నిన్నటి విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉదంతం ఎంతటి దారుణ పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. 11 మంది ప్రాణాలు హరించిన ఈ ఉదంతం.. వందల మందిని ఆసుపత్రుల పాలు చేసింది. ఇప్పటికీ గోపాలపట్నంలో పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలు ఇల్లూ వాకిలి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. గ్యాస్ పీల్చిన వారికి మున్ముందు ఎలాంటి సమస్యలు ఉంటాయో అన్న ఆందోళన …
Read More »విశాఖను రక్షించేందుకు గుజరాత్ నుంచి రసాయనం
విశాఖపట్నంలోని గోపాల పట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన స్టెరీన్ వాయువు ఎంతటి తీవ్ర పరిణామలకు దారి తీసిందో తెలిసిందే. ఇప్పటికే దీని వల్ల 11 మంది మృతి చెందినట్లు సమాచారం వస్తోంది. ప్రాథమికంగా మృతుల సంఖ్య 8 అనే అన్నారు కానీ.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇంకో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా వందల మంది అస్వస్థతతో చికిత్స తీసుకుంటున్నారు. 3 కిలోమీటర్ల దూరం, దాదాపు అయిదు …
Read More »ఎల్ జీ ప్రతినిధుల్ని అందరి ముందు కడిగేసిన జగన్?
సంచలనంగా మారిన విశాఖ ఎల్ జీ పాలిమర్స్ విషాద ఉదంతంలో పలు కుటుంబాల్లో తీర్చలేని గుండె కోతను మిగిల్చింది. వేకువజామున లీకైన రసాయన వాయువులతో పదకొండు మంది మరణించగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించి విన్నంతనే హుటాహుటిన వైజాగ్ కు బయలుదేరి వెళ్లారు సీఎం జగన్. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగిన వేళలో.. దీనికి …
Read More »వైజాగ్ నేర్పుతున్న పాఠం ఇది
నెలన్నరగా కరోనా వైరస్ వల్ల పడుతున్న కష్టాలు చాలవని.. విశాఖపట్నం వాసులను ఇప్పుడో పెద్ద ఉపద్రవం ముంచెత్తింది. గోపాల పట్నం ప్రాంతంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన ప్రమాదకర స్టెరీన్ గ్యాస్ 11 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎవరి పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఈ గ్యాస్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుని ఉంటే అవయవాలు దెబ్బ …
Read More »కరోనాపై కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్
కరోనా వైరస్‌కు సరైన మందు లేదంటే దాన్ని నివారించే వ్యాక్సిన్ వస్తే తప్ప దానిపై నియంత్రణ సాధించడం కష్టమని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు గట్టి కృషే చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు, వైద్యులు నిర్విరామంగా దీనిపై పని చేస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ కనుక్కోవడం అంత తేలికైన పని కాదని.. దానికి చాలా వ్యవధి పడుతుందని నిపుణులు చెప్పడం చూశాం. మామూలుగా అయితే ఓ కొత్త వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి …
Read More »బస్సులు, రైళ్లు ఈ నెలలోనే తిరుగుతాయ్
కరోనా వ్యాప్తిని నివారించేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నెలన్నర రోజులుగా ప్రజా రవాణా ఆగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్లు ప్రభుత్వ అనుమతులతో సొంత వాహనాలు పెట్టుకుని.. లేదా ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా స్వస్థలాలకు చేరే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు. ఐతే ఇంత కష్టపడలేక సాధారణ ప్రజా రవాణా ఎప్పుడు పునరుద్ధరిస్తారా అని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి …
Read More »అసలేంటీ స్టెరీన్ గ్యాస్?
