ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి రెండు మాసాలు పూర్తయ్యాయో లేదో.. టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తన కలల ప్రాజెక్టు అమరావతి రాజధానికి ఇప్పటి వరకు 30 వేల కోట్ల రూపాయలను ఆయన సమీకరించే ప్రయత్నం చేశారు. దీంతో రాజధాని నిర్మాణం పరుగులు పెట్టడం ఖాయమని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణ సాయం అందించేందుకు …
Read More »బాబుకు ఈ ఐడియా రాలేదా?
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రాష్ట్రంలోని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. “నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే” అని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళా …
Read More »భారం కాని సంక్షేమం.. బాబు ప్లాన్ ఏంటి
అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందా? ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఏడాదికి 200 కోట్ల రూపాయలు అదనంగా ఈ క్యాంటీన్ల కోసం వెచ్చించాల్సి ఉందా? అలాంటప్పుడు ఈ క్యాంటీన్ ల వల్ల ప్రభుత్వానికి భారమే తప్ప ప్రయోజనం ఏంటి? అనేది ఇప్పుడు ప్రశ్న. నిజానికి అన్న క్యాంటీన్ ఉద్దేశం పేదలకు చెరువ కావడం. సంక్షేమం అమలు చేయడంలో వైసిపి కన్నా తామే ముందున్నామని చెప్పుకునే లక్ష్యంతో టీడీపీ అధినేత …
Read More »శంషాబాద్ ఎయిర్‌పోర్టు పేరు మార్చేస్తాం: కేటీఆర్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం సెక్రటేరియట్ ముందు తమ హయాంలో కేటాయిం చిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పెడుతుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాగే చేస్తే.. తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తాము మళ్లీ అధికారం లోకి వస్తామని.. అప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. …
Read More »ఐపీఎస్‌లు.. రాజకీయ దుమారం వెనుక… !
రాష్ట్రంలో ఐపీఎస్ ల వివాదం కొనసాగుతోంది. వైసీపీ హయంలో పనిచేసిన 16 మంది కీలక ఐపీఎస్ అధికారులను ప్రస్తుత ప్రభుత్వం వెయిటింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే వీరందరిని ఉదయం 10 గంటలకు డిజిపి ఆఫీసుకి రావాలని సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండాలని ఆదేశించడం, అదేవిధంగా రిజిస్టర్లలో సంతకాలు చేసి వెళ్ళాలి అని ప్రభుత్వం పేర్కొనడంతో ఇది వివాదంగా మారింది. వాస్తవానికి వెయిటింగ్ లో ఉన్న …
Read More »బాబు ఢిల్లీ టూర్.. జాతీయ మీడియా సంచలన కథనాలు.. !
చంద్రబాబు ఢిల్లీ పర్యటన వెనుక కేవలం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే అంశమే కాదని రాజకీయంగా కూడా ఇది ప్రాధాన్యం సంతరించుకుందని పలువురు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రి కలుసుకున్నారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యారు. అనంతరం ఆయన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అవుతారు. అయితే ఈ భేటీలో రాష్ట్రానికి …
Read More »సర్వేలో రేవంత్ కు ఎన్ని మార్క్స్ వచ్చయంటే
తెలంగాణలో గత ఏడాది నవంబరు-డిసెంబరు మధ్య కాలంలో ఏర్పడిన కాంగ్రెస్ పాలనకు సుమారు 250 రోజులు పూర్తయ్యా యి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాలనపట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎలా ఫీలవుతున్నారు? అనే విషయాలు ఆసక్తికరం. వాస్తవానికి 250 రోజులంటే పెద్దలేక్కలోకి రాకపోయినా.. ప్రస్తుతం సమస్యలతో సవాళ్లు చేస్తున్న ప్రభుత్వాలు.. ప్రజలను మెప్పించడంలో ఒక్కరోజు సక్సెస్ అయినా.. అది ఏడాదిపాటు ఆక్సిజన్‌లా మారిన పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ …
Read More »ఎన్నికల తంత్రంలో `హత్యాచార` రాజకీయం!
రాజకీయాలు చేసేందుకు వస్తువుతో పనిలేదు.. అవకాశం, అవసరం అనే రెండు పట్టాలే ముఖ్యం. మారుతున్న కాలంలో నాయకులు, పార్టీల పంథా కూడా ఇదే వస్తు ప్రాధాన్యాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. “ఏం చేస్తావన్నది కాదు.. గెలిచామా? లేదా?“ అన్నది ముఖ్యం అంటూ.. సాక్షాత్తూ.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మహారాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఏడాది కిందట బహిరంగంగా చేసిన వ్యాఖ్య …
Read More »అందరూ జైలుకు పోతే మనుగడ ఎలా జగనన్నా
వైసీపీలో వార్నింగ్ గంటలు మోగుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరుగా అరెస్టు అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు బెయిల్ కూడా రాలేదు. వచ్చే అవకాశం కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇక, ఇప్పుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్టయ్యాయి. ఆయనకు కూడా ఇప్పట్లో బెయిల్ దక్కే ఛాన్స్ లేదు. దీనికి కారణం.. ఏసీబీ ఆయనను అరెస్టు చేసింది. …
Read More »వైసీపీతో బంధం పూర్తిగా తెంచేసుకున్న నాని!
ఆళ్ల నాని. ఏలూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు, వైసీపీ హయాంలో కాపుల కోటాలో ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని రోజుల కిందట ఆయన.. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. ఇప్పుడు ఏకంగా ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించినట్టు చెప్పారు. తాజాగా ఏలూరులో …
Read More »రంకెలేస్తే..అంకెలు సరిపోవు..
గత రెండు రోజులుగా తెలంగాణను కుదిపేస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు రాజీనామా వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తాజాగా హరీష్ రావు మీడియా ముందుకు వచ్చారు. సంపూర్ణ రుణ మాఫీ చేస్తే.. రాజీనామా చేస్తానన్న మాట తనకు గుర్తుందని తెలిపారు. ఆ మాటకు తాను కట్టబడి ఉన్నానని చెప్పారు. అయితే.. సంపూర్ణ రుణ మాఫీ చేసినట్టు ప్రభుత్వం నిరూపించాలని సవాల్ రువ్వారు. ఈ సవాలును …
Read More »ఆ మూడ్‌లోనే జగన్.. బయటకు వచ్చేదెప్పుడు..?
ఎన్నికలు జరిగిన నాలుగు నెలలు అయింది. ఫలితం వచ్చి కూడా రెండు మాసాలు అయిపోయింది. గెలుస్తామని భావించి లెక్కలు వేసుకున్న వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. అయితే.. ఇంకా ఆ మూడ్ నుంచి వైసీపీ అధినేత జగన్ బయటకు వచ్చినట్టు కనిపించడం లేదు. నిజానికి ఒక నెల రోజుల పాటు షాక్ లో ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే.. 2019 ఎన్నికల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు కూడా ఓడిపోతామని అంచనా వేయలేదు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates