ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో విజయం దక్కించుకున్న కమ్యూనిస్టు నాయ కుడు, సీపీఐ నేత.. కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును, అదేవిధంగా పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే తోసిపుచ్చింది. ఇలాంటి కేసులు కూడా కేసులేనా? సమయం వేస్ట్.. అని వ్యాఖ్యానిస్తూ.. కూనంనేనిపై నమోదైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో కామ్రెడ్ కూనంనేనికి ఇక, చిక్కులు తొలిగిపోయినట్టే. ప్రస్తుతంతెలంగాణ అసెంబ్లీలో సీపీఐ తరఫున ఒకే ఒక్క సభ్యుడిగా కూనంనేని ఉన్న విషయం తెలిసిందే. పైగా సీఎం రేవంత్ రెడ్డితోనూ మంచి ర్యాపో కొనసాగిస్తున్నారు.
ఏం జరిగింది?
2009లో తొలిసారి కొత్తగూడెం నుంచి విజయం దక్కించుకున్న కూనంనేని.. తర్వాత.. 2023 ఎన్నికల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆపార్టీ ఒక స్థానాన్ని కమ్యూనిస్టులకు కేటాయించింది. ఈ క్రమంలో సీనియర్ నేత, పైగా ప్రజల్లో బలమైన పేరున్న కూనంనేనిని సీపీఐ ఎంపిక చేసి.. ఎ న్నికల బరిలో నిలిపింది. ఆయన విజయం కూడా దక్కించుకు న్నారు. ప్రజల తరఫున బలమైన గళం కూడా వినిపిస్తున్నారు. అయితే.. అదే ఎన్నికల్లో ఏఐఎఫ్‌బీ(ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్) పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ బీఆర్ ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు 26 వేల ఓట్ల తేడాతో కూనంనేనిపై పరాజయం పాలయ్యారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించారని.. నిబంధనలను తుంగలో తొక్కారని.. అడ్డదారిలో గెలిచారని.. పేర్కొంటూ.. కూనంనేనిపై ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసి.. తాను గెలిచినట్టుగా పేర్కొనాలని కోరారు. ఈ కేసు 2024లో నమోదై.. అనేక సార్లు తెలంగాణ హైకోర్టులోనూ విచారణకు వచ్చింది. అయితే.. ఆధారాలు లేవంటూ.. హైకోర్టు గత ఏడాదే ఈ కేసును కొట్టి వేసింది. దీంతో వెంకట్రావు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. అసలు ఈ పిటిషన్ దాఖలు చేసి నెలలు గడిచినా..విచారణకు రాలేదు. శుక్రవారం సాయంత్రం ఈ పిటిషన్ గురించి.. వెంకట్రావు తరఫున న్యాయవాది లేవనెత్తారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. ఇది కూడా ఒక కేసా? అంటూ.. రద్దు చేసింది.
ఇలాంటి పిటిషన్లను స్వీకరిస్తూ..పోతే, జీవిత కాలం సరిపోతుందని.. కోర్టులకు ఇక వేరే పనులు కూడా అవసరం లేదని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో పస ఉందో లేదో(వ్యాలిడిటీ ఆఫ్ పిటిషన్) చూసుకోవాలని వెంకట్రావు తరఫు న్యాయవాదిని ఆక్షేపించింది. ఇదిలావుంటే.. జలగం వెంకట్రావు.. 2014 ఎన్నికల్లో బీఆర్ ఎస్(అప్పటి టీఆర్ ఎస్) తరపు విజయం దక్కించుకున్నారు. కానీ, రెండేళ్లకే.. 2018లో వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత.. బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చి.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున 2023లో పోటీ చేసినా ప్రజలు ఆయనను గెలిపించలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates