ఏపీకి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు అలుపెరగని పోరాటమే చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఆయన పెట్టుబడుల కోసం గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం దుబాయ్‌కు వెళ్లిన ఆయన, అక్కడ నుంచి గురువారం ఉదయం అబుదాబీకి చేరుకున్నారు.క్కడి పారిశ్రామిక వేత్తలను కలుసుకుని వారికి కూడా ఏపీ ప్రాధాన్యాన్ని వివరించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలిపారు. మీ పెట్టుబడికి మా హామీ అంటూ ఆయన భరోసా కల్పించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఒక్కొక్కరూ కనీసం ఒక్క పెట్టుబడి అయినా పెట్టాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సురక్షిత పెట్టుబడికి సుగమమైన అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడి పెట్టాలని భావించే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. పెట్టుబడి పెట్టాలని భావించే వారికి అన్ని విధాలా సహకరిస్తామన్న ఆయన, లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అబుదాబీ పారిశ్రామిక వేత్తలకు సూచించారు.
పెట్టుబడితో తరలి వచ్చేవారికి అన్ని విధాలా ప్రభుత్వం, అధికారులు సహకరిస్తారని తెలిపారు. “పెట్టుబడి మీరు పెట్టినా, దానిని మాదిగా భావిస్తాం. మీకు అన్ని విధాలా సహకరిస్తాం” అని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. అయితే, సాధ్యమైనంత వరకు స్థానికంగా యువతకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ప్రతిొక్కరూ ఒక్కొక్క పెట్టుబడితో తరలి వచ్చినా, అది ఏపీకి సువర్ణావకాశంగా మారుతుందన్నరు. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని పరోక్షంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనను ఆయన ఉటంకించారు.
ముఖ్యంగా కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం ఉందన్న సీఎం చంద్రబాబు, 24 గంటల్లోనే అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు. వనరులు పుష్కలంగా ఉన్నాయని, రవాణా సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు ఇదొక గొప్ప అవకాశంగా ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులతో తరలి వచ్చేవారిని స్వాగతిస్తున్నామన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని, తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates