కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు కం ఏపీ మంత్రి నారా లోకేశ్ తీరు అందరూ మాట్లాడుకునేలా మారటం తెలిసిందే. విపక్షంలో ఉన్నప్పుడు.. పార్టీ కోసం తీవ్రంగా తపించిన ఆయన.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం లోప్రొఫైల్ మొయింటైన్ చేయటం.. అవసరానికి మించి ఎక్కడా కనిపించకపోవటం.. మంత్రిగా తన భాధ్యతలతో పాటు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టిన వైనం అప్పుడప్పుడు చర్చకు వస్తోంది.
తాజాగా విశాఖపట్నానికి వచ్చిన ప్రధాని మోడీ మనసులోనూ లోకేశ్ ముద్ర పడేలా వ్యవహరించారని చెప్పాలి. దీనికి సంబంధించి చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతమే కారణమని చెప్పాలి. సభా ప్రాంగణంలోకి వస్తున్న ప్రధాని మోడీని మంతరులు ఆహ్వానించే క్రమంలో.. ఆ వరుసలో లోకేశ్ కూడా ఉన్నారు. మంత్రులంతా ప్రధాని మోడీకి నమస్కరిస్తూ ఉండగా.. వారికి ప్రతి నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ముందుకునడుస్తున్న వేళ.. వరుసలో మంత్రి లోకేశ్ కూడా ఉన్నారు.
ప్రధాని మోడీ లోకేశ్ వద్ద కాసేపు ఆగారు. ఆయనకు లోకేశ్ నమస్కారం పెట్టినంతనే.. నీ మీద నాకో కంప్లైంట్ ఉందన్నారు. పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు ఆసక్తగా చూడగా.. అదేమిటో మీకు తెలుసు కదా? అంటూ చంద్రబాబు వైపు చూసి మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి ఆర్నెల్లు అయ్యింది. ఢిల్లీకి వచ్చి నన్ను ఎందుకు కలవలేదు? కుటుంబంతో వచ్చి నన్ను కలువు అంటూ లోకేశ్ భుజం తట్టారు.
దీనికి స్పందించిన లోకేశ్.. ‘త్వరలోనే వచ్చి కలుస్తా సార్’ అంటూ బదులిచ్చారు. ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది. లోప్రొఫైల్ ను మొయింటైన్ చేసిన లోకేశ్ తీరు.. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర కూడా రిజిస్టర్ అయ్యిందనటానికి తాజా ఘటన ఒకటిగా చెబుతున్నారు. ఏమైనా.. మోడీ మనసులో తన పేరు రిజిస్టర్ అయ్యేలా చేసుకోవటం లోకేశ్ పనితీరుకు నిదర్శనమంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates