న‌మో-న‌మో-న‌మో.. నారా లోకేష్ 21 సార్లు!

ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ త‌న ప్ర‌సంగంలో ఏకంగా 21 సార్లు న‌మో అనే ప‌దాన్ని ప‌ల‌క‌డం అంద‌రినీ ఆశ్చ ర్యానికి గురి చేసింది. ప్ర‌తి వాక్యంలోనూ ఆయ‌న న‌మో అంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేరును ప్ర‌స్తావించారు. తాజాగా విశాఖ‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తొలుత స‌భ‌లో నారా లోకేష్ ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న న‌రేంద్ర మోడీ పేరును 21 సార్లు న‌మో అంటూ పేర్కొనడం స‌భికుల‌నే కాదు.. రాజ‌కీయ నాయ‌కుల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ప్ర‌తి వాక్యంలోనూ న‌మో అంటూ ఆయ‌న ప్ర‌సంగించారు.

న‌మో అంటే-న‌రేంద్ర మోడీ అంటూ.. ప్ర‌సంగం ప్రారంభించిన నారా లోకేష్‌.. ఆసాంతం న‌మోను ప‌దే ప‌దే ప‌లికారు. న‌మో విజ‌న్‌, న‌మో భార‌త్, న‌మో ప్ర‌ధాని, న‌మో హృద‌యం అంటూ.. ప్ర‌తి ప‌దానికీ ఆయ‌న న‌మోను జోడించారు. విశాఖ‌ను సిటీ ఆఫ్ డెస్టినీగా పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి న‌మోకు ఘ‌న స్వాగం అంటూ ప్రారంబించారు. ఒకటి రెండు సార్లు మాత్ర‌మే న‌రేంద్ర మోడీ అన్న నారా లోకేష్‌.. త‌ర్వాత‌.. త‌న ప్ర‌సంగంలో న‌మో అంటూనే కొన‌సాగించారు. ప్ర‌ధాని అనే అర్థాన్ని న‌మో మార్చేశారు`` అని వ్యాఖ్యానించారు. గ‌తంలో ప్ర‌ధానులుగా ఉన్న‌వారు కేవ‌లం కుర్చీకే ప‌రిమితం అయితే..న‌మో` మాత్రం ప్ర‌జ‌ల మ‌నిషి అయ్యార‌ని తెలిపారు.

నమో విజన్ ప్ర‌పంచ స్థాయి అయితే.. న‌మో హృద‌యం భార‌త ప్ర‌జ‌ల స్థాయిలో ఉంటుంద‌ని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. నమో అంటే పేదల విశ్వాసం.. పేదల చిరునవ్వు నమో.. యువత భవిత నమో.. మహిళల ఆత్మగౌరవం నమో. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన‌ దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్న ప్ర‌ధాని కూడా నమో... న‌మో.. న‌మో అంటూ స‌భికుల క‌ర‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య నారా లోకేష్ త‌న ప్ర‌సంగాన్ని ఉద్విగ్నంగా సాగించారు. న‌మో రాక‌తో దేశం న‌యా మార్గం ప‌ట్టింద‌న్నా రు. అభివృద్ధి ఫ‌లాలు అంద‌రికీ అందేలా కృషి చేస్తున్నార‌నికొనియాడారు. ఇలా న‌మో పేరుతో నారా లోకేష్ త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు.