వైసీపీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి సీఎం వైఎస్ జగన్ కీలక నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు ముఖ్య నేతలకు అప్పగించిన విషయం విదితమే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల బాధ్యతలను రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి అప్పగించగా….ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల బాధ్యతలను టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డికి….కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పార్టీ వ్యవహారాలను సజ్జల రామకృష్ణారెడ్డికి …
Read More »ఇలాంటి విమర్శలు చంద్రబాబు నోటి నుంచా?
సంచలన ఆరోపణ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతి విషయానికి అవసరానికి మించి స్పందించే ఆయన తీరుతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఆయనలో అభద్రతా భావం అంతకంతకూ పెరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇందుకు తగ్గట్లే.. అవసరం లేకున్నా అదే పనిగా మాట్లాడే ధోరణి ఎక్కువ అవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద విమర్శలు.. ఆరోపణలు చేసేటప్పడు తగిన ఆధారాలతో ప్రజల ముందుకు రావటం బాగుంటుంది. …
Read More »ఆ ఫార్ములా వర్కవుట్ అయితే…కాబోయే సీఎం పవన్?
రాజకీయాల్లో అనుభవం చాలా ముఖ్యం…ఇదే విషయం చాలా సార్లు నిరూపితమైంది కూడా. ప్రజా జీవితంలో ఎక్కువ కాలం ఉంటే ఎంతోకొంత రాజకీయ అనుభవం వస్తుంది. అయితే, రాజకీయ అనుభవంతోపాటు ప్రజల కష్టాలను అతి దగ్గరగా చూసిన రాజకీయ నాయకులు ప్రజల నాడిపట్టడంలో సక్సెస్ అయ్యారు. పాదయాత్రల ద్వారా ఏపీలోని పల్లె పల్లెకు వెళ్లి ప్రజల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకొని తమ మేనిఫెస్టో ప్రవేశపెట్టిన వారున్నారు. దివంగత నేత, ఏపీ …
Read More »ప్రభుత్వాన్ని కమ్మ నేతలు ప్రశ్నించకూడదా?
కులం పేరుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై సోషల్ మీడియాలో పోస్టులు వెలువడుతున్న సంగతి తెలిసిందే. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామకృష్ణ…టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామకృష్ణపై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారాన్ని సీపీఐ నేతలు ఖండిస్తున్నారు. వైసీపీ కుల రాజీకీయాలకు పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కుల నీతిని వామపక్ష నేతలు …
Read More »జగన్ కు ముద్రగడ రిక్వెస్ట్ కమ్ డిమాండ్
కాపు రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందని పాదయాత్ర సందర్భంగా నాటి ప్రతిపక్ష నేత నేటి ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాపుల రిజర్వేషన్లకు వైసీపీ పూర్తి మద్దతునిచ్చినందుకే తుని రైలు దహనం ఘటనలో వైసీపీ నేతలను ఇరికించారని కూడా జగన్ గతంలో ఆరోపించారు. కాపులకు అండగా నిలుస్తానని, బీసీలకు అన్యాయం జరగకుండా…కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నానని కూడా జగన్ చెప్పారు. అయితే, అధికారంలోకి వచ్చి ఏడాది …
Read More »గ్రేటర్ హైదరాబాద్లో మళ్లీ లాక్ డౌన్ పెట్టాలా? వద్దా?
కేసీఆర్ మాట్లాడినా వ్యూహమే. మాట్లాడకపోయినా వ్యూహమే. ఆయన అధికారికంగా ఏదైనా ప్రకటన చేసినా దానికో లెక్క ఉంటుంది. అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ విషయంలో ఆయన వైఖరి లక్షలాది మందిని బుక్ చేసేలా ఉందంటున్నారు. ఇంతకీ ఎందుకు ఆ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే….జూన్ 28న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పాజిటివ్ …
Read More »రఘురామకృష్ణం రాజు ఆత్మ వేరే పార్టీలో ఉంది
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఖరి ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రఘురామకృష్ణరాజుకు విజయసాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్హెడ్పై షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. షోకాజ్ కు సమాధానమిచ్చే క్రమంలో…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న పేరు వైసీపీ వాడకూడదన్న వాదనను రఘురామ తెరపైకి తెచ్చారు. అంతేకాకుండా, తనకు వైసీపీ శ్రేణుల నుంచి ప్రాణహాని ఉందని… కేంద్ర …
Read More »జగన్ ని ఆకాశానికెత్తేసిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పవన్ సందర్భానుసారంగా గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో పాటు మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఏడాది కాలంగా వివిధ అంశాల్లో వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన స్వయంగా సీఎంను మెచ్చుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ను మెచ్చుకోవడానికి కారణం అంబులెన్స్లు. రెండురోజుల క్రితం వెయ్యికి పైగా 104, 108 అంబులెన్స్ వాహనాలను జగన్ …
Read More »ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణానికి డేట్ ఫిక్స్?
ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్.. మోపిదేవి వెంకటరమణలు ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ రెండు ఖాళీల్ని ఎప్పుడు భర్తీ చేస్తారు? ఎవరికి కొత్త మంత్రులుగా అవకాశం లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏడాది పాలనతో దూసుకెళుతున్న జగన్ సర్కారు.. మహమ్మారి లాంటి విపత్తు వేళలోనూ.. తనదైన శైలిలో పాలనపై ముద్ర వేస్తున్నారు. మహమ్మారికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోజగన్ …
Read More »ఇందుకు కదా చంద్రబాబును విమర్శించేది ?
రాజకీయాలన్నాక విమర్శలు చేయాలి. కానీ.. చేసేవి ప్రజల్ని ప్రభావితం చేసేలా ఉండాలి. అంతేకాదు.. ఇదెక్కడి గోలండి? ప్రభుత్వం చేసే ప్రతి పనిని అదే పనిగా విమర్శించటం మినహా మరింకేమీ పని ఉండదా? అన్న భావన కలుగక కూడదు. ప్రభుత్వం చేస్తున్న పనుల మీద ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే ప్రయోజనం ఉంటుంది. ఆ విషయాన్ని వదిలేసి.. నిద్ర లేచింది మొదలు పడుకునే …
Read More »అమరావతి – ఉద్యమంలా కదులుతున్న ఎన్నారైలు
నిర్విరామంగా సాగుతున్న రైతుల అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. 200 రోజులు పూర్తి చేసుకుంటున్న అమరావతి సాధన ఉద్యమానికి అండగా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఎన్నారైలు ఏకమై సంఘీభావం తెలుపుతున్న సంగతి తెలిసిందే. ముందు ఒక్క అమెరికాలో కొన్ని ప్రముఖ నగరాల్లో సంఘీభావంగా నిరసన తెలుపుదాం అని కోమటి జయరాం ఆధ్వర్యంలో కొందరు సంకల్పించారు. అయితే… తర్వాత 200 రోజులుక చిహ్నంగా 200 నగరాల నుంచి నిరసన తెలిపితే బాగుంటుందని …
Read More »కేసీఆర్ కు కొత్త తలనొప్పిగా విజయసాయి ట్వీట్
పోలిక మానవ నైజం. అందునా రాజకీయాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. ఏదైనా విషయంలో ఒక రాష్ట్రం విజయం సాధించిన వెంటనే.. రెండో రాష్ట్ర పాలకుల పని తీరుతో పోల్చటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. ఒకేలాంటి అంశాల్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా డీల్ చేస్తున్నారన్న అంశంపైనా ఆసక్తి పెరిగింది. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని కంట్రోల్ చేసే విషయంలో ఏ దేశానికి ఆ …
Read More »