అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన జగన్…అసెంబ్లీ సమావేశాలపై విమర్శలు చేశారు.

ఈ సమావేశాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అంతా పరనింద…ఆత్మస్తుతి అని సెటైర్లు వేశారు. తన కొడుకు లోకేశ్ కు చంద్రబాబు…చంద్రబాబుకు లోకేశ్…ఆ ఇద్దరికీ పవన్ కల్యాణ్ జాకీలు పెట్టి ఎత్తడం తప్ప జరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో సొంత డబ్బాలు, తప్పుడు ప్రచారాలు తప్ప తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదని అన్నారు. అయితే, జగన్ గత అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు మరిచిపోయినట్లు కనిపిస్తోంది. జగన్ ను పొగిడేందుకు వైసీపీ సభ్యులకు సమయం సరిపోయేది కాదంటే అతిశయోక్తి కాదు.

ఇక, మహిళా సభ్యులైతే జగనన్న అంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపించేవారు. ఇక, చంద్రబాబు, లోకేశ్, పవన్ లపై వైసీపీ సభ్యులు బూతులతో విరుచుకుపడుతుంటే జగన్ చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ ఆనందించేవారు.

ఒకవేళ చంద్రబాబు, పవన్, లోకేశ్ ల జాకీలను ఆపాలనుకున్న జగన్ అసెంబ్లీకి వస్తే బాగుండేది కదా. ఘోర పరాభవంతో జగన్ కు మొహం చెల్లకుంటే కనీసం తన 10 మంది ఎమ్మెల్యేలనైనా పంవచ్చు కదా?

గత అసెంబ్ల సమావేశాలను చంద్రబాబు బాయ్ కాట్ చేసినా సరే…టీడీపీ ఎమ్మెల్యేలను సభకు పంపించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏది ఏమైనా..అసెంబ్లీకి రాకుండా…సమాంతరంగా జగన్ పెడుతున్న ప్రెస్ మీట్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.