ఈ చిత్రం చూశారా.. ఒకరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మరొకరు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. వారే.. కింజరాపు అచ్చన్నాయుడు, సోము వీర్రాజు. 2019 తర్వాత.. ఇప్పటి వరకు ఒకరికొకరు ముభావంగా ఉన్నారే తప్ప.. ఎవరు ఎవరితోనూ కలిసి మాట్లాడుకున్నది లేదు. పైగా.. ఎదురు పడే అవకాశం వచ్చినప్పటికీ తప్పించు కుని తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది తాజాగా ఈ ఇద్దరు నాయకులు ఒకఫంక్షన్‌లో కలుసుకున్నారు. ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు.
ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందనే సంకేతాలు వస్తున్న నేపథ్యం లో ఈ ఇద్దరు నాయకుల కరచాలనం.. పలకరింపులకు ప్రాధాన్యం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో అటు టీడీపీ, ఇటు బీజేపీలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమాలకు హాజరైన అచ్చెన్నా యుడుకు సోము వీర్రాజు ఎదురు పడ్డారు. దీంతో సోమే ముందుగా.. అచ్చెన్నా ఎలా ఉన్నావ్! అంటూ.. పలకరించారు. దీనికి ప్రతిగా అచ్చెన్నాయుడు.. వీర్రాజన్నా… ఎలా ఉన్నారు! అంటూ.. పలకరించారు.
వాస్తవానికి 2019 తర్వాత.. అటు టీడీపీ, ఇటుబీజేపీలు అనేక కార్యక్రమాలునిర్వహించాయి. ఇసుక, రాజధా ని.. వంటి కీలక అంశాలపై ఉద్యమాలు చేసినప్పుడు కూడా… రెండు పార్టీలు కూడా.. దూరదూరంగానే వ్యవహరించాయి. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో టీడీపీ నిరసనలకు పిలుపు ఇచ్చిన సమయంలో బీజేపీ వాయిదా వేసుకున్న పరిస్థితి కూడా ఉంది.
అయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో రెండు పార్టీల మధ్య సామరస్యం ఉండాల నే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రెండు పార్టీలు చేరువ అవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి నాయకులు వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేయడమే ఉత్తమమని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి అచ్చెన్న, సోముల కలయిక, పరిచయాలు.. వంటివి రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates