Political News

జగన్ సర్కారుకు రమణ దీక్షితులు షాక్

తిరుమల శ్రీవారి ఆలయంలో దశాబ్దాలుగా కీలక పురోహితుడిగా ఉన్న రమణ దీక్షితులు.. మరోసారి చర్చనీయాంశంగా మారారు. టీటీడీకి సంబంధించి ఆయన తాజా ట్వీట్ సంచలనం రేపుతోంది. ఉత్తరాఖండ్‌లో నాలుగు ధామాలు, మరో 51 ఆలయాలకు సంబంధించిన కేసుల్లో కోర్టు ఆర్డర్‌లు రిజర్వ్ చేసిందంటూ భాజపా సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. రమణ దీక్షితులు ‘‘ఆల్ ది బెస్ట్ స్వామీ.. ఆ దేవుడు మీకు విజయాన్ని అందించేలా దీవించాలని …

Read More »

జాగ్రత్త పడకపోతే సీఎం జగన్ కి సోకేది

ఏపీలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను పడుకోబెట్టిన కరోనా తాజాగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కూడా సోకింది. ఏపీలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయనడానికి చిహ్నంగా పెద్దలు కూడా దీని బారిన పడుతున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు ఆయన గన్ మెన్ కి కూడా కరోనా సోకినట్లు వెల్లడించారు. కరోనా సోకినా అంజాద్ బాషా కు పెద్దగా లక్షణాలు లేకపోవడంతో హొం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అంజాద్ భాషా …

Read More »

కోవిడ్ వచ్చాక జగన్ తొలి రూరల్ టూర్ ఇదే

వైఎస్సార్ జయంతికి వైఎస్ కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఇపుడుపుపాయలకు చేరుకుని తండ్రి సమాధి వద్ద శ్రద్దాంజలి ఘటించడం ఆనవాయితీ. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న రెండో జయంతి కార్యక్రమం ఇది. ఈ నేపథ్యంలో ఈరోజే ముఖ్యమంత్రి జగన్ కుటుంబం ఇడుపుల పాయకు చేరుకుంటుంది. తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వెళ్తారు. కడప విమానాశ్రయం నుంచి ఇడుపుల పాయకు హెలికాప్టర్ లో వెళ్తారు. అక్కడ …

Read More »

‘వైకాపా ప్రభుత్వం.. అది 3 వేల కోట్ల స్కాం’

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైకాపా ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇళ్ల స్థ‌లాల పంపిణీ విష‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇందులో రూ.3 వేల కోట్ల కుంభ‌కోణం దాగి ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు ప‌నికి రాని భూములు ఇస్తోంద‌ని ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన ఆయ‌న‌.. తెలుగుదేశం ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్మించిన ఇళ్ల‌ను పేదలకు ఇవ్వడానికిఎందుకు మనసురావడం లేదని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వం రూ.3వేల …

Read More »

వైకాపాలో స్టార్ ఎమ్మెల్యే వెర్స‌స్ సీనియ‌ర్ నేత‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటై ఏడాదైందో లేదో.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌ట్లేదు. తాజాగా చిల‌క‌లూరి పేట‌లో అధికార పార్టీ కీల‌క నేత‌ల మ‌ధ్య విభేదాల‌తో రాజ‌కీయం రాజుకుంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ర‌జ‌నీ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆమె వైకాపా స్టార్ ఎమ్మెల్యేల్లో ఒక‌రు. ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి సంచ‌ల‌నం సృష్టించారు ర‌జ‌నీ. ఇక …

Read More »

సామాన్యుల సందేహాలకు టీ గవర్నర్ సమాధానాలు చూశారా?

రాజకీయాల్లో అవకాశం అన్నది ఇవ్వకూడదు. ఎవరో దూసుకెళ్లారని ఫీల్ కావటంలో అర్థం లేదు. ఎందుకంటే.. అలాంటి పరిస్థితి ఇచ్చినోళ్లది తప్పు కానీ.. దాన్ని వినియోగించుకునే వారిని తప్పు పట్టటంలో అర్థం లేదు. ఎక్కడిదాకానో ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై చురుగ్గా ఉండటమేకాదు.. పలుమార్లు వివిధ శాఖల అధికారుల్ని రాజ్ భవన్ కు పిలిపించి.. వివిధ అంశాల మీద రివ్యూ భేటీలు నిర్వహించటం తెలిసిందే. గవర్నర్ …

Read More »

అమ‌రావతి ఉద్య‌మంలోకి మ‌ళ్లీ ప‌వ‌న్..

వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై ఇటీవ‌లే సానుకూల వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఐతే ఆ వ్యాఖ్య‌లు క‌రోనాపై పోరులో జ‌గ‌న్ స‌ర్కారు చేస్తున్న కృషి వ‌ర‌కే ప‌రిమితం అని ప‌వ‌న్ సంకేతాలిచ్చారు. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని త‌ర‌లింపుపై అక్క‌డి రైతుల పోరాటం 200వ రోజుకు చేరిన నేప‌థ్యంలో వారికి త‌మ పార్టీ త‌ర‌ఫున సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు ప‌వ‌న్. అమ‌రావ‌తి …

Read More »

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో శృతి మించిన కరోనా

టెస్టులు చేస్తున్న రాష్ట్రంలోను కేసులు కంట్రోల్ కావడం లేదు. టెస్టులు చేయని రాష్ట్రంలోను కరోనా కంట్రోల్ కావడం లేదు. టెస్టులతో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాలు సమాంతరంగా కేసులు పెరుగుతున్నాయి. ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. టెస్టింగ్ ట్రేసింగ్ చేసినా ఏపీలో ఎందుకు అంత పెరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ముందు నుంచి అప్రమత్తంగా ఉందన్న తెలంగాణ రాజధాని హైదరాబాదును సగం మంది ఖాళీ చేసినా ఎందుకు విజృంభిస్తుందో తెలియడం …

Read More »

డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పింది త‌ప్పు.. క‌రోనా అలా కూడా వ్యాపిస్తుంది

క‌రోనా వైర‌స్ ప్ర‌ధానంగా దాని బాధితులు తుమ్మిన‌పుడు, ద‌గ్గిన‌పుడు వెలువ‌డే తుంప‌ర్లు మ‌రో వ్య‌క్తికి మీద ప‌డ‌టం ద్వారా వ్యాప్తిస్తుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) చెబుతూ వ‌స్తోంది. క‌రోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తుంద‌ని.. వైర‌స్ క‌ణాలు గాలిలో చాలాసేపు ఉంటాయ‌ని కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు ముందు నుంచి చెబుతూ వ‌స్తున్న‌ప్ప‌టికీ.. డ‌బ్ల్యూహెచ్‌వో అందుకు ఆధారాలు లేవ‌ని కొట్టి పారేసింది. గాలి ద్వారా క‌రోనా వ్యాప్తి చెంద‌ద‌నే చెబుతూ వ‌చ్చింది. …

Read More »

టెస్టుల్లో ఏపీ రికార్డు – అది మాయంటున్న చంద్రబాబు

దేశం కోటి టెస్టుల మైలురాయిని అధిగమించింది. అదేసమయంలో ఏపీ మిలియన్ టెస్టుల మైలురాయిని అధిగమించింది. దీనిపై చంద్రబాబు తీవ్ర అనుమానాలు వ్యక్తంచేశారు. ఏపీలో మోసం జరుగుతోందని అనుమానపడ్డారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దీనిపై ఒక అధ్యయనం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఏపీలో కరోనా పరీక్షలపై తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపణలు చేయడం వెనుక కొన్ని కారణాలున్నాయి. ఇటీవలే ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ …

Read More »

హైద‌రాబాద్‌పై ఓ క‌న్నేయండి కేసీఆర్ సార్‌

తెలుగువార‌నే కాకుండా దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు అత్య‌ధికంగా జీవిస్తున్న హైద‌రాబాద్ నగ‌రంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మ‌నోళ్ల చూపు ప‌డుతోంది. అయితే, ఇది పెట్టుబ‌డుల కోణంలోనో లేక హైద‌రాబాద్ అంటేనే గుర్తుకువ‌చ్చే ఇంకేదైనా వివాదాస్ప‌ద‌ అంశంతో కాదు. క‌రోనాతో. ఈ మ‌హ‌మ్మారి విస్తృతి, ఇక్క‌డి కేసుల తీరుతో. న‌గ‌రంలోని ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోవ‌డం, ఊరు వ‌దిలిపోతున్న తీరుతో. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో క‌రోనా వైర‌స్ రోజు రోజుకి విస్త‌రించుకుంటు పోతున్న‌ది. …

Read More »

ఇటు #whereiskcr.. అటు #10millioncovidtestsinap

రెండు నెలల కిందట తెలుగు రాష్ట్రాల జనాలు ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెగ పొగుడుతుండేవాళ్లు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురుస్తుండేది. కరోనా నియంత్రణలో కేసీఆర్ చాలా సమర్థంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించేది. ఈ విషయంలో ఏపీ సీఎం ఫెయిలైనట్లే అని అంతా తీర్మానించేశారు. కానీ అప్పటితో పోలిస్తే పరిస్థితి ఇప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ విమర్శలెదుర్కొంటున్నారు. జగన్‌పై …

Read More »