Political News

ల‌లితా గుండు బాస్ గుండె పెద్ద‌దే

డ‌బ్బులు ఊరికే రావు అంటూ ల‌లిత జ్యువెల‌ర్స్ యాడ్స్‌లో దాని య‌జ‌మాని కిర‌ణ్ ఎంత సంద‌డి చేస్తుంటాడో తెలిసిందే. మామూలుగా జ్యువెల‌రీ బ్రాండ్ల ప్ర‌చారం కోసం ఫిలిం సెల‌బ్రెటీలు, మోడ‌ళ్ల‌ను ఉప‌యోగించుకుంటారు కానీ.. ల‌లిత జ్యువెల‌ర్స్ య‌జ‌మాని మాత్రం త‌నే మోడ‌ల్‌గా మారారు. టీవీల్లో, ప‌త్రిక‌ల్లో, వెబ్ సైట్ల‌లో ఎక్క‌డ చూసినా ఆయ‌న ముఖ‌మే క‌నిపిస్తుంది. రెగ్యుల‌ర్ జ్యువెల‌ర్స్ యాడ్ల‌కు భిన్నంగా క‌స్ట‌మ‌ర్ల‌తో నేరుగా మాట్లాడుతున్న‌ట్లు, వారి మంచి కోరుతున్న‌ట్లు …

Read More »

ఏపీలో మందుబాబులకు దిమ్మ తిరిగే షాకిచ్చిన సర్కార్

మద్యం మహమ్మారిని కట్టడి చేసే విషయంలో తనకున్న విజన్ ను ప్రదర్శిస్తోంది ఏపీ సర్కారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మద్యం అమ్మకాల విషయంలోనూ.. సరఫరా విషయంలో సరికొత్త విధానాల్ని తెర మీదకు తేవటం తెలిసిందే. కరోనాకారణంగా విధించిన లాక్ డౌన్ తో మద్యం అమ్మకాల్ని పూర్తిగా బంద్ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇటీవల మద్యం అమ్మకాల్ని మళ్లీ మొదలు పెట్టింది ఏపీ …

Read More »

జోరు వ‌ర్షం.. వ‌డ‌గండ్ల వాన‌.. అయినా మందు కోసం

రెండు రోజుల నుంచి క‌రోనా వార్త‌ల గురించి పెద్ద‌గా చ‌ర్చ లేదు దేశంలో. సోమ‌వారం ఉద‌యం మ‌ద్యం దుకాణాలు మ‌ళ్లీ తెరుచుకున్న‌ప్ప‌టి నుంచి వాటి గురించే చ‌ర్చ న‌డుస్తోంది. ఎక్క‌డ ఎలా మ‌ద్యం కోసం ఎగ‌బ‌డుతున్నారు.. ఏ రాష్ట్రంలో ఎంత సేల్స్.. ఏ ప్ర‌భుత్వానికి ఎంత ఆదాయం వ‌చ్చింది.. రేట్లెలా ఉన్నాయి.. ఇలాంటి స‌మ‌యంలో మ‌ద్యం దుకాణాలు తెర‌వ‌డమేంటి.. అనే అంశాల గురించి జ‌నాలు విప‌రీతంగా చ‌ర్చించుకుంటున్నారు. బుధ‌వారం తెలంగాణ‌లో …

Read More »

య‌మ డేంజ‌ర్ అన్న కేర‌ళ ఇప్పుడెలా ఉందో తెలుసా?

దేశంలో ముందుగా క‌రోనా ప్ర‌మాద‌క‌ర స్థాయిలో విస్త‌రించిన రాష్ట్రాల్లో కేర‌ళ ఒక‌టి. ద‌క్షిణాదిన తొలి క‌రోనా కేసు న‌మోదైంది కూడా ఆ రాష్ట్రంలోనే. ఏపీ, తెలంగాణ‌ల్లో కేసులు సింగిల్ డిజిట్లో ఉన్న స‌మ‌యంలో కేర‌ళ‌లో కేసులు ప‌దుల సంఖ్య‌లోకి వెళ్లిపోయాయి. విదేశాల నుంచి వ‌చ్చిన ఓ కుటుంబం ఇంటి ప‌ట్టున ఉండ‌కుండా పెళ్లిళ్లు, ఇత‌ర వేడుక‌ల‌కు వెళ్లి క‌రోనాను వ్యాప్తి చేయ‌డంతో కేర‌ళ చాలా త్వ‌ర‌గా డేంజ‌ర్ జోన్లోకి వెళ్లిపోయింది. …

Read More »

మోడీ-కేసీఆర్.. ఒక పేలిపోయే మీమ్

లాక్ డౌన్ ఆరంభమైన కొత్తలో మోడీ సర్కారు పట్ల చాలా సానుకూలంగా కనిపించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు.. కేంద్రం మీద ఇంతెత్తున లేస్తున్నారు. కరోనా కష్ట కాలంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి సరైన సాయం అందట్లేదని.. మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన అంటున్నారు. నిన్నటి ప్రెస్ మీట్లో కేంద్రం మీద ఆయన ఎలా విరుచుకుపడ్డారో తెలిసిందే. ఇదిలా ఉంటే కేంద్రం ఈ నెల 17 వరకు లాక్ డౌన్‌ను …

Read More »

మద్యం అమ్మకాల్లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్

KCR

తెలంగాణలో మద్యం దుకాణాలు తెరవక తప్పని పరిస్థితి ఎందుకు వచ్చిందో కేసీఆర్ నిన్నటి ప్రెస్ మీట్లో చెప్పారు. తెలంగాణకు నలు వైపులా వేరే రాష్ట్రాల బార్డర్లు ఉన్నాయని.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలవడంతో అక్కడి నుంచి తెలంగాణలోకి మద్యం వస్తోందని.. 80 శాతం ప్రాంతాలకు మద్యం అందుతోందని.. అలాంటపుడు తెలంగాణలో మద్యం దుకాణాలు మూసేయడంలో అర్థం లేదని ఆయన చెప్పారు. గత రెండు …

Read More »

మోడీ సర్కారును ఉతికారేసిన కేసీఆర్

కరోనా కారణంగా లాక్ డౌన్ అమలు మొదలైనప్పటి నుంచి కేంద్రంలోని మోడీ సర్కారు పట్ల సానుకూల వైఖరితోనే కనిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. జనతా కర్ఫ్యూ సహా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన సపోర్టివ్‌గానే మాట్లాడారు. కరోనాపై పోరాడుతున్న వారికి సంఘీభావంగా మోడీ చప్పట్లు కొట్టమన్నా.. దీపాలు వెలిగించమన్నా.. వాటి గురించి ఎండోర్స్ చేశారు. తాను స్వయంగా అనుసరించారు. మోడీని ఎగతాళి చేసిన వాళ్లకు కూడా గడ్డి పెట్టారు. …

Read More »

మందుబాబుల‌కు ఎల‌క్ష‌న్ ఇంక్ వేస్తే..

లాక్ డౌన్ కారణంగా జనాలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో.. పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. తిండికి కూడా కష్టమై సాయం చేసే చేతుల కోసం ఎదురు చూశాయి ఎన్నో కుటుంబాలు. వారికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగానో ప్రయత్నించాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలూ ఆర్థిక సాయం అందించాయి. రేషన్ కూడా ఇచ్చాయి. ఇంకా పలు రకాలుగా సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే నెలన్నర రోజులు అతి …

Read More »

మాస్క్ వాడమన్నందుకు చంపేశారు

ఇది కరోనా టైం. మాస్క్ వాడకుండా ఎవ్వరూ బయటికి వచ్చే పరిస్థితి లేదు. భారత్ లాంటి దేశాల్లో చిన్న చిన్న పట్టణాల్లో కూడా జనాలకు అవగాహన వచ్చి మాస్కులు వాడుతున్నారు. అలాంటిది అమెరికా లాంటి దేశంలో మాస్కుల వాడకంపై ఇంకెంత అవగాహన ఉండాలి. అందులోనూ అక్కడ కరోనా వ్యాప్తి, మరణాల రేటు హెచ్చు స్థాయిలో ఉన్న నేపథ్యంలో జనాలు మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ ఒక దుకాణంలోకి మాస్క్ లేదన్న …

Read More »

ఏపీ సర్కార్ కు హైకోర్టులో డబుల్ షాక్

ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో…కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, పంచాయితీ కార్యాలయాలపై వైసీపీ రంగుల అంశంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. న‌గ‌రి ఎమ్మెల్యే రోజా, …

Read More »

ఏపీలో ఇవేం బ్రాండ్లు బాబోయ్

వాటర్ బాటిల్‌ను తలపించే సీసా.. అందులో ముదురు గోధుమ వర్ణంలో ద్రావణం.. దాన్ని చూస్తే సూపర్ మార్కెట్లలో స్టాండ్స్ మీద కనిపించే నువ్వుల నూనెలా అనిపిస్తుంది. కానీ దాని మీద లోగో చూస్తే మాత్రం షాకవుతాం. ‘స్పై హెచ్డీ విస్కీ’ అని రాసి ఉంది దాని మీద. 750 మిల్లీలీటర్ల పరిమాణం.. అంటే మందు బాబుల లెక్కల్లో ‘ఫుల్’ అన్నమాట. ధర 430 రూపాయలు. అలాగే ‘ఆంధ్రా గోల్డ్’ పేరుతో …

Read More »

నారా లోకేష్‌ మీద పడ్డావేంటి బండ్లా?

కమెడియన్ టర్న్డ్ ప్రొడ్యూసర్ టర్న్డ్ పొలిటీషియన్ బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అర్థం కాదు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరి కొంత కాలం హడావుడి చేసిన బండ్ల.. ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం తర్వాత రాజకీయాలకు టాటా చెప్పేశాడు. ఈ మధ్య ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసి మాయమైన బండ్ల.. ఇప్పుడు సినిమాల్లోనూ అంత యాక్టివ్‌గా లేడు. కానీ ట్విట్టర్లో మాత్రం …

Read More »