పవన్ సర్వేలో షాకింగ్ విషయాలు !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతిలో పోటీచేస్తే గెలుపు కష్టమేనా ? ఇపుడిదే విషయమై చర్చ మొదలైంది. పవన్ తిరుపతిలో పోటీచేస్తే లక్ష ఓట్ల మెజారిటితో గెలిపిస్తామని ఈమధ్యనే జనసేన లోకల్ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. అంతేకాకుండా తిరుపతి నేతలంతా కలిసి పవన్ పోటీపై ఒక తీర్మానంకూడా చేసి పంపారు. వీళ్ళ తీర్మానం, లక్ష ఓట్లమెజారిటి లాంటి అనేక విషయాలు చూసి పవన్ సర్వే చేయించుకున్నారట.

అయితే ఈ సర్వేలో అనేక షాక్ కొట్టే విషయాలు బయటపడ్డాయట. అవేమిటంటే కాపులు అంటే బలిజల ఓట్లుపడటం ఖాయమే అయినా మిగిలిన సామాజికవర్గాల ఓట్లు పడవని తేలిందట. ఎందుకంటే జనసేన నేతల ఓవర్ యాక్షనే కారణమని బయటపడిందట. జనసేన అంటే అచ్చంగా కాపుల పార్టీ మాత్రమే అన్నట్లుగా లోకల్ లీడర్లు వ్యవహరిస్తున్నారట. అంటే చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు కూడా ఇలాంటి గొడవలే జరిగాయి.

చిరంజీవి పార్టీ కేవలం కాపులకు సంబంధించిన పార్టీ మాత్రమే అన్న ముద్రపడిపోవటంతో ఇతర సామాజికవర్గాల్లో పెద్దగా ఓట్లుపడలేదు. దాంతో 18 సీట్లకు చిరంజీవి పరిమితమైపోయింది. ఎన్నికలకు ముందుకూడా 87 శాతం ప్రజల మద్దతుతో చిరంజీవి అధికారంలోకి వస్తారని కొన్ని మీడియా సంస్ధలు పదే పదే సర్వేలంటు ఊదరగొట్టాయి. మరి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసిన చిరంజీవికి పెద్ద షాకే కొట్టింది. దీనికి కారణం ఏమిటని ఆరాతీస్తే వివిధ నియోజకవర్గాల్లో కాపు నేతల ఓవర్ యాక్షనే కారణమని బయటపడింది.

సరిగ్గా ఇపుడు తిరుపతిలో కూడా ఇలాంటి ఓవర్ యాక్షనే ఎక్కువగా జరుగుతోందట. లోకల్ నేతల ఓవర్ యాక్షన్ కారణంగా జనసేనకు మిగిలిన సామాజికవర్గాలు దూరమైపోయాయట. అందుకనే పవన్ ఇక్కడ పోటీచేసినా గెలుపు సాధ్యంకాదని సర్వేలో తేలిందట. పైగా పార్టీలో ఉన్న నేతల్లో ఏ ఒక్కరికీ జనబలం లేదన్న విషయం కూడా బయటపడిందట. దాంతో ఇలాంటి నేతలను నమ్ముకుని పోటీలోకి దిగాలా ? వద్దా ? అన్నది పవనే నిర్ణయించుకోవాలి.