రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. ఆయనే రఘు రామ కృష్ణం రాజు. నరసాపురం ఎంపీ. ఆయన బర్త్ డే ఇవాళ. శుభాకాంక్షలు చెబుతూ రాస్తోన్న ప్రత్యేక కథనం ఇది. మొదట్నుంచి ఆయన శైలి వేరు. గెలిచాక కూడా అలానే ఉన్నారాయన. ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రా ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలుచేసినా ఆయనకే చెల్లు. అదేవిధంగా కొన్ని సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేసిన దాఖలాలూ ఉన్నాయి.
ముఖ్యంగా ఆయన వ్యవహార శైలి కొంత భిన్నంగా ఉన్నా ఆయన చేసిన ఆరోపణలు మాత్రం కొన్ని నిజాలకు దగ్గరయ్యాయి. నేను నా బొమ్మతో గెలిచాను జగన్ బొమ్మతో గెలవలేదు అని ఆ రోజు చెప్పినా ఆ దమ్ము మరియు ఆ తెగువ ఉన్న ఏకైక నాయకులు ఆయన.
రాజకీయాల్లో ఎక్కువ కాలం స్నేహాలు ఉండవు. కానీ శత్రువు మాత్రం అలానే ఉంటాడు. స్నేహం రూపంలో.. ఆంధ్రా పాలిటిక్స్ లో ఆర్ఆర్ఆర్ తీరు వేరు. అంతగా క్షత్రియులంతా ఆయన వైపు ఉన్నారు. గోదావరి తీరాన ఈ రోజుకు కూడా ఆయనకంటూ ఓ స్థిర మయిన ఓటు బ్యాంకు ఉంది. కాదనలేం. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఆస్కారం ఉన్న మనిషి. అన్ని విషయాలపై సమగ్రంగా మాట్లాడే అవగాహన ఆయనకు ఉంది. సమర్థత కూడా ఉంది.
కొంత కాలం సాయిరెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు. ఆయన గొంతు అంతా ఆ రోజు సాయిరెడ్డికి వ్యతిరేకంగానే వినిపించింది.. ఆ రోజు ఏ2గా ఆయన్ను పదే పదే ఉద్దేశిస్తూ మాట్లాడిన తీరు ఓ విధంగా సాహసం. మా పార్టీ నేత సాయి రెడ్డి అంటూ మాట్లాడిన వైనం నిజంగానే సాహసం. ఎందుకంటే ఆరోపణలు వేరు, విమర్శలు వేరు. ఏవి చేసినా వాటికి కట్టుబడి మాట్లాడడం ఆయన నైజం.
కొన్ని సందర్భాల్లో అమరావతి రైతులకు మద్దతుగా నిలిచారు. జగన్ సర్కారు తీసుకున్ని కొన్ని నిర్ణయాలను వ్యతిరేకించారు. సుప్రీంకు పోయి కొన్ని విషయాలపై మాట్లాడారు. హై కోర్టుకు పోయి కూడా మాట్లాడారు. నాంపల్లి కోర్టుకు కూడా పోయి జగన్ బెయిల్ రద్దు చేయండి అని పదే పదే విన్నవించారు. ఇంకా ఎన్నో మాట్లాడారు.
ఆయా సందర్భాల్లో ఆయన నెగ్గకున్నా తన దైన వాదన మాత్రం వినిపించి, వీటిలో ఉన్న తప్పేంటో తనకు చెప్పాలని వైసీపీని టార్గెట్ చేశారు. కొన్ని సందర్భాల్లో పవన్ తప్పిదాలనూ ప్రస్తావిస్తూ మాట్లాడారు. అయితే ఆయన విమర్శలను పవన్ స్వాగతించారు. అంతేకానీ నోరేసుకు పడిపోలేదు. ఏ విధంగా చూసినా ఈ నరసాపురం రాజు ఓ విధంగా ప్రత్యేకమే ఆంధ్రావని రాజకీయాల్లో ! ఇకపై కూడా ఇదే పంథాలో రాజకీయం చేస్తానని చెబుతున్న ఆయనకు ఆల్ ద బెస్ట్.