పార్టీని నడపడం చాలా కష్టంగా ఉందని వైసీపీ ముఖ్యనాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం 11 మంది పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో 10 మంది వరకు పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాదన్నారు. అందరూ జగన్‌కు విధేయులేనని.. అయితే, ఒకరిద్దరు దారి తప్పినంత మాత్రాన అందరినీ అదే రాటన కట్టవద్దని ఆయన పేర్కొన్నారు. మీడియా సంయమనం …
Read More »ఎవరున్నా వదలద్దు.. ప్రతి 3 గంటలకూ రిపోర్టు ఇవ్వండి: చంద్రబాబు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినుల మరుగు దొడ్లలో హిడెన్ కెమెరాలు పెట్టి.. రికార్డు చేశా రన్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై హుటాహుటిన స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఉన్నతాధికారులతో ప్రతి 3 గంటలకు ఒకసారి మాట్లాడుతున్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా.. వదిలి పెట్టరాదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో ఘటన విషయం తెలిసిన విషయం …
Read More »వివాదాస్పద మొక్కలపై పవన్ కామెంట్స్!
ఏపీలో వివాదాస్పదంగా మారిన ‘కోనోకార్పస్’ మొక్కల వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మొక్కలను పెంచొద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు.. విదేశాల్లోనూ ఈ మొక్కలను పెంచడం లేదని.. వీటి వల్ల మేలు జరగకపోగా.. కీడు జరుగుతుందని చెప్పారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ‘మనం-వనం’ కార్యక్రమానికి సంబంధించి పవన్ కల్యాణ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన ఈ కార్యక్రమంలో ప్రతి …
Read More »వైసీపీకి మామూలు షాక్ కాదు!
ప్రతిపక్ష వైసీపీకి అలాంటి ఇలాంటి షాక్ కాదు.. పెద్ద భారీ షాకే తగిలింది. ఆయన ఏరికోరి ఎంచుకుని మరీ శాసన మండలికి పంపించిన ఇద్దరు తాజాగా రిజైన్ చేశారు. అది కూడా ఎలాంటి హడావుడీ లేకుండా.. ఎలాంటి వార్తలు లీక్ చేయకుండా.. సైలెంట్‌గా తమ పదవులకు రాజీనామా చేసేశారు. వారు నేరుగా శాసన మండలికి వచ్చి.. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో చైర్మన్.. మోషేన్‌రాజుకు తమ రాజీనామా పత్రాలను …
Read More »ఇలా ఘటన.. అలా రియాక్షన్: షర్మిలకు జగన్‌కు తేడా ఇదే!
ఏపీలో జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల వెంటనే స్పందిస్తున్నారు. నిజానికి 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న జగన్ వెంటనే రియాక్ట్ అవ్వాలి. కానీ, తాడేపల్లి ప్యాలెస్ గడప దాటి రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పోనీ.. ట్విట్టర్లో అయినా.. స్పందిస్తున్నారా? అంటే.. ప్రజలు తనను గెలిపించలేదన్న ఆవేదన నుంచి ఆయన ఇంకా కోలుకున్నట్టు లేరు. అందుకే చాలా నిదానంగా.. రియాక్ట్ అవుతున్నారు. కానీ, షర్మిల మాత్రం ప్రజాప్రతినిధులు …
Read More »ఐదేళ్ల నిర్లక్ష్యం.. పాతికేళ్ల ఎఫెక్ట్..
ఏపీలో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. వ్యవస్థలను బాగు చేస్తున్నామనే మాట వినిపిస్తున్నారు. ఇక, ఆయన మంత్రివర్గంలోని వారు కూడా ఇదే చెబుతున్నారు. వ్యవస్థలను బాగు చేస్తున్నామని.. చెబుతున్నారు. దీనికి కారణం.. ఐదేళ్ల వైసీపీ పానలలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నది టీడీపీచెబుతున్న మాట. అంతేకాదు.,. మద్యం, విద్యత్ వంటి కీలక విషయాల్లో అయితే.. పాతికేళ్లకు సరిపడా వైసీపీ ఒప్పందాలు చేసుకుని.. అప్పులు తెచ్చుకుంది. ఇప్పుడు వాటిని సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నది …
Read More »వైసీపీకి ఎమ్మెల్యేలు సేఫే రీజన్ ఇదే!
ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఏక్షణంలో ఎలా మారుతాయో.. చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక ఎమ్మెల్సీ ఇప్పటికే వైసీపీకి దూరమయ్యారు. వారి పదవులకు, పార్టీకి కూడా రిజైన్ చేశారు. ఇక ముందు కూడా మరింత మంది పార్టీ మారే అవకాశం ఉందని పెద్ద ఎత్తున విశ్లేషణలు , వార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఒక పార్టీ ప్రభుత్వం పోయి.. మరో పార్టీ అధికారంలోకి వస్తే.. …
Read More »జగనన్నకు రోజా షాక్.. పార్టీకి బై!?
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, జబర్దస్త్ రోజా.. ఆ పార్టీకి దూరమవుతున్నారా? ఇక, వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఏకంగా తన మకాం.. తమిళనాడుకు మార్చేస్తున్నారా? ఇదీ.. గత రెండు రోజులుగా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అయితే.. దీనికి నిన్న మొన్నటి వరకు ప్రత్యేకంగా ఆధారాలు లభించలేదు. దీంతో ఇది నిజమో కాదో.. అన్న చర్చ అయితే.. సాగింది. ఇప్పుడు దీనికి సంబంధించి రోజా చిన్న క్లూ ఇచ్చేసినట్టు …
Read More »ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు: పొద్దు పొద్దున్నే ‘హైడ్రా హడల్!
ఒకవైపు హైడ్రాపై చర్చలు జరుగుతున్న సమయంలో.. ఆ సంస్థ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పొద్దు పొద్దున్నే వాలిపోతోంది. రాత్రి నిద్ర పోయిన వారుతెల్లవారి కళ్లు తెరిచేలోగానే హైడ్రా కూల్చివేతలు పూర్తి చేసేస్తోంది. నిజానికి ఈ కూల్చివేతల సమయంలో అడ్డుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. న్యాయ స్థానం మెట్లు ఎక్కేందుకు చూస్తున్నారు. కానీ.. కోర్టుల్లో పిటిషన్ వేసే లోగానే హైడ్రా పని చేసేస్తోంది. దీంతో వారికి ఊరట లభించడం లేదన్న వాదన …
Read More »మాజీ ఎంపీకి.. మిథున్‌రెడ్డి భారీ కానుక.. ఎందుకు?
చిత్తూరు మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు రెడ్డప్పకు రాజంపేట ప్రస్తుత ఎంపీ, సీనియర్‌నేత మిథున్‌రెడ్డి భారీ కానుకనే అందించారు. సుమారు 20 లక్షల రూపాయల విలువైన కారును ఆయన బహూకరించారు. ఈ నెల తొలి వారంలో మిథున్‌రెడ్డి.. రెడ్డప్పను పలకరించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సమ యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా.. అక్కడకు చేరుకున్నారు. దీంతో …
Read More »‘నిర్మలమ్మ పర్యటనకు 4 వేలు ఖర్చు పెట్టా.. ఇప్పించండి’
ఔను.. మీరు చదివింది నిజమే. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పర్యటన నిమిత్తం తాను రూ.4,230 ఖర్చు పెట్టానని.. ఆ సొమ్మును తిరిగిఇప్పించాలని కోరుతూ.. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి ఓ మహిళా నాయకురాలు ఫిర్యాదు చేశారు. తాజాగా వారధి పేరుతో బీజేపీ ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మండలం, రాయపాడు గ్రామానికి చెందిన సర్పంచ్ కాటమనేని …
Read More »ఏఐ నగరంగా అమరావతి!
ఏపీ రాజధాని అమరావతి.. ఇక ఏఐ నగరంగా అవతరించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కేంద్రం గా మారనుంది. ప్రస్తుత ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే 10 ఏళ్లలో అన్ని ప్రాంతాలు, నగరాలు, రాష్ట్రాలు కూడా.. ఏఐని అందిపు చ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా.. ఏఐలోనే లభించనున్నాయి. దీనిని ముందుగానే గుర్తించిన సీఎం చంద్రబాబు తాజాగా.. అమరావతిని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates