ఏపీలో కొత్త జిల్లాలు ఇవే.. మార‌నున్న స్వ‌రూపం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్ప‌టుకు రంగం సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం తాజాగా గెజిట్ విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. ఏయే జిల్లాలు ఎలా ఉంటాయంటే..

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి శ్రీకాకుళం కేంద్రంగా శ్రీకాకుళం జిల్లాగా ఏర్పాటు చేయ‌నున్నారు.  దీనిలో టెక్కలి, శ్రీకాకుళం రెవెన్యూ డివిజ‌న్ల‌తో మొత్తం 30 మండలాలు ఉండ‌నున్నాయి.
…………………………
విజయనగరంజిల్లాలోని  రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి విజ‌య‌న‌గ‌రం కేంద్రంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాగా ఏర్పాటు చేస్తారు. దీనిలో  బొబ్బిలి, విజయనగరం రెవెన్యూ డివిజ‌న్లు, 26 మండలాలు  ఉంటాయి.
………………………….
విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి పార్వ‌తీపురం కేంద్రంగా మ‌న్యం జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. దీనిలో పాలకొండ, పార్వతీపురం రెవెన్యూ డివిజ‌న్ల‌తో 16 మండ‌లాలు ఉంటాయి.
…………………………….
విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని పాడేరు, అరకు, రంపచోడవరం  నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పాటు చేయ‌నున్నారు. పాడేరు, రంప‌చోడ‌వ‌రం రెవెన్యూ డివిజ‌న్ల‌తో మొత్తం 22 మండ‌లాలు ఉంటాయి.
————————–
విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా విశాఖ‌ప‌ట్నం జిల్లాను ఏర్పాటు చేస్తారు. దీనిలో భీమునిపట్నం, విశాఖ‌ప‌ట్నం రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం 10 మండ‌లాలు ఉంటాయి.
……………………………..
విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపిఅన‌కాప‌ల్లి కేంద్రంగా అన‌కాప‌ల్లి జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. నర్సీపట్నం, అనకాపల్లి రెవెన్యూ డివిజ‌న్లు,  25 మండ‌లాలు ఉంటాయి.
————————-
తూర్పుగోదావ‌రి జిల్లాలోని తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ.. కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావ‌రి జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. పెద్దాపురం, కాకినాడ రెవెన్యూ డివిజ‌న్లుగా 19 మండ‌లాలు ఉంటాయి.
————————-
తూర్పుగోదావ‌రి జిల్లాలోని రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ.. అమ‌లాపురం కేంద్రంగా కోన‌సీమ జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. రెవెన్యూ డివిజన్లుగా రామచంద్రాపురం, అమలాపురంల‌ను నిర్ణ‌యించారు. మొత్తం 24 మండలాలు ఉంటాయి.
————————-
తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ..  రాజ‌మ‌హేంద్ర‌వ‌రం  కేంద్రంగా  రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జిల్లాను ప్ర‌తిపాదించారు. ఈ జిల్లాలో అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూర‌ల్‌, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటాయి. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, కొవ్వూరు రెవెన్యూ డివిజ‌న్లు ఉంటాయి. మొత్తం 20 మండలాలు ఉంటాయి.
————————
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లిపి భీమ‌వ‌రం కేంద్రంగా నరసాపురంజిల్లా ఏర్పాటు చేయ‌నున్నారు. నరసాపురం, భీమవరం రెవెన్యూ డివిజ‌న్లు ఉంటాయి. మొత్తం 19 మండలాలు ఉంటాయి.
————————-
పశ్చిమగోదావరిజిల్లాలోని ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి,  కృష్ణాజిల్లాలోని నూజివీడుల‌ను క‌లిపి ఏలూరు కేంద్రంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. దీనిలో ఏలూరు, జంగారెడ్డి గూడెం, నూజివీడు రెవెన్యూ డివిజ‌న్లు ఉంటాయి. మొత్తం 27 మండ‌లాలు ఉంటాయి.
————————
కృష్ణాజిల్లాలోని గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజ‌క‌వ‌ర్గాల‌తో మ‌చిలీప‌ట్నం కేంద్రంగా కృష్ణాజిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. గుడివాడ , మచిలీపట్నం రెవెన్యూ డివిజ‌న్లు ఉంటాయి.  మొత్తం 25 మండలాలు ఉంటాయి.
…………………
కృష్ణాజిల్లాలోని విజయవాడ పశ్చిమ, సెంట్ర‌ల్‌, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో విజ‌య‌వాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. విజయవాడ, నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజ‌న్లతో మొత్తం 20 మండలాలు ఉంటాయి.
…………………….
గుంటూరు జిల్లాలోని తాడికొండ, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాలు, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి నియోజ‌క‌వ‌ర్గాల‌తో గుంటూరు కేంద్రంగా గుంటూరు జిల్లా ఏర్పాటు చేయ‌నున్నారు. గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజ‌న్లతో మొత్తం 18 మండలాలు ఉంటాయి.
———————-
గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల్లోని వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ..  బాప‌ట్ల కేంద్రంగా బాపట్ల జిల్లాను ఏర్పాటు చేస్తారు. బాప‌ట్ల‌, చీరాల రెవెన్యూ డివిజన్లుగా  మొత్తం 25 మండలాలు ఉంటాయి.
———————
గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ.. న‌ర‌స‌రావుపేట కేంద్రంగా ప‌ల్నాడు జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు.  గురజాల, న‌ర‌స‌రావుపేట రెవెన్యూ డివిజ‌న్ల‌తో 28 మండ‌లాలు ఉంటాయి.  
————————-
ప్ర‌కాశంజిల్లాలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి నియోజ‌క‌వ‌ర్గాల‌తో ఒంగోలు కేంద్రంగా ప్ర‌కాశం జిల్లా ఏర్పాటు చేయ‌నున్నారు. దీనిలో మార్కాపురం, ఒంగోలు, క‌నిగిరి రెవెన్యూ డివిజ‌న్ల‌తో మొత్తం 28 మండ‌లాలు ఉంటాయి.
—————————
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్ర‌కాశం జిల్లాలోని కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూర‌ల్‌, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో  నెల్లూరు కేంద్రంగా నెల్లూరు జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. నెల్లూరు, ఆత్మకూరు , కావలి రెవెన్యూ డివిజ‌న్ల‌తో  మొత్తం 65 మండలాలు ఉంటాయి.
——————–
కర్నూలు జిల్లాలోని పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌ర్నూలు కేంద్రంగా క‌ర్నూలు జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్ల‌తో మొత్తం 28 మండలాలు ఉంటాయి.
………………………….
క‌ర్నూలు జిల్లాలోని  నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు.  నంద్యాల, డోన్‌, ఆత్మ‌కూరు రెవెన్యూ డివిజ‌న్లు ఉంటాయి. మొత్తం 27 మండ‌లాలు ఉంటాయి.
————————–
అనంత‌పురం జిల్లాలోని  రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో అనంత‌పురం కేంద్రంగా  అనంతపురంజిల్లా ఏర్ప‌డ‌నుంది. కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్ రెవెన్యూ డివిజ‌న్ల‌తో  34 మండలాలు ఉంటాయి.
—————————-
అనంత‌పురం జిల్లాలోని మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజ‌క‌వ‌ర్గాల‌తో పుట్ట‌ప‌ర్తి కేంద్రంగా కొత్త‌గా శ్రీసత్యసాయిజిల్లా ఏర్ప‌డ‌నుంది. పెనుగొండ , పుట్టపర్తి, కదిరి రెవ‌న్యూ డివిజ‌న్లు, 29 మండలాలు ఉంటాయి.
………………………….
 వైఎస్సార్‌ కడపజిల్లాలోని కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో క‌డ‌ప కేంద్రంగా వైఎస్సార్ క‌డ‌ప జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. కడప, జమ్మలమడుగు, బద్వేలు రెవెన్యూ డివిజ‌న్ల‌తో మొత్తం 34 మండలాలు ఉంటాయి.
————————
వైఎస్సార్ క‌డ‌ప, చిత్తూరు జిల్లాల్లోని  రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి నియోజ‌క‌వ‌ర్గాల‌తో రాయ‌చోటి కేంద్రంగా అన్నమయ్యజిల్లా ఏర్పాటు చేయ‌నున్నారు.  రాజంపేట , రాయచోటి, మదనపల్లి రెవెన్యూ డివిజ‌న్ల‌తో 32 మండలాలు  ఉంటాయి.
…………………..
చిత్తూరు జిల్లాలోని నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజ‌క‌వ‌ర్గాల‌తో చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లాను ఏర్పాటు చేయ‌నున్నారు. చిత్తూరు, పలమనేరు రెవెన్యూ డివిజ‌న్లుగా 33 మండ‌లాలు ఉంటాయి.
—————————–
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజ‌క‌వ‌ర్గాల‌తో తిరుపతి కేంద్రంగా  శ్రీ బాలాజీజిల్లా ఏర్పాటు చేయ‌నున్నారు. దీనిలో  నాయుడుపేట, గూడూరు, తిరుపతి రెవెన్యూ డివిజ‌న్లతో 35 మండలాలు ఉంటాయి.