వైసీపీ అధినేత జగన్.. అలా రెండు పర్యటనలు ముగిశాయో లేదో.. ఇలా బెంగళూరుకు వెళ్లిపోయారు. విజయవాడలో తన పార్టీ నాయకుడు, ప్రస్తుతం జైల్లో ఉన్న వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆ వెంటనే మరుసటి రోజు.. గుంటూరు మిర్చియార్డును సందర్శించారు. రైతుల కష్టాలు తెలుసుకున్నారు. దీంతో ఇక, తమ నాయకుడు.. నిత్యం ప్రజల్లోనే ఉంటారని.. ప్రజల సమ్యలు వింటారని.. రోజూ యాత్రలే నని వైసీపీ ముఖ్యులు భావించారు. ఇదే కొనసాగితే.. వైసీపీ పుంజుకుంటుందని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా ఎవరికీ చెప్పకుండానే సతీసమేతంగా జగన్.. బెంగళూరుకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లే వరకు కూడా.. పార్టీ ముఖ్య నాయకులకు, ముఖ్యంగా తాడేపల్లిలోనే ఉండేవారికి కూడా తెలియదట! ఆశ్చర్యం అనిపించినా నిజమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, పోనీ.. బెంగళూరులో ఏమైనా అత్యంత అవసరమైన పనులు ఉన్నాయా? అంటే.. అవేవీ లేదు. అయినా.. జగన్ ఎందుకు వెళ్లారు? అనేది ప్రశ్న. గత కొన్నాళ్లుగా జగన్ నడుము నొప్పితో బాధపడుతున్నారు.
దీనికి ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవల విజయవాడ, గుంటూరు పర్యటనల్లో.. ప్రసంగించిన జగన్ ఒకింత ఇబ్బంది పడినట్టు అందరూ గమనించారు. ఈ క్రమంలో నడుము నొప్పికి సంబంధించి జగన్.. చికిత్స కోసమే బెంగళూరుకు వెళ్లారన్నది పార్టీ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు. ఇదిలావుంటే.. జగన్ లేకపోతే.. పార్టీ కార్యక్రమాల పరిస్థితి ఏంటి? అనేది ప్రశ్న.
ఇప్పటి వరకు .. జగన్.. దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన కానీ.. షెడ్యూల్ కానీ ఇవ్వలేదు. గతంలోనూ షెడ్యూల్ ఇచ్చినా.. ఆయన బెంగళూరు వెళ్లిపోయిన తర్వాత.. దానిని పార్టీ నాయకులు పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా అంతే చేస్తారని అనుకున్నారో. . ఏమో.. అసలు ఎవరికీ చెప్పకుండానే జగన్.. బెంగళూరు కు వెల్లిపోయారు. దీంతో పార్టీ నాయకులు కూడా.. ఎవరికి వారు సైలెంట్ అయ్యారు. మరోవైపు.. జగన్ వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలపై స్పష్టత లేదని.. తాడేపల్లి వర్గాలు చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates