వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మేకపాటి కుటుంబానికి చెందిన కేఎంసీ అనే సంస్థకు అనుబంధంగా ఉన్న గురువాయూర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐపీఎల్) టోల్ చార్జీల వసూలు వ్యవహారంపై చర్చ జరుగుతోంది. కేరళలో రహదారుల నిర్మాణం కోసం కేఎంసీ తరఫున స్థాపించిన ఆ సంస్థ రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండా, …
Read More »జగనాసుర దహనానికి లోకేష్ పిలుపు
దసరా పండుగ సందర్భంగా ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న పిలుపునిచ్చారు. ఈ విజయ దశమి పండుగను సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా జరపాలని లోకేష్ పిలుపునిచ్చారు. దసరా నాడు దేశవ్యాప్తంగా రావణాసుర దహనం చేస్తుందని, మనం మాత్రం జగనాసుర దహనం చేద్దామని ప్రజలకు లోకేష్ పిలుపునిచ్చారు. అక్టోబరు 23న రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల …
Read More »ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుకు విజయ దశమి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం పండుగను ఆనందంగా జరుపుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు …
Read More »కాళేశ్వరం బ్యారేజీకి ఏమైంది? కేసీఆర్ సర్కారుకు కొత్త టెన్షన్
కీలకమైన ఎన్నికల వేళ కొత్త టెన్షన్ వచ్చింది కేసీఆర్ సర్కారుకు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల వేడి ఇప్పటికే రాష్ట్రంలో రాజుకున్న వేళ.. తనపై వస్తున్న విమర్శలకు.. ఆరోపణలకు సమాధానాలు చెబుతూ.. ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు తాజాగా ఎదురైన సవాలు ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి వంతెన కొంత మేర కుంగిన షాకింగ్ ఉదంతం శనివారం రాత్రి …
Read More »బీఆర్ ఎస్‌కు 70 సీట్లు పక్కా.. తాజా సర్వే వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్ ఆధిపత్యం సాధిస్తుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్‌కు 70 స్థానాలు లభిస్తాయని తెలిపింది. అయితే, అధికారంలోకి వచ్చేందుకు మాత్రం వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇండియా టీవీ సంస్థ తన సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం …
Read More »పశ్చిమ బెంగాల్ వ్యూహం తెలంగాణలో!
2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే.. ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేయనుందా? కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు ప్రణాళిక అమలు చేయనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో దెబ్బ కొట్టాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ను బరిలో దింపేందుకు …
Read More »పొత్తును ప్రజల్లోకి తీసుకెళ్లండి: పవన్ దిశానిర్దేశం
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లనున్నాయని.. ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఎక్కడా విభేదాలు వద్దని.. ఎవరితోనూ పేచీలు పెట్టుకోవద్దని ఆయనదిశానిర్దేశం చేశారు. తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం …
Read More »మా అమ్మను సీఐడీ బెదిరించింది.. కేసు పెడతానంది: లోకేష్ కంటతడి
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ రాష్ట్రస్థాయి నేతల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన మాతృమూర్తి విషయంలో సీఐడీ అధికారులు, జైలు అదికారులు వ్యవహరించిన తీరును వివరిస్తూ.. కన్నీటి పర్యంత మయ్యారు. `మా అమ్మను సీఐడీ అధికారులు బెదిరించారు. కేసులు పెడతామన్నారు. జైలులో ములాఖత్ అయిపోయినా.. టైం తెలియడం లేదా? అని విసురుగా మాట్లాడారు. ఇదేనా 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన …
Read More »కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా… భలే ఉన్నారే!
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బస్సు యాత్ర విజయవంతం కావడంతో పార్టీలో కొత్త ఉత్సాహం నిండింది. మూడు రోజుల పాటు రామప్ప నుంచి ఆర్మూరు వరకు సాగిన బస్సు యాత్రలో రాహుల్ గాంధీ ప్రజలతో సాగుతూ.. అధికార బీఆర్ఎస్ ను విమర్శిస్తూ సాగారు. దీంతో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ పర్యటన విజయవంతం కావడంతో పార్టీకి మరింత భరోసా …
Read More »చంద్రబాబు… తలవంచడు, తల దించడు: నారా లోకేష్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరికీ తలవంచబోరని, తల దించబోరని ఆ పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీలో సంక్షోభం కొత్తకాదన్నారు. తాజాగా ఆయన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నారా లోకేష్ మాట్లాడారు. “నా కలలో కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది అని ఊహించలేదు. గతంలో ఏ కష్టం వచ్చినా మన అధినేతలు ఎన్టీఆర్, చంద్రబాబు ముందుండి పోరాడేవారు. అయితే, నాటి పోరాటం …
Read More »దండం పెట్టి మరీ అడుగుతున్న కేసీఆర్
తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఆ దిశగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ను పరుగులు పెట్టిస్తున్నారు. బహిరంగ సభలతో కేసీఆర్ కూడా రాష్ట్రంలో రాజకీయ వాతావారణాన్ని వేడెక్కించారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఎన్నికల్లో నిలబడితే విజయం పక్కా అనే అభిప్రాయాలున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ కేసీఆర్ పేరుతోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దండం పెట్టి మరీ అడుగుతున్నా ఈ …
Read More »ఒక్కొక్క సీటుకు ముగ్గురికి మించి.. కాంగ్రెస్‌కు తల తిరుగుతోందిగా!
ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అయితే.. ఖరారు చేయని సీట్లే ఇప్పుడు పార్టీకి తలకు మించిన భారంగా మారుతున్నాయి. ఇక్కడ ఒక్కొక్క స్థానం నుంచి ముగ్గురేసి చొప్పున కొన్ని స్థానాల్లో అంతకు మించి నాయకులు నువ్వా-నేనా అనిపోటీ పడుతున్నారు. అయితే, వీరికి కీలక నేతల అండదండలు ఉండడం.. ఢిల్లీ స్థాయిలో సిఫారసులు కూడా కొనసాగుతుండడంతో ఎవరికి …
Read More »