Political News

ఉచిత విద్యుత్ పథకంపై జగన్ సంచలన నిర్ణయం

ఏపీలో చాలాకాలంగా అనేక ఉచిత పథకాలు అమల్లో ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఇంబర్స్ మెంట్…ఇలా అనేక పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రజలు లబ్ధి పొందుతున్నారు. అయితే, ఈ పథకాలలో ప్రభుత్వం నుంచి ఎంత నగదు లబ్ధి పొందారో లబ్ధిదారులకు కచ్చితంగా తెలుస్తుంది. ఇక, ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తోన్న ప్రతి పథకం ద్వారా లబ్ధిదారులు ఎంత మొత్తంలో లబ్ధి పొందుతున్నారో తెలిసిపోతోంది. ఆయా పథకాల …

Read More »

డీజీపీ సవాంగ్ కు చంద్రబాబు లేఖ

ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా పెందుర్తిలోని టాలీవుడ్‌ నిర్మాత, నటుడు నూతన్‌ నాయుడు ఇంట్లో దళిత యువకుడి శిరోముండనం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతోపాటు, డాక్టర్ సుధాకర్ కేసు, కొందరు జర్నలిస్టులపై దాడి….ఇలా వరుస ఘటనలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీల శాంతి భద్రతలు నానాటికీ …

Read More »

అర్థరాత్రి ట్యాంక్ బండ్ పై గ్యాంగ్ వార్

కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. సోమవారం తెల్లవారుజామున ట్యాంక్ బండ్ పై మొదలైన చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారటమే కాదు.. గ్యాంగ్ వార్ ను తలపించేలా చేసింది. టూవీలర్ మీద వేగంగా వెళుతున్న ముగ్గురిని.. నెమ్మదిగా వెళ్లాలని చెప్పటమే పెద్ద తప్పుగా మారింది. అది కాస్తా పెద్ద గొడవగా మారటమే కాదు.. పలువురికి గాయాలు.. కారు తగలబడింది. పక్కనే ఉన్న బస్టాపు …

Read More »

అదిరిపోయేలా సచివాలయ కూల్చివేత వ్యర్థాల లెక్కలు

తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి.. దాని స్థానంలో కొత్తది నిర్మించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలిసిందే. సచివాలయ కూల్చివేతపై హాట్ హాట్ గా చర్చలు నడుస్తున్న వేళలో.. అధికారికంగా నిర్ణయం తీసుకొని యుద్ధ ప్రాతిపదికన కూల్చేశారు. సచివాలయ కూల్చివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టి దాదాపు నెలకు పైనే కావొస్తున్నా.. ఇప్పటివరకు వాటి వ్యర్థాల తరలింపే పూర్తి కాకపోవటం గమనార్హం. దీనికి కారణం సచివాలయ వ్యర్థాలు భారీగా ఉండటంతో …

Read More »

ఏపీలో భారీగా పెరిగిన అత్యాచారాలు రేటు

ఏపీ రాష్ట్ర హోం మంత్రి ఒక మహిళ. దిశ చట్టాన్ని తీసుకొచ్చి అత్యాచారాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మహిళలపై నేరాలకు పాల్పడితే ఏకంగా జైలుపాలే అంటూ భారీ ప్రకటనలు చేసే ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో అత్యాచార కేసుల నమోదు ఎక్కువగా ఉండటం దేనికి నిదర్శనం? భర్త కళ్ల ముందే భార్యను.. బైకు మీద ప్రియుడితో వెళుతున్న ప్రియురాలిని.. ఇంట్లో ఉన్న మైనర్ బాలికపైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో …

Read More »

కరోనా వేళ.. సుప్రీంకోర్టు జడ్జి స్ఫూర్తిదాయక నిర్ణయం

ప్రపంచాన్ని చుట్టుముట్టిన కరోనాతో దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలిసిందే. రికార్డుస్థాయిలో నమోదవుతున్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయినప్పటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు తీసుకోవటం లేదని చెబుతున్నారు. వీలైనంతవరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండటం.. భౌతిక దూరంపాటించటం.. అనవసరంగా బయట తిరిగే కార్యక్రమాల్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటివేళ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఆదర్శప్రాయంగా …

Read More »

జగన్ కు బిగ్ రిలీఫ్ !

ఒకవైపు కరోనా.. మరోవైపు తగ్గిన ఆర్థిక కార్యకలాపాలు. వెరసి.. ఏపీ సర్కారుకు ఆదాయం అంతకంతకూ తగ్గుతోంది. అదే సమయంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. పథకాల కోసం నిధులు అవుసరమవుతున్నాయి. చేతిలో డబ్బులేని వేళ.. ప్రభుత్వ ఖర్చుల కోసం అప్పు తేవటంపైన ఏపీ సర్కారు ఫోకస్ పెడుతోంది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారీ అప్పును తీసుకురావటం తెలిసిందే. అయినప్పటికీ నెల తిరగేసరికి నిధుల కోసం కిందామీదా పడే …

Read More »

ఆంధ్రప్రదేశ్ నంబర్ టూ

ఒక ప్రమాదకర విషయం బయటపడ్డపుడు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ అదే ప్రమాదకర పరిస్థితి రోజుల తరబడి కొనసాగుతున్నపుడు.. ఒక దశ దాటాక అది మామూలు విషయం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం తాలూకు వార్తలు ఇలాగే తయారయ్యాయి. ఒకప్పుడు ఏపీలో వందల్లో కేసులు బయటపడుతుంటేనే తెగ భయపడిపోయే వాళ్లం. కానీ అది వేల స్థాయికి వెళ్లిపోయి చాలా కాలం అయింది. ఒక దశలో రోజుకు పది వేల …

Read More »

అల్లర్లతో అట్టుడికిపోతున్న చోటుకు వెళ్లనున్న ట్రంప్

అమెరికాలోని నల్లజాతీయుల మీద ఇటీవల కాలంలో జరుగుతున్న దాడులు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల నల్లజాతీయుడు జేకబ్ బ్లేక్ పైన పోలీసులు తుపాకీతో కాల్పులు జరపటం.. దీనికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ గా మారింది. చేతిలో కత్తి లాంటి ఆయుధం ఉందన్న పేరుతో.. చుట్టూ మూగిన పోలీసులు ఆ వ్యక్తిపై కాల్పులు జరపటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జేకబ్ ప్రాణాపాయస్థితిలోనే ఉన్నాడు. …

Read More »

‘139 బాధితురాలు’ అతడి చేతిలో బంధీనా?

దాదాపు పదేళ్ల పాటు ఆమెకు నరకం చూపిస్తున్నారు. శారీరక.. మానసిక వేధింపులతో ఆమెను ఆటబొమ్మలా వాడేసిన వైనం బయటకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 139 మంది చేతిలో అత్యాచారానికి గురైనట్లుగా చెబుతున్న యువతికి సంబంధించి విషయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వందకు పైగా పేజీల్లో తాను పడిన నరకం గురించి.. తనను దారుణంగా హింసించిన వారిపై పంజాగుట్ట పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. …

Read More »

శిరోముండ‌న వివాదం.. ఆ కుర్రాడికి ఉద్యోగం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో రెండు రోజులుగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన అంశం.. విశాఖ‌ప‌ట్నంలో శ్రీకాంత్ అనే కుర్రాడికి శిరోముండ‌నం చేయించ‌డం. బిగ్ బాస్ షోతో పాపుల‌ర్ అయిన నూత‌న్ నాయుడు కుటుంబం ఈ ద‌ళిత యువ‌కుడికి బ‌ల‌వంతంగా గుండు కొట్టించిన ఉదంతం సంచ‌ల‌నం రేపింది. త‌మ ఇంట్లో దొంగ‌త‌నానికి పాల్ప‌డి ప‌ని మానేశాడ‌న్న కార‌ణంతో నూత‌న్ కుటుంబం ఈ దారుణానికి ఒడిగ‌ట్టింది. సీసీ కెమెరాలో ఈ మొత్తం ఉదంతం రికార్డ‌వ‌డం, అది సోష‌ల్ …

Read More »

Ntv 13ఏళ్ళ ప్రస్థానం… ప్రతిక్షణం ప్రజాహితంతో ముడిపడిన ప్రయాణం..

తెలుగు మీడియా రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఎన్టీవీ న్యూస్ ఛానల్ 13 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 13 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలను సాధించిన ఎన్టీవీ ఏ ఒక్కరికి అనుకూలంగా ఉండకుండా నిజమైన వార్తలను నిక్కచ్చిగా ప్రసారం చేస్తూ, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచింది ఎన్టీవీ.  ఇటు ప్రజలకు అవసరమైన వార్తలను అందిస్తూనే మరోవైపు ధార్మిక కార్యక్రమాలను సైతం చేపడుతున్నది.  2013 నుంచి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, మఠాధిపతులు, జాతీయ స్థాయి …

Read More »