కోనసీమ ప్రాంతంలోని అమలాపురంలో మంగళవారం చోటు చేసుకున్న విధ్వంసం వెనుక పక్కా ప్లాన్ ఉందని తెలుస్తోందని మంత్రి విశ్వరూప్ తెలిపారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యేల ఇళ్లకు పక్కా ప్రణాళికతోనే నిప్పు పెట్టారని ఆయన అన్నారు. కీలక నేత అనుచరులే నిప్పు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురం ముట్టడికి.. కేవలం 406 మంది పోలీసులతో భద్రత నిర్వహించారు
మూడు వేలకు పైనే ఆందోళనకారులు వచ్చినట్లు గుర్తించామని మంత్ర విశ్వరూప్ తెలిపారు. విధ్వంసం తర్వాత మరో 955 మంది పోలీసులను తరలించారన్నారు. దాడి వెనుక వైసీపీ నేతల సూచనలున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, విధ్వంసం వెనుక వైసీపీ నేత హస్తం ఉందని విశ్వరూప్ అన్నారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలూ తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. నిన్నటి ర్యాలీలోకి సంఘ విద్రోహశక్తులు చొరబడ్డాయని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఈ ఘటనలో టీడీపీ , జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని ఆరోపించారు.
నిన్న ఆందోళనకారులు నిప్పంటించిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. ర్యాలీకి పిలుపు నిచ్చిన కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలని విశ్వరూప్ అన్నారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ర్యాలీలోకి చొరబడ్డారని ఆరోపించారు. అమలాపురం ప్రజలకు ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేవన్నారు. ఉద్యమం ముసుగులో కొంతమంది రౌడీషీటర్లు చొరబడ్డారని ఆరోపించారు.
ముందుగా అనుకున్న ప్రకారమే తన ఇంటిపై దాడి చేశారని మంత్రి విశ్వరూప్ తెలిపారు. ఈ ఘటనలో టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారన్నారు. వారు తమ పార్టీ నేతలను కూడా రెచ్చగొట్టి ముగ్గులోకి లాగినట్టు అనుమానం ఉందన్నారు. ఈ కేసులో ఎవరికి ఎలాంటి ప్రమయం ఉన్నా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. తమ కుటుంబసభ్యులంతా క్షేమంగా ఉన్నామని తెలిపారు. అమలాపురం ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. అంబేడ్కర్ పేరు పెట్టాలని అన్ని పార్టీలు కోరాయని మంత్రి విశ్వరూప్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates