శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని పెద్దలు చెబుతుంటారు. ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను నివారించేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటంలేదు. దొంగ ఓట్లు వేసే వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను కనుక్కుంటు దిగ్విజయంగా దొంగఓట్లను వేస్తునే ఉంటారు. దీనికి క్లైమ్యాక్స్ అన్నట్లుగా తాజాగా కేంద్ర మంత్రివర్గం ఒక సంస్కరణకు నడుంబిగించింది. అదేమిటంటే ఓటరు కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానించటం. నిజానికి ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించటమన్న …
Read More »KCR: పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా!
తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు జనంలోనే ఉండాలని.. జనం కోసమే తిరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని సమాచారం. అత్యవసరమైతే తప్ప ఎవరూ హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు పర్యటనలు పెట్టుకోవద్దని.. నిరంతరం ప్రజలని కనిపెట్టుకొని ఉండాలని సూచించారట. దీంతో ఆయా జిల్లాల్లో నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందట. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉండడం.. ప్రజల్లో క్రమంగా వ్యతిరేకత వస్తుండడంతో …
Read More »జస్టిస్ చంద్రుకు.. చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
ఏపీ హైకోర్టును ఉద్దేశించి ఇటీవల తమిళనాడులోని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. లైమ్ లైట్లో ఉండాలని భావిస్తున్నవారి లైట్స్ ఆపేస్తామని తీవ్రంగా స్పందించింది. ఇక, ఈ విషయంలో రాజకీయ నాయకులుకూడా సీరియస్ అయ్యారు. తాజాగా టీడీపీ అదినేత చంద్రబాబు.. కూడా జస్టిస్ చంద్రుపై సీరియస్ అయ్యారు. జస్టిస్ చంద్రబాబు …
Read More »రైతుల సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో న్యాయ స్థానం టు దేవ స్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, పాదయాత్ర ముగింపు సందర్భంగా రైతులు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలోనే రైతులు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతి రైతుల ముగింపు సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. డిసెంబరు 17వతేదీ …
Read More »3 టాయిలెట్లే కట్టలేదు.. 3 రాజధానులా?: CBN
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ఏపీ ప్రభుత్వంపై ఫైరయ్యారు. తనదైన శైలిలో ఆయన కౌంటర్లు ఇచ్చారు. మూడురాజధానుల ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిందని..అయితే.. ఇప్పటి వరకు మూడు టాయిలెట్లను కూడా నిర్మించలేదని.. అలాంటి ప్రభుత్వం మూడు రాజధానులు కడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న సీపీఎస్ రద్దుపై జగన్ హామీ ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. హామీ …
Read More »KTR ఆత్మవిశ్వాసం హద్దు దాటుతోందా?
కొంత కాలం తర్వాత టీఆర్ఎస్ పార్టీలో తాజాగా సందడి కనిపించింది. ఆ పార్టీ నేతల ముఖాల్లో ఆనందం దర్శనమిచ్చింది. అందుకు కారణం ఎన్నికలు జరిగిన ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడమే. ఇప్పటికే ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఆరు ఆ పార్టీకే …
Read More »కాంగ్రెస్కు టీఆర్ఎస్ ఓట్లు!
ఎన్నికలు జరిగిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారని ఆ పార్టీ చంకలు గుద్దుకుంటోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తిరుగులేదని ఏ ఎన్నికలైనా విజయం తమదేనని ప్రతిపక్షాల కుట్రలు నీరుగారిపోయాయని ఆ పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ఆరో చోట్ల టీఆర్ఎస్ గెలిచింది సరే. 70 శాతనికి పైగా ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల సభ్యులే ఉండడంతో ఈ విజయం ఊహించిందే. కానీ ఎన్ని ఓట్లు వస్తాయని …
Read More »TDP: రెండున్నరేళ్ల కష్టం సున్నా?
రాజకీయాల్లో `ఆశ-అవకాశం` అనే రెండు పట్టాలపైనే నేతల ప్రయాణం ఆధారపడుతుంది. ఎంతో కష్టపడుతున్నాం.. పార్టీలో ఏదైనా అవకాశం దక్కకపోతుందా? అనే ఆశ నాయకులను కార్యకర్తలను నడిపిస్తుంది. ఇదేపార్టీలను గెలిపించే ప్రధాన సూత్రంగా కూడా పనిచేస్తోంది. అయితే.. టీడీపీలో మారుతున్న సమీకరణలు ఆ పార్టీని తీవ్రస్థాయిలో ఇరుకున పడేస్తున్నాయి. ఎక్కడికక్కడ నాయకుల మధ్య నిరాశ.. నిస్పృహలు కలిగించేలా చేస్తున్నాయి. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరి పోరు చేసే పరిస్థితి ఏ …
Read More »ఏకమైన వైసీపీ, టీడీపీ ఎంపీలు
మొత్తానికి ఒక్క విషయంలో మాత్రం అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష ఎంపీలు చేతులు కలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మూడు రోజులుగా జరుగుతున్న బీసీ సంక్షేమ సంఘాల ధర్నాలో రెండు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. బీసీ డిమాండ్లకు రెండు పార్టీల ఎంపీలు సంఘీభావం ప్రకటించటం గమనార్హం. దేశ జనాభా లెక్కలు సవరించాలని, బీసీల కులగణన చేయాలనే డిమాండ్ తో రెండు రాష్ట్రాల బీసీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు …
Read More »కేసీఆర్ – స్టాలిన్ దోస్తి.. ప్లాన్ ఏంటి?
వ్యవహారం చూస్తుంటే అనుమానంగానే ఉంది. దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో కేసీయార్ తో చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమ్మితం కేసీయార్ తన ఫ్యామిలితో కలిసి తమిళనాడుకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. తమిళనాడు పర్యటనలో రెండు అంశాలున్నాయి. మొదటిదేమో కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా మిగిలిన సీఎంల మద్దతు కూడగట్టడం. రెండోదేమో అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న మాజీ …
Read More »మోడీతో చెప్పేంత దమ్ముందా?
దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అవబోతున్నారు. తెలంగాణా, ఏపీ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలు, ముఖ్యనేతలకు మోడీ బ్రేక్ ఫాస్ట్ ఇస్తున్నారు. పై రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సమస్యలు, పరిష్కారాలపై మోడీ చర్చిస్తారట. దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేకంగా మోడీ భేటీ అవ్వడం బహుశా ఇదే మొదటిసారి. భేటీ అయితే జరుగుతుంది కానీ అందులో ఎంపీలు, ముఖ్యనేతలు వాస్తవ పరిస్థితులను మోడీకి వివరిస్తారా ? …
Read More »త్వరలోనే ఇంటింటి సర్వే!
ఏపీలో త్వరలోనే ఇంటింటి సర్వే ప్రారంభించనున్నారు. ప్రభుత్వమే ఈ సర్వేకు ప్రాతినిధ్యం వహించనుంది. ఈ క్రమంలో వలంటీర్లను ప్రధానంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో పార్టీ తరఫున ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ సర్వే ప్రధాన ఉద్దేశం మీకు మూడు రాజధానులు కావాలా? వద్దా? అన్న అంశంపై ప్రజలను నేరుగా ప్రబుత్వం వివరణ తీసుకోనుంది. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates