Political News

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్ పేపర్ లీకేజికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ లు చేపట్టిన ఉద్యమం విజయంతం అయ్యాక వైసీపీ లో తరచుగా కాక్రోచ్, జెన్ జీ పేర్లు వినిపిస్తున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ జెన్ జీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు కూడా చేయించారు. …

Read More »

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. లడఖ్‌లోని టుర్‌టుక్‌ నుంచి న్యుబ్రా వెళ్తున్న యూట్యూబర్‌ సుధీర్‌ కుమార్‌కు ఎదరుపై ఆసక్తికర అనుభవం ఇది. మొహర్రం సందర్భంగా మార్గంలో ప్రయాణికులకు కొందరు ఉచితంగా షర్బత్‌ అందిస్తున్నారు. అక్కడ ఓ చిన్నారి సుధీర్‌కు షర్బత్‌ అందిస్తూ డబ్బులు తీసుకునేందుకు నిరాకరించాడు. మీరు …

Read More »

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు. ఎవ‌రి మానాన వారు మాట‌ల తూటాలు పేల్చేస్తున్నారు. త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన పార్టీ ఎమ్మ‌ల్యేలు, ఎంపీలు.. ఇత‌ర నాయ‌కులు కూడా.. సంయుక్తంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల‌ని పార్టీ నిర్దేశించింది. ఈ నేప‌థ్యంలో తాడేప‌ల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌.. తాజాగా పార్టీ …

Read More »

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం లోని నాలుగు కిలో మీట‌ర్ల ప‌రిధిని పోలీసులు ప్ర‌త్యేక జోన్‌గా ప్ర‌క‌టించారు. అదేస‌మ‌యంలో `యాక్ట్ 30` కింద ఆంక్ష‌లు విధించారు. అంటే.. ఎలాంటి నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల‌ను చేప‌ట్ట‌డానికి వీల్లేద‌న్న‌మాట‌. ఇక‌, మొత్తంగా 500 సీసీ కెమెరాలు.. 15 వేల మంది పోలీసులు.. న‌గ‌రాన్ని చుట్టుముట్టేయ‌నున్నారు. వీరితో పాటు స‌రిహ‌ద్దు …

Read More »

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది నాయకులు ప‌క్క‌కు వెళ్లిపోయే అవ‌కాశం క‌నిపిస్తోందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఉత్తరాంధ్ర రాజ‌కీయాల్లో వైసీపీ చాలా చాలా వెనుక‌బ‌డిపోయింది. అధికార కూట‌మి ప‌క్షాలు.. ఉత్త‌రాంధ్ర పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టాయి. గిరిజ‌న ప్రాంతాల్లో జ‌న‌సేన‌, మైదాన ప్రాంతాల్లో టీడీపీ, బీజేపీలు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దీంతో వైసీపీ …

Read More »

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల నుంచి పార్ల‌మెంటు వ‌ర‌కు ఏ ఎన్నిక జ‌రిగినా.. ఉచిత ప‌థ‌కాల‌కు కేరాఫ్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా వినిపించే పేరు భార‌త్‌. నాలుగు ద‌శాబ్దాలకు ముందు ఈ త‌ర‌హా ఉచిత ప‌థ‌కాలు మ‌న దేశంలోనూ లేవు. అయితే.. ప్రాంతీయ పార్టీల ప్రాబ‌ల్యం పెర‌గ‌డం.. జాతీయ పార్టీల‌కు పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో …

Read More »

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు. డీఎస్సీ అక్రమాలపై చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినందుకు బీజేపీ సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ‘కొడుకును కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. బాబు స్కాంల …

Read More »

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో జగన్ కేంద్రానికి లేఖ రాసిన వైనం అప్పట్లో సంచలనం రేపింది. ఇక, తమకు న్యాయస్థానాలపై నమ్మకం లేదు అనే రీతిలో వైసీపీ నేతలు గతంలో వ్యవహరించారు. అయితే, అధికారం పోయినా సరే వైసీపీ అధినేత జగన్ తీరు మారినట్లు …

Read More »

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌, విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ పదవుల నుంచి నుంచి ఆయన వైదొలగడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. బొత్స కుటుంబానికి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్సకు అత్యంత సన్నిహితుడైన చిన్న …

Read More »

విజయవాడ మేయర్ రేసుకు పోటాపోటీ

విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు నాయకులు కర్చీఫ్ వేస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ వారసుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు పలువురు మేయర్ పదవిపై ఆశతో అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎవరి రూట్ లో వాళ్ళు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీలో పోటీ తీవ్రంగా వుంది. జనసేన నాయకులు కూడా …

Read More »

న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. బాబు చేసిన‌ట్టు చేయొచ్చుగా జ‌గ‌న్‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వహ‌ణ నుంచి పోటీ వ‌ర‌కు ఆయ‌న రోజుకొక రీతిలో వ్యాఖ్య‌లు సంధిస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో అస‌లు ప్ర‌భుత్వంపైనే న‌మ్మ‌కం లేద‌ని.. ఈ స్థానిక ఎన్నిక‌ల‌ను స‌జావుగా సాగ‌నివ్వ‌బోద‌ని.. అందుకే నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. మరికొన్ని సంద‌ర్భాల్లో అస‌లు పోలీసు వ్య‌వ‌స్థ‌పైనే న‌మ్మ‌కం లేద‌ని ఆరోపిస్తున్నారు. ఈ …

Read More »

కసబ్ కు వాళ్లకు తేడా లేదు

స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకొని పడ్డారు. పార్లమెంట్ పై దాడికి పాల్పడిన వాళ్ళు , పుల్వామాలో సైనికుల మీద దాడి చేసిన తీవ్రవాదులు , స్పీకర్ ను దూషించిన వాళ్ళు ఒక్కటేనంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ తొలిరోజు బీఆర్ఎస్ కు పోలీసులకు మధ్య జరిగిన ఘటనలు, తదుపరి పరిణామాల సీఎం రేవంత్ …

Read More »