ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో మొదటి నుంచి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డిలతో పాటు సీఎం కేసీఆర్ తనయురాలు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. సౌత్ సిండికేట్ తరఫున ఆప్ మంత్రి సిసోడియాకు 100 కోట్ల రూపాయల మొత్తాన్ని కవిత, మాగుంట ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. …
Read More »పులివెందులపై వాళ్లు.. కుప్పంపై వీళ్లు..
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పంతాలు, పట్టింపులు మరింత పెరుగుతున్నాయా? ఏకంగా ఆయా పార్టీల అధినేతలను ఓడించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే.. కొన్నాళ్లుగా జరుగుతున్న రాజకీయాలను పరిశీలిస్తే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అధికారంలో ఉన్న వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించాలనే లక్ష్యం పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిం ది. కుప్పం …
Read More »సీట్ల పంచాయితి తెగటంలేదా ?
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు విషయం వామపక్షాలకు ఎంతకీ తెగటం లేదు. అసలు కమ్యూనిస్టులతో పొత్తు వద్దని చాలామంది సీనియర్లు పదేపదే చెబుతున్నారు. ఎందుకంటే పొత్తుల్లో కమ్యూనిస్టులకు ఇచ్చే సీట్లతో పోటీచేసే అవకాశం తమకు ఎక్కడ చేజారిపోతుందో అనే టెన్షన్ చాలామందిలో పెరిగిపోతోంది. ఈ కారణంతోనే కేసీయార్ కమ్యూనిస్టులతో పొత్తు వద్దు పొమ్మంది. కేసీయార్ తరిమేస్తేనే తమ దగ్గరకు వచ్చిన కమ్యూనిస్టులతో తామెందుకు పొత్తు పెట్టుకోవాలని వాదించే సీనియర్లు …
Read More »విద్యుత్ చార్జీలు పెంచబోం: చంద్రబాబు హామీ!
వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని, ఏపీలో అధికారం చేపట్టాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్ర బాబు.. దానికి అనుగుణంగానే అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నారు. అదేసమయంలో ప్రజలకు ఎన్నికల వరాలు కూడా ఇస్తున్నారు. మేలో జరిగిన మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో మహిళలపై అనేక వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అక్కడితో కూడా ఆగకుండా.. తాజాగా కీలకమైన విద్యుత్ చార్జీల విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ప్రస్తుతం నాలుగేళ్ల పాలనలో …
Read More »రాజాసింగ్‌కు పోటీగా బీజేపీలోనే మాజీ మంత్రి తనయుడు
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి పోటీ చేస్తారా? ఆయనపై బీజేపీ అధిష్ఠానం విధించిన సస్పెన్షన్ తొలిగిపోతుందా? అనే ప్రశ్నలు ఓ వైపు ఉండగానే.. మరోవైపు రాజాసింగ్‌కు సొంత పార్టీ నుంచే పోటీ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ టికెట్ కోసం మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు, బీజేపీ నేత విక్రమ్ గౌడ్ దరఖాస్తు చేసుకోవడమే అందుకు కారణం. దీంతో గోషామహల్ నియోజకవర్గం …
Read More »హోం గార్డు కన్నుమూత… ఈ చావుకు బాధ్యులెవరు?
తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారుకు హోం గార్డు రవీందర్ మృతి కేసు సెగ భారీగా తగులుతోంది. జీతాలు సరిగా ఇవ్వడం లేదని, ఉన్నతాదికారులు తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ.. నాలుగు రోజుల కిందట ఘోషామహల్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న 38 ఏళ్ల రవీందర్ తాజాగా శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హోం గార్డుల్లో తీవ్ర అలజడి చోటు చేసుకుంది. ఇప్పటికే రవీందర్‌కు మద్దతుగా హోం …
Read More »కోమటిరెడ్డికి బుజ్జగింపులు.. మరి టికెట్?
కాంగ్రెస్ తెలంగాణ నాయకుల్లో దాదాపు కీలక నేతలంతా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కోమటిరెడ్డితో చర్చించారు. ఇదంతా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహాల గురించి జరిగిన సమావేశాలు అనుకుంటే పొరపడ్డట్లే. కాంగ్రెస్ అధిష్ఠానం మీద అలిగిన కోమటిరెడ్డిని బుజ్జగించే చర్యలివి. పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, కీలక పదవులు ఇవ్వడం లేదని కోమటిరెడ్డి మరోసారి అలక …
Read More »ఏపీలో అక్రమ మద్యం.. మహిళా వాలంటీర్ అరెస్టు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాకుండా వాలంటీర్ల ముసుగులో కొంతమంది అన్యాయం, అక్రమాలకు తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు వాలంటీర్లు ఏపీకి అక్రమంగా …
Read More »మైనంపల్లి పంతం నెగ్గింది.. కానీ
తన తనయుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పంతం నెగ్గించుకున్నట్లే. కొడుకు రోహిత్‌ను మెదక్ నుంచి పోటీ చేయించేందుకు మైనంపల్లికి మార్గం సుగమమమైంది. కానీ అది బీఆర్ఎస్ నుంచి మాత్రం కాదు. కాంగ్రెస్ నుంచి. అవును.. మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. అందుకు ముహూర్తం కూడా కుదిరింది. ఈ నెల 17న నిర్వహించే బహిరంగ సభలో హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ కాంగ్రెస్ కండువా …
Read More »ప్రముఖుల దరఖాస్తులు ఎక్కడ ?
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న నేతలు ఎంత స్ధాయి వారైనా సరే దరఖాస్తు చేసుకోవాల్సిందే అని బీజేపీ అధిష్టానం ముందే స్పష్టం చేసింది. దీని ప్రకారమే తెలంగాణా బీజేపీ 2వ తేదీనుండి దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ మొదలుపెట్టింది. అంటే ఇప్పటికి నాలుగురోజుల నుండి తీసుకుంటున్న దరఖాస్తులు సుమారు 750 దాటాయి. దరఖాస్తు చేసుకోవటానికి ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఎంతమందైనా దరఖాస్తులు చేయవచ్చు. ఈ పద్దతిలోనే వందలాది దరఖాస్తులు …
Read More »జనసేన, వైసీపీ కోటల్లో… లోకేష్ ఎంట్రీ !
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇప్పటి వరకు రాయలసీమ నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వరకు జోరుగా సాగింది. అనేక సామాజిక వర్గాలు, వివిధ వృత్తులకు చెందిన వారు ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారు నారా లోకేష్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. బాధలు చెప్పుకొన్నారు. ఇక, ఈ సందర్భంగా నారా లోకేష్ కూడా …
Read More »పాపం పూలమ్మనే చోటే కట్టెలమ్ముతోన్న ‘తుమ్మల ‘…!
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలు అమ్మిన చోటే ఇప్పుడు కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చేసింది. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్న తుమ్మల ఏ పార్టీలో ఉన్న తన ఆధిపత్యం చెలాయించుకుంటూ వచ్చారు. అప్పుడు తెలుగుదేశం… ఆ తర్వాత బీఆర్ఎస్ లోనూ ఆయన మంత్రి పదవులు చేపట్టారు. 2018 ముందస్తు ఎన్నికల్లో పాలేరులో మంత్రిగా ఉండి కూడా తుమ్మల చిత్తుగా ఓడిపోయారు. తుమ్మలపై …
Read More »