ఎటు గాలి వీస్తే అటు వెళ్లిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే. తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సాధారణమే. అలా ఎన్నిసార్లయినా చేయడానికి వెనుకాడరు. తాజాగా ఏపీలో మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా మరోసారి జంప్ చేసేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. మళ్లీ తట్టా బుట్టా సర్దుకుని వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు తాజా రాజకీయ పరిణామాలే కారణమని …
Read More »పీకే కాంగ్రెస్‌లో ఎందుకు చేరలేదంటే: ప్రియాంక
ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌కు దేశ రాజకీయాల్లో మంచి పేరుంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్, తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్‌లో మూడోసారి మమత బెనర్జీని సీఎం చేయడంలో ఆయనది కీలక పాత్ర. రాజకీయాలపై అంతటి అవగాహన ఉన్న పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేశారు. కొంతకాలంగా తెరవెనక ఉండి వివిధ పార్టీలను నడిపించిన ఆయన.. నేరుగా ముందుకు వచ్చి కాంగ్రెస్‌లో చేరాలనే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ, …
Read More »క్యాసినోతో కొడాలని కొట్టాలని!
కొడాలి నాని.. తన మాటలతో, విమర్శలతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే నాయకుడు. ఏపీ సీఎం జగన్‌పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే నాని రంగంలోకి దిగిపోయి ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేస్తుంటారు. ఇక ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నాని అంటే ఓ కొరుకుడు పడని నేత. విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నాని టార్గెట్ అంతా చంద్రబాబే అనడంలో సందేహం లేదు. తన మాటల దాడితో …
Read More »నారాయణ బాధేమిటో ?
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెగ బాధ పడిపోతున్నారు. ఇంతకీ ఈయన బాధేమిటయ్యా అంటే పీఆర్సీ సాధన సమితి ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదని చెప్పినందుకు. ఉద్యోగులు ఎవరు రాజకీయపార్టీల ఉచ్చులో పడవద్దని, ప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు, వ్యాఖ్యలు చేయవద్దని ఉద్యోగసంఘాల నేతలు బహిరంగంగా ఉద్యోగులందరికీ అప్పీల్ చేశారు. ఆ అప్పీలునే నారాయణ తప్పు పడుతున్నారు. ఉద్యోగుల సమ్మెలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదని చెప్పడం ఏమిటంటు బాధపడిపోయారు. …
Read More »వణికించేస్తున్న ఎంఐఎం
ఒక్క సీటులో కూడా గెలుస్తుందో లేదో తెలీని ఎంఐఎం పెద్ద పార్టీలను కూడా వణికించేస్తోంది. కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించే ఇదంతా. ఎంఐఎం 100 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మొదటి జాబితాలో 25 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. మిగిలిన పార్టీ అధినేతలు గెలుపు …
Read More »జగన్ మొండితనం.. రెండు విధాలా చేటేనా?
ఏ ప్రభుత్వానికైనా.. ఏ పాలకుడికైనా పట్టు విడుపులు ఉండాలి. లేకపోతే.. మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఈ మాట ఏపీ సీఎం జగన్ విషయంలో అధికార పార్టీ వైసీపీలోని సీనియర్ నేతల నుంచే వినిపిస్తుండడం గమనార్హం. ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం తెగేదాకా లాగుతున్న పరిణామాలు.. వారి పీఆర్సీ విషయంలో అనుసరిస్తున్న ధోరణి.. ఒకరకంగా..సీఎంకు ఆయనకు మద్దతిచ్చే కొందరికి నచ్చిందేమో కానీ.. చాలా మంది సీనియర్లకు నచ్చడం లేదు. దీనికి కారణం.. …
Read More »పాత ట్రిక్కునే వాడుతున్న మోడీ సర్కారు
సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ సర్కార్ ఓటర్లకు తాయిలాల లీకులను వదులుతోంది. ఎప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా ఆర్థిక అంశాలకు సంబంధించి లీకులివ్వటం అలవాటుగా మారింది. ఎన్నికల్లో లబ్ది దొరికిందా సరే లేకపోతే మళ్ళీ ఆ ఊసును కూడా కేంద్రం పట్టించుకోవటం లేదు. ఆ మధ్య బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం, తర్వాత పశ్చిమబెంగాల్లో విజయం కోసం, ఇపుడు ఐదు రాష్ట్రాల్లో గెలుపు కోసం ఇలాంటి …
Read More »బీజేపీకి వరుస షాక్‌లు
గోవాలో ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు. దీంతో కీలక సమయంలో పార్టీకి దెబ్బ పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రాజీనామాలు, చేరికలతో గోవా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తనకు టికెట్ ఇవ్వకపోవడంతో దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ పార్టీకి రాజీనామా చేసిన …
Read More »సీఎం జగన్, సాయిరెడ్డిలకు ఆర్ ఆర్ ఆర్ సవాల్
తన మాటలతో రాజకీయాలను వేడెక్కించే వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు.. తాజాగా ఏపీ సీఎం జగన్, వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డికి సంచలన సవాల్ రువ్వారు. కొన్నాళ్లుగా తనపై సాయిరెడ్డి చేస్తున్నవిమర్శలకు చెక్ పెడతానని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా విజయసాయిరెడ్డి.. తనను పారిపోయారని.. సీఐడీ నోటీసులు ఇస్తే.. తప్పించుకున్నారని.. ఎంపీ పదవికి రాజీనామా విషయంలో దోబూచులు ఆడుతున్నారని విమర్శిస్తున్నట్టు రఘురామ తెలిపారు. అయితే.. తాను పారిపోలేదని.. తన …
Read More »కొడాలి నాని.. ఈ కామెంట్ మరీ దారుణం
సోషల్ మీడియాలో చాలామంది కొడాలి నాని పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడరు. బూతుల మంత్రి అని పిలుస్తుంటారు. ఇందులో టీడీపీ వాళ్లు మాత్రమే కాదు.. న్యూట్రల్ జనాలు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో మీడియా ముందు బూతుల దండకం అందుకుంటూ ఉంటారు. ఎవరి రెకమండేషన్‌తో వచ్చింది అన్నది పక్కన పెడితే నానికి టీడీపీలో తొలిసారిగా టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసింది చంద్రబాబు నాయుడే అన్నది వాస్తవం. కానీ …
Read More »రాష్ట్రమంతా దళిత బంధు.. కేసీఆర్ నిర్ణయం..
దళిత బంధు- లబ్ధిదారులైన దళితులకు రూ.10 లక్షల చొప్పున ఇచ్చే కీలకమైన పథకం. దీనిని ఎప్పుడు అమలు చేస్తారు? ఎలా అమలు చేస్తారు? అనే సందేహాలు.. అనుమానాలు.. అన్ని వర్గాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆయా సందేహాలకు, అనుమానాలకు చెక్ పెడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే హుజూరాబాద్‌లో ఇది అమలవుతోంది. దీంతో మిగిలిన.. 118 నియోజకవర్గా్లలో దళిత బంధు పథకం అమలుకు …
Read More »భారతిని ఇన్వాల్ చేసి జగన్ పై సెటైర్లు
సటైర్లు వేయడంలో తనకు తానే సాటి అనిపించుకునే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. తాజాగా ఏపీ సీఎం జగన్‌పై తన స్టయిల్లో సటైర్లు వేసి నవ్వించేశారు. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్.. జిల్లాకో విమానాశ్రయం కడతామంటూ.. వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన కేబినెట్‌లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే.. ఈ కామెంట్లపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates