తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ముగ్గురు ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎంపీలు ఎవరంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం మల్కాజ్ గిరి, నల్గొండ, భువనగిరి పార్లమెంటుస్ధానాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ముగ్గురూ ఒకటేసారి లోక్ సభకు కాకుండా అసెంబ్లీకి పోటీచేయాలని ప్రయత్నిస్తున్నారంటే ఏదో పెద్ద లెక్కే ఉన్నట్లు పార్టీలో …
Read More »సీఆర్డీఏ అభివృద్ధి కోసం.. 16 వందల కోట్ల రుణం
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి(సీఆర్డీఏ) కోసం.. ఏకంగా 1600 కోట్ల అప్పు చేయాలని నిర్ణయించింది. దీనికి కేబినెట్ కూడా అంగీకారం తెలిపింది. దీంతో రాజధాని పనులు చేస్తారా? లేదా? అనే విషయాన్ని మాత్రం సర్కారు వెల్లడించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 45 నుంచి 60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ …
Read More »టార్గెట్ టీడీపీ.. కాదు కాదు.. ఐ-టీడీపీ!
రాజకీయాల్లో వ్యూహాలు మారడం సహజమే. కానీ అవి ప్రజలకు మేలు చేసేలానో.. రాష్ట్రానికి మేలు చేసేలా నో ఉండాలి. కానీ, ఇప్పుడు.. ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గొంతు నులమడమే లక్ష్యంగా అధికార పార్టీ దూకుడు ప్రదర్శిస్తోందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీలో కొందరు నేతలు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. మరికొందరు మాత్రమే క్షేత్రస్థాయిలో ఉంటున్నారు. కానీ, చాలా మంది ఎక్కడ ఉన్నా.. …
Read More »జాతీయం సరే…రాష్ట్ర రాజకీయాల సంగతేంటి కేసీఆర్?
గత కొద్ది రోజులుగా ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అంటూ బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అవుతోన్న సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని కేసీఆర్ చెబుతున్నారు. మరోవైపు, రైతుల సపోర్ట్ తో జాతీయ స్థాయిలో రైతు పార్టీ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్న …
Read More »వారంలో మరో వెయ్యి కోట్లు.. ఏపీకి అప్పే ఆధారమా?
ఏపీ ప్రభుత్వం కేవలం వారం వ్యవధిలోనే మరో వెయ్యి కోట్లు అప్పు చేసింది. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించడమే లక్ష్యంగా పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. ఈ వారం కూడా ఆర్‌బీఐ నుంచి రూ.1,000 కోట్ల అప్పు తెచ్చింది. మంగళవారం రాష్ట్ర సెక్యూరిటీల వేలంలో పాల్గొని 7.58 శాతం వడ్డీకి ఈ అప్పు తీసుకుం ది. ఇందులో రూ.500 కోట్ల అప్పు కాలపరిమితి 18 ఏళ్లు కాగా.. మరో రూ.500 కోట్ల …
Read More »ఆ మూడు విషయాల్లో క్లారిటీ కావాలి.. ‘తమ్ముళ్ల’ మాట ఇదే!!
ఏపీ రాజకీయాల్లో టీడీపీ శైలి విభిన్నం. ఏం చేసినా.. ఒక ప్రణాళికప్రకారం.. ఒక నిర్దిష్ట విధానం ప్రకారమే జరుగుతుంది. ఎక్కడా అజాగ్రత్తలకు తావుండదు. అందుకే.. క్రమశిక్షణ ఉన్న పార్టీగా.. ఎప్పటి నుంచో టీడీపీకి పేరుంది. అయితే..రాను రాను ఈ విషయంలో నాయకుల శైలి మారుతోంది. గతంలో సంస్థాగతంగా పార్టీని అభివృద్ధి చేసిన నాయకులు.. ఇప్పుడు.. తమ మేలుకోసం పరితపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే.. “మాకేంటి?” అనే సంస్కృతి పెరిగిపోయింది. దీంతో …
Read More »‘జోడో’తో జయమెంత? కాంగ్రెస్‌లో అంతర్మథనం
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభమైంది. తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ వరకు కొనసాగే ఈ పాదయాత్రకు ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ నేతృత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి ఇబ్బందులు తెలుసుకునేలా, దేశంలో బీజేపీయేతర శక్తి బలంగా ఉందని చాటే ఉద్దేశంతో పకడ్బందీ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పాదయాత్రను కాంగ్రెస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. …
Read More »అపుడు మమత, కేసీఆర్ … ఇపుడు నితీష్
నాన్ ఎన్డీయే పార్టీలను ఏకం చేయడానికి మూడో కృష్ణుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక్కడ మూడో కృష్ణుడంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనే అర్ధం. మూడో కృష్ణుడని ఎందుకంటున్నామంటే మొదటి ప్రయత్నం బెంగాల్ సీఎం మమతాబెనర్జీ చేశారు కాబట్టి. రెండో ప్రయత్నం తెలంగాణా సీఎం కేసీయార్ చేశారు. మమత ఇప్పటికే ఫెయిలయ్యారు. కేసీఆర్ ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకనే ఇపుడు ముచ్చటగా మూడో ప్రయత్నం నితీష్ మొదలుపెట్టారు. ఢిల్లీలో …
Read More »వచ్చే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ ఎంతో తెలుసా ?
వచ్చే ఎన్నికల్లో గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రోడ్ మ్యాప్ తయారు చేయడం కోసం ఢిల్లీలో ముఖ్యనేతలతో మేథోమథనం జరిగింది. జేపీ నడ్డాతో పాటు కొందరు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలతో జరిగిన సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 144 ఎంపీ సీట్లను గెలుచుకోవాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. …
Read More »టీఆర్ఎస్ సన్నిహితులే టార్గెట్టా ?
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు దాడులు చేయటం టీఆర్ఎస్ లో సంచలనంగా మారింది. లిక్కర్ స్కాం తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఈడీ ఉన్నతాధికారులు దేశంలోని ఆరు రాష్ట్రాల్లో 30 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో హైదరాబాద్ లోనే ఆరు చోట్ల దాడులు చేయడం ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్ లో జరిగిన ఈ దాడులు కూడా టీఆర్ఎస్ కు బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళ …
Read More »పవన్ ను ఏకాకిని చేసిన బీజేపీ?
ఆంధ్రప్రదేశ్ లో 2024 సార్వత్రిక ఎన్నికల వేడి ఆల్రెడీ రాజుకున్న సంగతి తెలిసిందే. సర్వేలు, రిపోర్టులు, ప్రోగ్రెస్ కార్డులతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో గెలుపే పరమావధిగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ మాత్రం సింగిల్ గానే పోటీచేసేందుకు సిద్ధమవుతుండగా… పొత్తులు, ఎత్తులు, పై ఎత్తులపై టీడీపీ, బీజేపీ, జనసేనలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతుండగా… సమయం, …
Read More »రాహుల్ హామీలు వర్కవుటవుతాయా?
అధికారంలోకి వచ్చేయాలన్న ఆతృతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నోటికొచ్చిన హామీలిచ్చేస్తున్నారు. తన హామీలను అమలు చేయటం ఎంతవరకు సాధ్యమన్న విషయంపై రాహుల్ కసరత్తు చేశారా లేదా అన్నదే అర్ధం కావటం లేదు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపించారు. పరివర్తన్ యాత్రలో గుజరాత్ లోని అహ్మదాబాద్ రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రు. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అలాగే రైతులకు రుణమాఫీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates