రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో, కొత్త ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు 86 నగర పంచాయతీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు స్వీకరించే వరకు ఆయా స్థానాల్లో స్పెషల్ ఆఫీసర్లు పరిపాలన నిర్వహించనున్నారు.
స్పెషల్ ఆఫీసర్లు గరిష్టంగా ఆరు నెలలపాటు తమ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పెషల్ ఆఫీసర్లు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని సూచించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో ప్రచురించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates