Political News

అంబానీ రేంజ్ ఏమిటో చెప్పే మూడు డీల్స్..

mukesh

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డబుల్ బ్రెడూం ప్లాట్ ను అమ్మే ప్రయత్నం చేయండి? మార్కెట్ రేటు కంటే తక్కువగా అడగటం ఖాయం. వారు అడిగిన మొత్తానికి ప్లాట్ ఇచ్చే కన్నా.. మన దగ్గరే ఉంచుకోవటం మేలన్న భావన కలగటం ఖాయం. ఒక చిన్న ప్లాట్ ను అమ్మే విషయంలోనే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్న వేళలో.. రూ.11వేల కోట్లతో డీల్ ను క్లోజ్ చేయటం మామూలు విషయం కాదు. వేరే వారికైతే …

Read More »

అంత గొడవ చేస్తే కానీ ఎల్జీ పాలిమర్స్ స్పందించలేదు

విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి రెండు రోజుల కిందట స్టెరీన్ గ్యాస్ లీక్ కావడం.. పన్నెండు మంది ప్రాణాలు కోల్పోవడం.. వందల మంది అస్వస్థతకు గురవడం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారు. చనిపోయిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. చికిత్స పొందుతున్న వారికి కూడా ఆర్థిక సాయం ప్రకటించారు. ఐతే ఇంతటి విషాదానికి కారణమైన …

Read More »

ట్రంప్ రోజూ కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారట

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా పేరు వింటేనే… అందరూ ఒకింత భయాందోళనలకు గురవుతున్నమాట చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఆ వైరస్ తమకు సోకుతుందోనన్న భయం మనల్నీ ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కట్టడిపై తనదైన శైలి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వైరస్ పేరు వింటే హడలిపోతున్నారని చెప్పక దప్పదు. కరోనాను చాలా లైటర్ వేలో …

Read More »

వైజాగ్‌పై జగన్‌కు ఎంత ప్రేమో..

విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత చురుగ్గా స్పందించారో తెలిసిందే. వెంటనే అమరావతి నుంచి విశాఖకు బయల్దేరారు. బాధితుల్ని ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. తక్షణం భారీగా నష్టపరిహారం ప్రకటించారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. విశాఖ ఉదంతంలో ప్రాణాలు కోల్పోయింది 11 మంది. ఐతే గత ఏడాది జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఏపీలో ఓ పెద్ద ప్రమాదం చోటు చేసుకున్న …

Read More »

వైన్ షాపులు మూసేయండి.. హైకోర్టు ఆర్డ‌ర్

అవును వైన్ షాపులు మూసేయ‌మ‌ని హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇది పెద్ద షాకే. ఇంత‌కీ ఇలా కోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది తెలంగాణ ప్ర‌భుత్వానికా.. ఏపీ ప్ర‌భుత్వానికా అని మందుబాబులు కంగారు ప‌డిపోవాల్సిన ప‌ని లేదు. ఈ ప‌రిణామం జ‌రిగింది త‌మిళ‌నాడులో. దేశ‌వ్యాప్తంగా ఏపీ స‌హా చాలా రాష్ట్రాల్లో సోమ‌వారం మ‌ద్యం దుకాణాలు పునఃప్రారంభం కాగా.. తెలంగాణ‌లో బుధ‌వారం వైన్ షాపులు తెరుచుకున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులో మ‌రో …

Read More »

వైజాగ్ ఒక్కటే కాదు.. ఇంకో మూడు రాష్ట్రాల్లోనూ

నిన్నటి విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉదంతం ఎంతటి దారుణ పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. 11 మంది ప్రాణాలు హరించిన ఈ ఉదంతం.. వందల మందిని ఆసుపత్రుల పాలు చేసింది. ఇప్పటికీ గోపాలపట్నంలో పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలు ఇల్లూ వాకిలి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. గ్యాస్ పీల్చిన వారికి మున్ముందు ఎలాంటి సమస్యలు ఉంటాయో అన్న ఆందోళన …

Read More »

విశాఖను రక్షించేందుకు గుజరాత్ నుంచి రసాయనం

విశాఖపట్నంలోని గోపాల పట్నంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన స్టెరీన్ వాయువు ఎంతటి తీవ్ర పరిణామలకు దారి తీసిందో తెలిసిందే. ఇప్పటికే దీని వల్ల 11 మంది మృతి చెందినట్లు సమాచారం వస్తోంది. ప్రాథమికంగా మృతుల సంఖ్య 8 అనే అన్నారు కానీ.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇంకో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా వందల మంది అస్వస్థతతో చికిత్స తీసుకుంటున్నారు. 3 కిలోమీటర్ల దూరం, దాదాపు అయిదు …

Read More »

ఎల్ జీ ప్రతినిధుల్ని అందరి ముందు కడిగేసిన జగన్?

సంచలనంగా మారిన విశాఖ ఎల్ జీ పాలిమర్స్ విషాద ఉదంతంలో పలు కుటుంబాల్లో తీర్చలేని గుండె కోతను మిగిల్చింది. వేకువజామున లీకైన రసాయన వాయువులతో పదకొండు మంది మరణించగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం గురించి విన్నంతనే హుటాహుటిన వైజాగ్ కు బయలుదేరి వెళ్లారు సీఎం జగన్. సాధారణంగా ఇలాంటి ఘటనలు జరిగిన వేళలో.. దీనికి …

Read More »

వైజాగ్ నేర్పుతున్న పాఠం ఇది

నెలన్నరగా కరోనా వైరస్ వల్ల పడుతున్న కష్టాలు చాలవని.. విశాఖపట్నం వాసులను ఇప్పుడో పెద్ద ఉపద్రవం ముంచెత్తింది. గోపాల పట్నం ప్రాంతంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన ప్రమాదకర స్టెరీన్ గ్యాస్ 11 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎవరి పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఈ గ్యాస్‌ను ఎక్కువ మోతాదులో తీసుకుని ఉంటే అవయవాలు దెబ్బ …

Read More »

కరోనాపై కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్

కరోనా వైరస్‌కు సరైన మందు లేదంటే దాన్ని నివారించే వ్యాక్సిన్ వస్తే తప్ప దానిపై నియంత్రణ సాధించడం కష్టమని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు గట్టి కృషే చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు, వైద్యులు నిర్విరామంగా దీనిపై పని చేస్తున్నారు. ఐతే వ్యాక్సిన్ కనుక్కోవడం అంత తేలికైన పని కాదని.. దానికి చాలా వ్యవధి పడుతుందని నిపుణులు చెప్పడం చూశాం. మామూలుగా అయితే ఓ కొత్త వ్యాధికి వ్యాక్సిన్ కనుక్కోవడానికి …

Read More »

బ‌స్సులు, రైళ్లు ఈ నెల‌లోనే తిరుగుతాయ్

క‌రోనా వ్యాప్తిని నివారించేందుకు అమ‌లు చేస్తున్న లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా నెల‌న్న‌ర రోజులుగా ప్ర‌జా ర‌వాణా ఆగిపోయింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వాళ్లు ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో సొంత వాహ‌నాలు పెట్టుకుని.. లేదా ప్ర‌భుత్వమే ఏర్పాటు చేసిన‌ ప్ర‌త్యేక రైళ్లు, బ‌స్సుల ద్వారా స్వ‌స్థ‌లాల‌కు చేరే ప్ర‌య‌త్నం చేశారు. చేస్తున్నారు. ఐతే ఇంత క‌ష్ట‌ప‌డ‌లేక సాధార‌ణ ప్ర‌జా రవాణా ఎప్పుడు పున‌రుద్ధ‌రిస్తారా అని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అలాంటి …

Read More »

అసలేంటీ స్టెరీన్ గ్యాస్?

స్టెరీన్ గ్యాస్.. ఈ ఉదయం నుంచి వార్తల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరిది. విశాఖపట్నంలోని గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థ నుంచి లీకై.. చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసి.. ఎనిమిది మంది ప్రాణాలు కూడా పొట్టన పెట్టుకున్న గ్యాస్ ఇది. దీని కారణంగా వందల మంది ఆసుపత్రుల పాలయ్యారు. మరింత మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏంటీ స్టెరీన్ గ్యాస్.. ఇది ఎందుకు లీక్ …

Read More »