తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒకేసారి ముగ్గురు కీలక నాయకుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్‌రావు, బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురై.. ఆ పార్టీకి రాజీనామా చేసిన.. కవిత ముగ్గురూ ఒకేసారి తగులుకున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచిన తీరును వారు వేర్వేరుగా దుయ్యబట్టారు. సామాన్యులపై భారాలు మోపుతున్నారని …
Read More »అయ్యన్న వర్సెస్ జగన్: కొత్త రగడ!
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మధ్య ఇప్పటికే ఒక వివాదం ఉన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో తనను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని జగన్.. అలా కుదరదని అయ్యన్న వాదించుకుంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టుల పరిధిలో ఉంది. ఇదిలావుంటే.. వైసీపీ హయాంలో అయ్యన్న సొంత నియోజకవర్గం.. నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్మించామని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం …
Read More »విజయ్‌పై ఉద్దేశపూర్వకంగా కుట్ర: ఖుష్బూ
తమిళనాడులోని కరూర్ జిల్లాలో గత నెల 27న రాత్రి చోటు చేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనకు కారణాలేంటి? ఎలా జరిగిందనే విషయంపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నా.. ఇతమిత్థంగా ఇంకా కారణాలు తెలియలేదు. ఇదిలావుంటే.. నాటి ఘటనకు పూర్తిగా డీఎంకే ప్రభుత్వానిదే కారణమని సీనియర్ నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రజలను కట్టడి చేయలేదని ఆమె …
Read More »మీరు సీనియర్.. ఇలా చేస్తే మీకేం చెప్పాలి: పవన్
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శనివారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉదయం ప్రభుత్వ కార్యక్రమంలో ఆటోడ్రైవర్ల సేవలో.. పాల్గొ్న్న అనంతరం.. నేరుగా మంగళగిరికి చేరుకున్నారు. అ నంతరం.. ఆయన పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అప్పటికే వారికి రెండు రోజుల కిందట సమాచారం చేరవేశారు. ప్రజాప్రతినిధుల సమావేశం ఉంటుందని.. నియోజకవర్గం సమస్యలతో రావాలని పవన్ సూచించారు. దీంతో కొందరు ఎమ్మెల్యే …
Read More »యువ ఎమ్మెల్యేకు ఎఫెక్ట్: తీరుమారకపోతే.. ఫ్యూచర్ కొలాప్సే.. !
శ్రీకాళహస్తి నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి వారసత్వాన్ని నిలబెడతారా? నిలబెట్టరా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఆయన వివాదాలకు కేంద్రంగా మారారు అన్నది వాస్తవం. ఈ విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. సుధీర్ రెడ్డి ఇప్పటికే రెండు మూడు విషయాల్లో వివాదాలకు కేరాఫ్ గా మారారు. మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ను ఆయన టార్గెట్ చేయడం తీవ్ర …
Read More »నకిలీ మద్యం దందా.. సీఎం చంద్రబాబు సీరియస్!
నియోజకవర్గం వైసీపీ నేతది. కానీ, ఇక్కడ జరుగుతున్న నకిలీ మద్యం దందా మాత్రం టీడీపీ కీలక నేత కనుసన్నల్లోనే జరుగుతోందని అధికారులు తేల్చారు. ఈ వ్యవహారం పతాక శీర్షికల్లో రావడంతో సీఎం చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. శనివారం సాయంత్రం ఆయన ప్రత్యేకంగా అధికారులతో భేటీ అయ్యారు. ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఎవరికి చెప్పారు? ఎక్సైజ్ మంత్రికి చెప్పారా? లేదా? అని నిప్పులు చెరిగారు. అంతేకాదు.. అసలు నియోజకవర్గం …
Read More »ఫ్యూచర్ ఫీల్డ్: రేవంత్ సర్ ఆశలు నెరవేరేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగితే.. నిజంగానే తెలంగాణకు ఒక మణిహారంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. ఏపీ రాజధాని అమరావతిని మించి నిర్మించాలన్న వ్యూహంతో సీఎం అడుగులు వేస్తున్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. భాగ్యనగరంలో ఇప్పటి వరకు సైబరాబాద్ వంటి మహానగరాన్ని చంద్రబాబు సృష్టించారన్న పేరుంది. సచివాలయాన్ని కేసీఆర్ కట్టించారన్న రికార్డు ఉంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తలకెత్తుకున్న …
Read More »బాబు టార్గెట్: మిగిలింది 15 లక్షలే.. !
చేయాలన్న సంకల్పం.. చిత్తశుద్ధి ఉంటే.. ఖచ్చితంగా ఏ పనిలో అయినా విజయం దక్కుతుంది. లేకపోతే.. తూతూ మంత్రపు లెక్కలే మిగులాయి. గత ఎన్నికలకు ముందు టీడీపీ అధినేతగా ప్రస్తుత సీఎం చంద్రబాబు.. యువతకు పెద్ద పెట్టున భారీ హామీ ఇచ్చారు. అదే.. ఏటా 5 లక్షల ఉద్యోగాల కల్పన. వచ్చే ఐదేళ్లలో మొత్తం 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రచారం చేశారు. అన్నట్టుగానే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. …
Read More »జనసేనకు కంచుకోటగా పిఠాపురం.. పక్కా స్ట్రాటజీ ఇదే!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి విజయం దక్కిం చుకున్నారు. కూటమికట్టి.. పిఠాపురం టికెట్‌ను సొంతం చేసుకున్న ఆయన.. 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయాన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఇక, ముందు కూడా.. పవన్ ఇక్కడ నుంచే పోటీ చేస్తారని.. గతంలోనే పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు చెప్పిన విషయం తెలిసిందే. అయితే.. సంస్థాగతంగా మాత్రం.. పార్టీ ఇంకా పుంజుకోవాల్సి …
Read More »బాబు లెక్క: ఏపీలో ఆదాయం ఎలా పెరిగింది?
ప్రస్తుతం దేశంలో గత నెల 22 నుంచి వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ-2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. తద్వారా జీఎస్టీలో శ్లాబులు మారి.. ప్రజలకు ఊరట కలిగిస్తుందని కేంద్రం చెబుతోంది. నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు, చెప్పుల నుంచి దుస్తుల వరకు కూడా ధరలు తగ్గాయి. దీంతో ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. తాజా లెక్కల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం సుమారు 4 వేల కోట్ల రూపాయలను …
Read More »తెలంగాణలోనూ జనసేన ఎంట్రీ.. పక్కాస్కెచ్ ఇదే.. !
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా జరగనుంది. గ్రామ పంచాయతీలు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు సహా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో జనసేన పార్టీని విస్తరించే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయ పరిణామాలపై స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులతో …
Read More »`యువగళం` ఫ్రెండ్ పెళ్లి.. బిజీ షెడ్యూల్‌లోనూ హాజరైన లోకేష్
రాజకీయ నేతలకు మిత్రులు ఉంటారా? అంటే ఎందుకు ఉండరు?! అయితే.. వారిని కలిసేందుకు, సమయం వెచ్చించేందుకు పెద్దగా తీరిక ఉండదు. పైగా.. మంత్రిగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు వేరేగా ఉంటాయి. ఇటు పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అటు ప్రభుత్వం పనులు అన్నీ చూస్తూనే.. మంత్రి నారా లోకేష్.. తన యువగళం ఫ్రెండ్ భవ్య(అసలు పేరు భవానీ) వివాహానికి హాజరయ్యారు. ఈ ఆకస్మిక ఆగనంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయ్యారు. నారా లోకేష్‌ను చూసి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates