వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామవరం మండలం పాపిరెడ్డిపల్లికి వెళుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల టీడీపీ వర్గీయుల దాడిలో చనిపోయినట్లుగా వైసీపీ ఆరోపిస్తున్న ఆ పార్టీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకే జగన్ ఆ గ్రామానికి వెళుతున్నారు. రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరిటాల సునీత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ నియోజకవర్గంలోకి జగన్ వస్తున్నారని… …
Read More »బిగ్ బ్రేకింగ్… గ్యాస్ బండపై రూ.50 పెంపు
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి సిలిండర్ పై రూ.50 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలు సబ్సీడీ గ్యాస్ కనెక్షన్లతో పాటుగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు, చివరాఖరుకు ఉజ్వల పథకం కింద అందిస్తున్న సిలిండర్లకూ వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ పెరిగిన ధరలను మంగళవారం …
Read More »ఒక్క సీటు కూడా రాలేదు.. కానీ పవన్ ఫోకస్ అక్కడే
ఏపీలోని గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన అడవి తల్లి బాట కార్యక్రమాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పరిధిలోని డుంబ్రిగూడ మండలం పెదపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు గిరిజన గూడేలంటే ఇష్టమని… అందుకే …
Read More »జగన్ చేసిన తప్పుకు బాబును నిలదీసిన షర్మిల
ఏపీలో ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు గత వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు మొక్కుబడిగా కొంత మొత్తం చెల్లించినటప్పటికీ బకాయిలు మాత్రం పూర్తిగా క్లియర్ కాలేదు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఈ భారం పడింది. ఇంకా దాదాపు 3500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. దీంతో, తాజాగా ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు …
Read More »ఎమ్మెల్సీగా రాములమ్మ ప్రమాణం… తర్వాతేంటీ?
తెలంగాణ శాసన మండలికి ఇటీవలే ఎన్నికైన పలువురు సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్, బీజేపీ తరఫున ఎన్నికైన సభ్యులంతా ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. దీంతో శాసన సభ ప్రాంగణం ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా …
Read More »హమ్మయ్యా… మిథున్ రెడ్డికీ ఊరట లభించింది
వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటుగా ఆ పార్టీ పేరు చెప్పుకుని చాలా మంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ఆ అక్రమాలపై వరుసగా కేసులు నమోదు కాగా… ఆ కేసుల నుంచి, కనీసం అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు వైసీపీకి చెందిన చాలా మంది కీలక నేతలు వరుసగా కోర్టులకు క్యూ కట్టారు. చాలా మంది ముందస్తు బెయిళ్లు తెచ్చుకున్నారు. ఆ …
Read More »అమరావతికి మరో గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.750 కోట్లు విడుదల
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి నిధుల కష్టాలు తొలగిపోయాయి. అమరావతిలోని ప్రధాన భవనాల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, అసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.15,000 కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల నిధుల మంజూరు అయ్యాయి. అదే సమయంలో కేంద్రం తన వాటా కింద అమరావతికి రూ.1,500 కోట్ల నిధులను ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిధులు… ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి …
Read More »కిం కర్తవ్యం.. వక్ఫ్పై చిక్కుల్లో వైసీపీ ..!
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మై నారిటీ ముస్లింలు.. చర్చ చేస్తున్నారు. దీనిలో వాస్తవం ఎంత? అనేదానిపై వారు దృష్టి పెట్టారు. అయితే.. ఈ విషయంపై వైసీపీ ఎదురు దాడి చేసింది. తాము పూర్తిగా మైనారిటీలకు అనుకూలమేనని.. లోక్సభలో ఈ మేరకు ఓటింగుకు కూడా దూరంగా ఉండి.. వ్యతిరేకంగా ఓటేశామని చెప్పింది. కానీ, రాజ్యసభకు వచ్చే సరికి.. మాత్రం.. వైసీపీ …
Read More »బాబు భద్రతపై ఇంత నిర్లక్ష్యమా?.. ఏం జరుగుతోంది?
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దేశంలో అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే దక్కుతున్న పటిస్ట భద్రతా వలయంలో కొనసాగుతున్నారు. దాదాపుగా దేశ ప్రధానికి అందుతున్న భద్రతా వలయానికి కాస్త అటూ ఇటూగా చంద్రబాబుకు భద్రత కొనసాగుతోంది. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పటిష్ట భద్రతలోనూ లోపాలు కనిపిస్తున్న తీరు నిజంగానే ఆందోళనకు గురి చేసేదే. ఈ భద్రతా వలయంలో ఉన్న నేతలు ఎక్కడికి వెళ్లినా.. …
Read More »బీఆర్ఎస్ రజతోత్సవం.. ఏర్పాట్లు సరే.. అసలు సమస్య ఇదే!
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ రజతోత్సవాలకు రెడీ అయింది. ఈ నెల 27వ తేదీకి బీఆర్ ఎస్(అప్పటి టీఆర్ ఎస్) పెట్టి.. 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించాలని పార్టీ భావించిం ది. పోరాటాల పురిటి గడ్డ వరంగల్లును వేదికగా నిర్ణయించుకుంది. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. పార్టీ శ్రేణులు …
Read More »పవన్ ‘బాట’తో డోలీ కష్టాలకు తెర పడినట్టే!
డోలీ మోతలు… గిరిజన గూడేల్లో నిత్యం కనిపించే కష్టాలు. పట్టణ ప్రాంతాలు ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. పూర్తిగా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరి పుత్రులకు రవాణా సౌకర్యాలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా అనారోగ్యం బారిన పడినా, ప్రసవ వేదన మొదలైనా, మెరుగైన చికిత్సల కోసమైనా గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. అయితే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు అందిన అదికారంతో పల్లె సీమలకు సంపూర్ణంగా …
Read More »కమ్యూనిస్టులకు కొత్త సారథి.. ఎవరంటే!
కమ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సారథి వచ్చారు. తమిళనాడులో జరుగుతున్న 24వ అఖిల భారత మహా సభల వేదికగా.. కొత్త నాయకుడిని ఎన్నుకుంటూ కమ్యూనిస్టులు తీర్మానం చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీతో అనుబంధంతోపాటు.. పార్టీకి హోల్ టైమర్గా వ్యవహరిస్తున్న ఎంఏ బేబీకి ఈ దఫా సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఈ మేరకు ఆయన పేరును సీపీఎం సమన్వయ కర్త, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రకాశ్ కారత్ ప్రతిపాదించారు. …
Read More »