టీడీపీ అధినేత చంద్రబాబు మానస పుత్రికగా పేర్కొనే అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని, పేదల ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తొలి క్యాంటీన్‌ను ఆయన గుడివాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ రోజే ఆయన బ్యాంకు ఖాతా వివరాలను కూడా వెల్లడించారు. ఇక, ప్రతి ఒక్కరూ కదలి రావాలని …
Read More »అధికారం పోయినా.. అహంకారం పోలే: రేవంత్
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయినా.. అహంకారం పోలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయం వద్ద దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం పెడితే.. తాము అధికారం చేపట్టాక దానిని తొలగిస్తామని.. సోమవారం.. కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ కీలక …
Read More »మంత్రి సత్యకుమార్‌కు కొత్త చిక్కు వచ్చి పడిందే..?
బీజేపీ రాష్ట్ర మంత్రి, సీనియర్ నాయకుడు సత్యకుమార్ యాదవ్‌కు కొత్త చిక్కు వచ్చింది. పార్టీ పరంగా కంటే.. మంత్రిత్వ శాఖ పరంగా ఆయన సమస్యలు ఎదుర్కొంటున్నారు. బీజేపీ నాయకుడు కావడం.. పైగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో సత్యకుమార్ ఓ కీలక విషయంలో చిక్కులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే ఆయుష్మాన్ భారత్. దీనిని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. బీజేపీ పాలిత, …
Read More »“వైసీపీలో దండు పాళ్యం బ్యాచ్”
వైసీపీలో ఉన్నవారంతా దండు పాళ్యం బ్యాచేనని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైరయ్యారు. వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులు అన్ని వ్యవస్థలను నాకించేశారని చెప్పారు. ఎక్కడికక్కడ తప్పులు కనిపిస్తున్నాయని.. అయితే, విచారణలకు భయపడి రికార్డులను, ఫైళ్లను కూడా తగుల బెడుతున్నారని దుయ్యబట్టారు. “జగన్‌కు ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా?” అని వెంకన్న ప్రశ్నించారు. వైసీపీ హయంలో అందిన కాడికి దండుపాళ్యం …
Read More »నిప్పు రాజేసిన రాజీవ్ గాంధీ !
తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టాపన వ్యవహారం నిప్పు రాజేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారడంతో ఈ పరిణమాలు ఎక్కడికి దారితీస్తాయో తెలియడం లేదు. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ది చేసింది. ఈ లోపు తెలంగాణ …
Read More »రేవంత్ రెడ్డికి ‘కులం’ తలనొప్పి
అధికారంలో ఉన్న వాళ్లు కుల సంఘాల సమావేశాలకు వెళ్తే లేని పోని తలనొప్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆయన గత నెలలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్‌కు వెళ్లారు. అందులో ఆ కులానికి చెందిన వారు చెప్పుకున్న గొప్పల గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. వాళ్లను పొగుడుతూ రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల …
Read More »రామోజీ రుణం తీర్చుకుంటున్న చంద్రబాబు?
టీడీపీ అధినేత చంద్రబాబుకు, దివంగత ఈనాడు అధిపతి రామోజీరావుకు మధ్య ఉన్న ఫెవికాల్ బం ధం గురించి అందరికీ తెలిసిందే. 1983లో రామారావు కోసం అహర్నిశలు పనిచేసిన.. రామోజీ తర్వాత కాలంలో ఆయనతో విభేదించారు. ఇదేసమయంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు. దీనికికారణం వేరే ఉందని అంటారు. రామోజీ ఫిలింసిటీ ఆలోచన 1980లలో నేరామోజీరావు మొగ్గ తొడిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టూడియోలను ఆయన పరిశీలించారు. ఈక్రమంలో అంతకుమించిన ఫిలిం …
Read More »వేణు స్వామిని కడిగి పారేశారు
వేణు స్వామి.. ఈ జ్యోతిష్యుడి గురించి పరిచయం అవసరం లేదు. సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల భవితవ్యం గురించి జోస్యం చెబుతూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారీయన. కొన్ని సందర్భాల్లో ఆయన జోస్యాలు ఫలించాయి. చాలానే తేడా కొట్టాయి. ఐతే సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా వెళ్లిపోయి అవసరం లేని సందర్భాల్లోనూ జోస్యాలు చెప్పడంతో వేణు స్వామి మీద తీవ్ర విమర్శలు తప్పలేదు. ఇటీవలే నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం …
Read More »రాఖీ రగడ: జగన్ వర్సెస్ షర్మిల
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య కుటుంబ వివాదాలు సహా.. రాజకీయ వివాదాలు కూడా ఓ రేంజ్లో కొనసాగుతున్నాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్న జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఆమె తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు. ఈ ప్రభావంతో పాటు ప్రజల్లో పెల్లుబికిన వ్యతిరేకత కారణంగా 151 స్థానాలున్నవైసీపీ 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. అయితే.. …
Read More »`పీపీపీ` విధానంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్(పీపీపీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని తప్పు పట్టిన వారే.. తర్వాత కాలంలో అనుసరిస్తున్నారని ఆయన అన్నారు. “మొట్టమొదట ఉమ్మడి ఏపీలో నేనే పీపీపీ విధానం అమలు చేశారు. ఆ రోజు నేనేదో తప్పు చేస్తున్నానని కొందరు గగ్గోలు పెట్టారు. కానీ, ఆ మోడల్‌తోనే నేను హైటెక్ సిటీని నిర్మించా. ఇది ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తున్న ఆదాయంలో సింహభాగం దీని …
Read More »బీజేపీ వంతు.. సవ్వడిలేని సభ్యత్వ నమోదు
రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ తరఫున సభ్యత్వాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికిపైగా సభ్యత్వాలు తీసుకున్నారు. తద్వారా.. రూ.500 సభ్యత్వం కట్టిన వారికి రూ.5 లక్షలవరకు ప్రమాద బీమాను కల్పించారు. దీనికితోడు పవన్‌పై ఉన్న అభిమానంతో ఎక్కువ మంది పార్టీలో సభ్యత్వాలు తీసుకున్నారు. ఇక, ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఆ పార్టీ కూడా …
Read More »ఏపీకి `అవార్డు`.. నాదా-నీదా!
ఏపీకి తాజాగా ఓ అవార్డు వచ్చింది. సంప్రదాయ ఇంధన వనరుల విభాగంలో వచ్చిన `గ్రీన్ ఎనర్జీ చాంపియన్` అవార్డు.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ విండ్ పవర్ అసోసియేషన్ 2023-24 సంవత్సరానికి గ్రీన్ ఎనర్జీ చాంపియన్ గా ఏపీని ప్రకటించింది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ఏపీకి ప్రదానం చేశారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం. కమలాకర్ బాబు ఈ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates