తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10 మంది ఎమ్మెల్యేలు మద్దతునివ్వడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరగా..త్వరగా తేల్చాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ క్రమంలో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన గడ్డం ప్రసాద్… తాజాగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చారు.
దానం, కడియం శ్రీహరిలపై ఉన్న అనర్హత పిటిషన్ ను ప్రసాద్ కొట్టివేశారు. వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం హాస్యాస్పదం. ఎన్నికల్లో బహిరంగంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆధారాలు ఉన్నాకూడా పార్టీ మారలేదని స్పీకర్ తీర్పు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గు మంటున్నారు.
ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగదాడి అని, ఇది ప్రజల తీర్పును అవమానించడమేనని కేటీఆర్ మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్న ఈ రోజు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని అన్నారను. ఇది కేవలం ఒక తీర్పు కాదని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates