షాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు కొట్టేసింది. తమ ముందుకు వచ్చిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు సుప్రీంకోర్టు నో చెప్పింది. జస్టిస్ జేకే మహేశ్వరి.. జస్లిస్ పీఎస్ నరసింహాలతో కూడిన …

Read More »

కేసీఆర్ మీద కోపం.. మోడీని ఇరికించిన తమిళ సై?

కాస్తంత తేడాగా ఉన్నప్పటికీ ఒకేలాంటి సీన్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కొన్ని సందర్భాల్లో మాట్లాడటానికి మించిన పెద్ద తప్పు మరొకటి ఉండదు. తాము వినిపించే వాదనకు సారూప్యత ఉందన్న ఉద్దేశంతో నోటికి పని చెబితే కొత్త తలనొప్పి రావటం ఖాయం. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళ సై.కొత్త పార్లమెంటు భవనం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వేళ.. దాని ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ …

Read More »

క‌డ‌ప‌లో యువ‌గ‌ళం ఎఫెక్ట్ ఎంత‌…

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి తిరుగులేని జిల్లాగా పేరు తెచ్చుకుంది. అంతేకా దు.. కొన్నినియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం కూడా ప‌ట్టారు. అయితే.. అలాంటి జిల్లాపై ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌కు అనుమానపు మేఘాలు ముసురుకున్నాయి. దీనికి కార‌ణం.. టీడీపీ యువ నేత నారా లోకేష్ యువ‌గ‌ళం ఇక్క‌డ ప్రారంభం కావ‌డ‌మే. ఇటీవ‌ల చంద్ర‌బాబు సైతం ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ఇక‌, వైనాట్ పులివెందుల …

Read More »

200 ఎక‌రాలు.. అదిరే వంట‌కాలు!

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, యుగపురుషుడు నంద‌మూరి తార‌క రామారావు   శతజయంతి వేడుక‌ల‌ను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 27, 28న వేడుకలు జరగనుండగా.. రాజమహేంద్రవరానికి ముందుగానే మహానాడు కళ వచ్చేసింది. ఎన్నికల ఏడాది కావటంతో.. ఈసారి పసుపు పండుగను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం ఉవ్విళ్లూరుతోంది. నాలుగేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న తెలుగుదేశం.. మహానాడు వేదికను తమకు …

Read More »

కొత్త పార్ల‌మెంటు వివాదం.. సుప్రీంకోర్టుకు..

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న నూతన పార్లమెంట్ భవనం(సెంట్ర‌ల్ విస్టా) ప్రారంభంపై చెలరేగిన రగడ సుప్రీం కోర్టుకు చేరింది. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. లోక్సభ సెక్రటేరియట్.. నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని న్యాయవాది జయ సుకిన్ పిల్ దాఖలు చేశారు. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం …

Read More »

బీజేపీకి ఇంత కడుపుమంటగా ఉందా ?

కర్ణాటక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీజేపీకి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అంటే బాగా మంటగా ఉన్నట్లుంది. ఈ విషయం బీజేపీ నేతలు చేసిన ట్వీట్లోనే బయటపడుతోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. అందులో ఏముందంటే ప్రజలకు తప్పుడు హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఉంది. ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీ స్కీములను వెంటనే …

Read More »