బాబును వ‌దిలేదే లేదు.. కొడాలి వార్నింగ్

ఏపీ మంత్రి కొడాలి నాని మ‌రోసారి త‌న‌దైన శైలిలో టీడీపీపై రెచ్చిపోయారు. త‌న‌ను రెచ్చ‌గొడితే.. తాను చంద్ర‌బాబు జీవితాన్ని బ‌య‌ట‌కు తీస్తాన‌ని.. న‌డిరోడ్డులో ఆయ‌న బ‌ట్ట‌లు ఊడ‌దీస్తాన‌ని హెచ్చ‌రించారు. తాజాగా మంగ‌ళ‌వారం టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మ‌రోసారి కొడాలి నానిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న అవినీతి సొమ్ముతోనే కె-క‌న్వెన్ష‌న్ నిర్మించుకున్నార‌ని తెలిపారు. లారీల‌కు గ్రీజు పెట్టుకునేవాడ‌ని.. దొంగ‌త‌నంగా లారీల్లోని డీజిల్‌ను దోచుకుని.. ప‌దికి , 20కి అమ్ముకునేవాడ‌ని నానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే అప్ప‌టి సీఐగా ఉన్న ప్ర‌స్తుత టీడీపీనాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య కొడాలిని స్టేష‌న్కు తీసుకెళ్లి చిక్కొట్టాడ‌ని వ్యాఖ్యానించారు.

దీనికి కౌంట‌ర్‌గా మంత్రి కొడాలి నాని మంగ‌ళ‌వారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్తాయిలో విరుచుకుపడ్డారు. ‘చంద్రబాబు ఎక్కడ చర్చ పెట్టినా రావడానికి సిద్ధమే. చంద్రబాబు రాజకీయంగా పూర్తిగా దిగజారిపోయారు. డిపాజిట్ రాని బీజేపీ వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా. ప్రజలను రెచ్చ గొట్టే కార్యక్రమాలకు పోలీసులు ఎందుకు అనుమతిస్తారు. నేను మాట్లాడిన దానికి ,బుద్ద వెంకన్న మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది. చంద్రబాబు ఇంట్లో ఉండి మిగతా నేతలతో నన్ను తిట్టిస్తున్నారు. నా మీద 420 వ్యక్తులతో ఆరోపణలు చేయించారు.  టీడీపీకి అనుబంధంగా పనిచేసే వ్యక్తి సోము వీర్రాజు. మత కలహాలు రెచ్చగొట్టాలని బీజేపీ యత్నిస్తోంది’ అని కొడాలి నాని ధ్వజమెత్తారు.

త‌న‌ను టీడీపీ 420లు కెలికితే.. చంద్ర‌బాబును తాను కెలుకుతాన‌ని..చంద్ర‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు.. బ్రోత‌ల్ హౌస్‌లు న‌డిపార‌ని.. వాట‌న్నింటినీ తాను బ‌య‌ట‌కు తీస్తాన‌ని.. హెచ్చ‌రించారు. న‌డిరో్డుడ‌పై చంద్ర‌బాబు గుడ్డ‌లు ఊడ‌దీస్తాన‌ని.. అన్నారు. టీడీపీకి బీటీమ్‌గా ఏపీ బీజేపీ పనిచేస్తోందని మంత్రి కొడాలి నాని విమర్శించారు. వెన్నుపోటు, అబద్ధాలపై ఆధారపడ్డ వ్యక్తి చంద్రబాబు అని, అదే చంద్రబాబు అజెండాతో ఏపీ బీజేపీ పనిచేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్లు తెచ్చుకుని చూపించాలని సవాల్‌ విసిరారు. తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడే 2010లో కె-క‌న్వెన్ష‌న్ నిర్మించుకున్నాన‌ని.. క‌ష్టార్జితంతోనే దీనిని నిర్మించుకున్న‌ట్టు మంత్రి చెప్పారు.

వ‌ర్ల‌రామ‌య్య గుడివాడ‌లో సీఐగా ఉన్న‌ప్పుడు 1987-88 మ‌ధ్య తాను 9, 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాన‌ని.. మంత్రి నాని వ్యాఖ్యానించారు. కొబ్బ‌రి చిప్ప‌ల వ్యాపారం చేశాన‌ని అంటున్న బుద్దా వెంక‌న్న రూ.10, రూ.20 వ‌డ్డీల‌కు డ‌బ్బులు అప్పులు ఇచ్చి.. మ‌హిళ‌ల‌ను లోబ‌రుచుకున్నాడ‌ని.. బాధిత మ‌హిళ‌లు ఇప్పుడు త‌న‌కు ఫోన్లు చేస్తున్నార‌ని.. వీరితో త్వ‌ర‌లోనే తాను.. కేసులు పెట్టించి.. బుద్దా వెంక‌న్న కు బ‌డిత పూజ చేయిస్తాన‌ని హెచ్చ‌రించారు.