బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. అసెంబ్లీకి హాజరు కానున్నారా? సుదీర్ఘకాలం తర్వాత.. ఆయన సభలో తన గళం వినిపించను న్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా ఆదివారం సాయంత్రం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్లోని నివాసానికి చేరుకోవడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి నుంచి బలమైన విమర్శలు వస్తుండడం.. అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఆయన కోరుతున్న నేపథ్యంలో కేసీఆర్ …
Read More »కూటమికి భరోసా: 2025 విశేషాలు ఇవే.. !
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? అంటే ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన పరిణామాలు గమనిస్తే కూటమిలోని మూడు పార్టీలు బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పాలి. పార్టీ పరంగా పెట్టుకుంటున్న కార్యక్రమాలు భిన్నంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని కీలక అంశాల విషయంలో మాత్రం మూడు పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. మూడు పార్టీలది ఒకే మాట అన్నట్టుగా అడుగులు వేస్తున్నాయి. ఇది కూటమి బలోపేతానికి ప్రధానంగా పని చేస్తోంది. …
Read More »ప్రధాని మోదీ నోట.. నరసాపురం మాట
ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ లో ఏపీలోని హస్తకళలను గుర్తు చేశారు. నరసాపురం లేస్ క్రాఫ్ట్ ను ఆయన ప్రస్తావించారు. ఇక్కడి ఈ హస్తకళకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. నరసాపురంలో లేస్ క్రాఫ్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2000లో నరసాపురం లేస్ పార్క్ను ఏర్పాటు చేశారు. అంబేద్కర్ హస్త వికాస్ యోజన కింద ఈ హస్తకళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు …
Read More »మూడు కాదు.. రెండే.. జిల్లాల విభజన పై బాబు నిర్ణయం!
ఏపీలో జిల్లాల విభజన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటివరకు మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, తాజాగా రెండు జిల్లాలకే పరిమితం కావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ప్రజల అభిప్రాయాలు, వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని జిల్లాల పునర్విభజనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. ప్రజల ఇష్టమే ప్రభుత్వ ఇష్టమని స్పష్టం చేశారు. ప్రజలపై బలవంతంగా రుద్దే ఏ నిర్ణయం సరైంది కాదని చంద్రబాబు …
Read More »2025.. షర్మిల పొలిటికల్ గ్రాఫ్ ఇదేనా?
ఏపీ రాజకీయాల్లో పార్టీ చీఫ్గా పురాతన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణం ఎలా ఉంది? ముఖ్యంగా ఈ ఏడాది 2025లో ఆమె రాజకీయంగా పుంజుకున్నారా? పార్టీపై పట్టు, నేతలపై అవగాహన సాధించారా? అనే ప్రశ్నలు ఆసక్తిగా మారాయి. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ నెలలు, సంవత్సరాల క్యాలెండర్ తిరుగుతుంటే నాయకుల పనితీరుపై అంచనాలు కూడా పెరగాలి. అదే సమయంలో వారి …
Read More »ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశంసలు
కాంగ్రెస్ పార్టీలో ఆర్ఎస్ఎస్, బీజేపీలపై నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీయగా, మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చేసిన ప్రశంసలు పార్టీలో అసంతృప్తిని పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ సీనియర్ …
Read More »వారు గీత దాటితే కటకటాలే
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మేకను నరికి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోకు అభిషేకం చేశారు. మేక తలకాయ పట్టుకుని వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. రాజకీయ ముసుగులో జగన్ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అమరావతి ఎన్టీఆర్ భవన్ లో ఆమె మీడియా …
Read More »ఒకప్పుడు నేతలకు.. ఇప్పుడు పిల్లలకు..
హైదరాబాద్లోని గండిపేట ప్రాంతంపై తనకు ఎంతో మక్కువ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. గండిపేటలో ఒకప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం ఉండేదని చెప్పారు. అక్కడ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శిక్షణ ఇచ్చి వారిని మేలైన నేతలుగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ఎన్టీఆర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అందుకే తనకు గండిపేట అంటే అమితమైన మక్కువ అని అన్నారు. …
Read More »2025: ట్రంప్ ఏడాది పాలన.. అగ్రరాజ్యంలో అసమ్మతి!
రాష్ట్రంలో అయినా.. దేశంలో అయినా.. పాలకులపై ప్రజల్లో అసంతృప్తి ఎప్పుడు పెల్లుబుకుతుంది? అంటే.. చెప్పడం కష్టమేమీ కాదు. ఓ రెండేళ్ల పాలన తర్వాతో.. మూడేళ్ల పాలన తర్వాతో సహజంగానే పాలకుల విధానాలపై ప్రజల్లో అసంతృప్తి..సంతృప్తులను కొలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, చిత్రంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో కేవలం నెలల వ్యవధిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. చేసిన ప్రకటనలు.. వంటివి తీవ్రస్థాయిలో కుదిపేశారు. …
Read More »ఫ్యాక్ట్ చెక్: ఇంద్రకీలాద్రికి కరెంట్ కట్?
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దేవస్థానానికి సంబంధించి విద్యుత్ బిల్లుల అంశంపై ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. లక్షల మంది భక్తులు సందర్శించుకునే ఈ ఆలయానికి బిల్లులు బకాయిలు ఉన్నాయనే కారణంతో గంటసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం.. ఆ వెంటనే పునరుద్ధరించటం జరిగిపోయాయి. దీనికి సంబంధించి దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు వివరణ ఇచ్చారు. రెండేళ్లుగా దుర్గ గుడి యాజమాన్యం అప్పారావుపేటలోని, పాముల కాలువ వద్ద …
Read More »2025: బీఆర్ఎస్.. ఉత్థానం.. పతనాలు!
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి 2025లో ఏం జరిగింది? 2023లో ఎదురైన పరాభవం, పరాజయం తర్వాత పార్టీ ఏమైనా పుంజుకుందా? లేక మరింత వెనుకంజలోనే ఉందా? అనేది ఆసక్తికరం. ఈ క్రమంలో కీలకమైన ఐదు ఘట్టాలను చర్చిస్తే పార్టీ పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. 1) ఉన్న సీటును కోల్పోవడం:ఒకవైపు 2023లో బీఆర్ ఎస్ తరఫున గెలిచిన 10 మంది పార్టీకి దూరమయ్యారు. దీనిపై పోరాటం చేస్తున్న పార్టీకి …
Read More »జేసీ న్యూ ఇయర్ ఆహ్వానాన్ని మాధవీ మన్నిస్తారా?
టాలీవుడ్ సినీ నటి మాధవీలత వర్సెస్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ల మధ్య ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. జేసీపై మాధవీలత విమర్శలు చేయడం…ఆ తర్వాత మాధవీ లతపై జేసీ అభ్యంతరకర కామెంట్లు చేయడం వివాదానికి దారి తీసింది. అయితే, ఆ తర్వాత ఒకరికి ఒకరు సారీ చెప్పడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, ఈ సారి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates