తొక్కిసలాట కేసులో అరెస్టు అయిన అల్లు అర్జున్.. చంచలగూడ జైలుకు వెళ్లటం తెలిసిందే. ఈ అంశాన్ని నేషనల్ మీడియా మొదలు లోకల్ మీడియా వరకు అందరూ కవర్ చేశారు. ఇంతకూ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసు అధికారి ఎవరు? అతడి స్థాయి ఏమిటి? అతడికి సంబంధించిన వివరాలు ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేయగా.. కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
అదేమంటే.. అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసు అధికారి పేరు రాజు నాయక్. చిక్కడపల్లి సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయనకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఎప్పటికైనా ఒక్కసారైనా అల్లు అర్జున్ తో కలిసి ఫోటో దిగాలనుకునేవాడు. తన సన్నిహితులు.. స్నేహితుల వద్ద అల్లు అర్జున్ మీద తనకున్న అభిమానాన్ని.. తనకున్న కోరికను చెప్పేవారట.
అలాంటి రాజు నాయక్ కు.. విషమ పరీక్ష ఎదురైంది. తన అభిమాన హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ.. విధినిర్వహణలో భాగంగా తనకెంతో ఇష్టమైన అభిమాన హీరోను తన చేతులతో అరెస్టు చేయాల్సి వచ్చింది. దీనికి ఆయన కాస్తంత ఇబ్బందికి గురైనట్లు చెబుతున్నారు. మరోవైపు రాజు నాయక్ కెరీర్ ను చూస్తే..క్లీన్ చిట్ గా కనిపిస్తుందని చెబుతున్నారు. అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించే అతడి మీద ఎలాంటి ఆరోపణలు లేవని చెబుతున్నారు. నిజాయితీతో పని చేసే అధికారిగానే కాదు.. వ్యక్తిగతంగా చూస్తే సేవా భావంతో తన ఊరికి ఎన్నో మంచి పనులు చేస్తారన్న మాట పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates