ఇంత వ‌యొలెన్స్ అవ‌స‌ర‌మా జ‌గ‌న్ ?

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

వ‌రుస అరెస్టుల‌తో టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు యువ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్. ఆ విధంగా ధూళిపాళ న‌రేంద్ర‌ను అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్త ఒక‌టి వ‌చ్చింది. అక్క‌డి తెలుగుదేశం పార్టీ అప్ర‌మ‌త్తం అయిపోయింది. పొన్నూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా జరుగుతోందని ఆరోపిస్తూ టీడీపీ నేతలు ఛలో అనుమర్లపూడికి పిలుపునిచ్చిన నేప‌థ్యాన ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పోలీసులు అత్యంత అమాన‌వీయ ధోర‌ణిలో ధూళిపాళ న‌రేంద్ర‌ను అరెస్టు చేశారు. దీనిపై లోకేశ్ స్పందించారు. అధినేత చంద్ర‌బాబు కూడా స్పందించారు.

మరోవైపు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినాయ‌క‌త్వం పిలుపు మేరకు ఛ‌లో న‌ర్సీప‌ట్నం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇది కూడా చాలా వివాదాల‌కు తావిచ్చింది. పోలీసుల చ‌ర్య‌ల‌తో అక్క‌డి ప్రాంతం అట్టుడిగి పోయింది.అస‌లు నేత‌లెవ్వ‌రూ అక్క‌డికి చేరుకోకుండా చేశారు.

ఇక ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం న‌డుచుకుంటున్న తీరుపై అనేక విమ‌ర్శలు రావ‌డానికి కార‌ణం ఇక్క‌డ పోలీసులు న‌డుచుకుంటున్న తీరే ! ఆ రోజు జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌ను మేం అడ్డుకుని ఉంటే ఇంత జ‌రిగేదా? అని కూడా అయ్య‌న్న కొడుకు విజ‌య్ ప్ర‌శ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ నేత‌లు అంతా అరెస్టుల‌లో ఉన్నారు. కొంద‌రు గృహ నిర్బంధంలో ఉన్నారు.

వంగ‌లపూడి అనిత అనే లీడ‌ర్ ఇంటి చుట్టూ ఇవాళ ఉద‌యం పోలీసులు ఉన్నారు. ఆఖ‌రికి ఆమె తిరుగుబాటు చేసి, పోలీసుల‌ను నిల‌దీసి అక్క‌డి నుంచి పంపితే కానీ వాళ్లు వెళ్ల‌లేదు. త‌న‌కు 41 ఏ ప్ర‌కారం నోటీసులు ఇస్తేనే త‌నను గృహ నిర్బంధం చేయాల‌ని ఆమె ప‌ట్టుబ‌ట్టారు. ఇదే విష‌య‌మై పోలీసు ఉన్న‌తాధికారుల‌తో ఆమె ఫోన్లో మాట్లాడారు ఆ వీడియోను ట్విట‌ర్ లో పోస్టు చేశారు. ఇదే విధంగా అన్ని చోట్లా ఇవాళ టీడీపీ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్ల‌ను అదేవిధంగా అవ‌మానాల‌నూ ఎదుర్కొంది.ఇదే ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ ను ఇర‌కాటంలో పెడుతోంద‌ని తెలుస్తోంది.