స్టెరీన్ గ్యాస్.. ఈ ఉదయం నుంచి వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరిది. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి లీకై.. చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసి.. ఎనిమిది మంది ప్రాణాలు కూడా పొట్టన పెట్టుకున్న గ్యాస్ ఇది. దీని కారణంగా వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. మరింత మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏంటీ స్టెరీన్ గ్యాస్.. ఇది ఎందుకు లీక్ …
Read More »నగ్మాను ఆడుకుంటున్న నెటిజన్లు
హీరోయిన్ టర్న్డ్ పొలిటీషియన్ నగ్మా చాలా కాలం తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఆమెను నిన్నట్నుంచి నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు. ‘నగ్మా స్టాండ్స్ విత్ పాకిస్థాన్’ పేరుతో ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆమె మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. పదేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నగ్మా.. ఇటీవల ఓ టీవీ చర్చలో పాకిస్థాన్ జర్నలిస్టుకు మద్దతుగా నిలవడమే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుండటానికి కారణం. …
Read More »లలితా గుండు బాస్ గుండె పెద్దదే
డబ్బులు ఊరికే రావు అంటూ లలిత జ్యువెలర్స్ యాడ్స్‌లో దాని యజమాని కిరణ్ ఎంత సందడి చేస్తుంటాడో తెలిసిందే. మామూలుగా జ్యువెలరీ బ్రాండ్ల ప్రచారం కోసం ఫిలిం సెలబ్రెటీలు, మోడళ్లను ఉపయోగించుకుంటారు కానీ.. లలిత జ్యువెలర్స్ యజమాని మాత్రం తనే మోడల్‌గా మారారు. టీవీల్లో, పత్రికల్లో, వెబ్ సైట్లలో ఎక్కడ చూసినా ఆయన ముఖమే కనిపిస్తుంది. రెగ్యులర్ జ్యువెలర్స్ యాడ్లకు భిన్నంగా కస్టమర్లతో నేరుగా మాట్లాడుతున్నట్లు, వారి మంచి కోరుతున్నట్లు …
Read More »ఏపీలో మందుబాబులకు దిమ్మ తిరిగే షాకిచ్చిన సర్కార్
మద్యం మహమ్మారిని కట్టడి చేసే విషయంలో తనకున్న విజన్ ను ప్రదర్శిస్తోంది ఏపీ సర్కారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మద్యం అమ్మకాల విషయంలోనూ.. సరఫరా విషయంలో సరికొత్త విధానాల్ని తెర మీదకు తేవటం తెలిసిందే. కరోనాకారణంగా విధించిన లాక్ డౌన్ తో మద్యం అమ్మకాల్ని పూర్తిగా బంద్ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల మద్యం అమ్మకాల్ని మళ్లీ మొదలు పెట్టింది ఏపీ …
Read More »జోరు వర్షం.. వడగండ్ల వాన.. అయినా మందు కోసం
రెండు రోజుల నుంచి కరోనా వార్తల గురించి పెద్దగా చర్చ లేదు దేశంలో. సోమవారం ఉదయం మద్యం దుకాణాలు మళ్లీ తెరుచుకున్నప్పటి నుంచి వాటి గురించే చర్చ నడుస్తోంది. ఎక్కడ ఎలా మద్యం కోసం ఎగబడుతున్నారు.. ఏ రాష్ట్రంలో ఎంత సేల్స్.. ఏ ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది.. రేట్లెలా ఉన్నాయి.. ఇలాంటి సమయంలో మద్యం దుకాణాలు తెరవడమేంటి.. అనే అంశాల గురించి జనాలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. బుధవారం తెలంగాణలో …
Read More »యమ డేంజర్ అన్న కేరళ ఇప్పుడెలా ఉందో తెలుసా?
దేశంలో ముందుగా కరోనా ప్రమాదకర స్థాయిలో విస్తరించిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దక్షిణాదిన తొలి కరోనా కేసు నమోదైంది కూడా ఆ రాష్ట్రంలోనే. ఏపీ, తెలంగాణల్లో కేసులు సింగిల్ డిజిట్లో ఉన్న సమయంలో కేరళలో కేసులు పదుల సంఖ్యలోకి వెళ్లిపోయాయి. విదేశాల నుంచి వచ్చిన ఓ కుటుంబం ఇంటి పట్టున ఉండకుండా పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు వెళ్లి కరోనాను వ్యాప్తి చేయడంతో కేరళ చాలా త్వరగా డేంజర్ జోన్లోకి వెళ్లిపోయింది. …
Read More »