Political News

షర్మిల కీలక నిర్ణయం

ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో కొత్తగా కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే తోందరలోనే బస్సుయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారట. పార్టీని బలోపేతం చేయాలంటే ఇప్పట్లో ఎవరివల్లా అయ్యేపనికాదు. అయితే అంతటి మోయలేని భారాన్ని షర్మిల భుజాన వేసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని పెద్ద శపథమే చేశారు. ఇందులో భాగంగానే షర్మిల రాష్ట్రమంతా పర్యటనలు జరపాలని అనుకున్నారు. ఆ పర్యటనలు పాదయాత్ర …

Read More »

చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్న చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప‌ర్య‌టించారు. దాదాపు మూడు మాసాల‌కుపైగా గ్యాప్‌తో ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా స్థానికంగా ఉన్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. వైసీపీ దూకుడు, ఇక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు.. ముఖ్యంగా మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి అనుచ‌రుల ఆగ‌డాలు వంటివాటిపై ఆయ‌న చ‌ర్చించారు. ప్ర‌స్తుతం …

Read More »

ప్ర‌జానాడిని ముందే ప‌ట్టేసిన జ‌గ‌న్‌…?

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాల గ‌డువు ఉంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌కానుంది. అయితే.. అప్పుటికి ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంటుంది? ఎవ‌రివైపు మొగ్గు చూపుతారు? అనే విష‌యాలు ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. స‌హ‌జంగా ఇదే అభిప్రాయం విశ్లేష‌కుల‌కు కూడా ఉంటుంది. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ మాత్రం ప్ర‌జానాడిని ముందుగానే ప‌సిగ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌లు ఎటు వైపు మొగ్గు …

Read More »

టీడీపీలోకి వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే.. ముహూర్తం ఫిక్స్‌?

ఏపీలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నాయి. వైసీపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టికెట్ల కేటాయింపు న‌డుస్తోంది. ఇప్ప‌టికి చాలా మంది సిట్టింగుల‌ను పార్టీ ప‌క్క‌న పెట్టింది. స‌ర్వేల ఆధారంగా.. ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తి కార‌ణంగా ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను కూడా ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం. మ‌రికొంద‌రిని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. దీంతో కొంద‌రు ఎమ్మెల్యేలు స‌ర్దుకు పోతుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇలాంటి …

Read More »

వైఎస్ మ‌ర‌ణం వెనుక కాంగ్రెస్‌.. ష‌ర్మిల వెనుక చంద్ర‌బాబు: స‌జ్జ‌ల

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంద‌ని, దీనిపై త‌మ‌కు అప్ప‌టి నుంచే అనుమానాలు ఉన్నాయ‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ స‌ర్కారు స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై గ‌తంలో తాము విచార‌ణ‌కు కూడా డిమాండ్ చేశామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. త‌మ ఆవేద‌న అర‌ణ్య రోద‌న‌గానే మిగిలిపోయింద‌న్నారు. ఇక‌, తాజాగా వైఎస్ కుమార్తె ష‌ర్మిల త‌న పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డాక్ట‌రేట్‌.. కానీ!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డాక్ట‌రేట్ ఇస్తామంటూ.. ఓ యూనివ‌ర్సిటీ ముందుకు వ‌చ్చింది. ఆయ‌న‌ను సాద‌రంగా ఆహ్వానించింది. మీకు డాక్ట‌రేట్ ఇస్తాం తీసుకోండి.. అని తెలిపింది. అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ ఆహ్వానం, ఆఫ‌ర్‌పై నిశితంగా స్పందించారు. త‌న‌కు ఈ డాక్ట‌రేట్ అవ‌స‌రం లేద‌ని చెప్పారు. స‌మాజంలో త‌న‌క‌న్నా మేధావులు, నిపుణులు, విజ్ఞులు ఉన్నారని, వారిలో ఎవ‌రినైనా ఎంపిక చేసుకుని ఇవ్వాల‌ని సూచించారు. దీంతో స‌ద‌రు యూనివ‌ర్సిటీ వెన‌క్కిత‌గ్గింది. ఇదీ …

Read More »

కోరి కోరి వైసీపీ పోగొట్టుకునే సీటు ఇదే…!

క‌ర్నూలు జిల్లాలో కీల‌క‌మైన స్థానం ప‌త్తికొండ‌. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో కంగాటి శ్రీదేవి విజ‌యం ద‌క్కించుకున్నారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేసిన‌ప్పుడు ప్ర‌క‌టించిన ఫ‌స్ట్ టికెట్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ నుంచి పోటీ చేసి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి త‌న‌యుడు కేఈ శ్యామ్ కుమార్ పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో శ్రీదేవి అనూహ్య‌మైన విజ‌యం ద‌క్కించుకున్నారు. ఏకంగా 43 వేల …

Read More »

అంగన్వాడీలకు జగన్ షాక్

CM Jagan

జీతాల పెంపుతో పాటు గ్రాట్యుటీ పెంపు కోసం ఏపీలో అంగన్వాడీలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంగన్వాడీల సమ్మెను పట్టించుకోని జగన్ ప్రభుత్వం వారిని చర్చలకు కూడా ఆహ్వానించలేదు. అంతేకాకుండా, ఈ నెల 5వ తేదీ లోపు విధుల్లో చేరకుంటే ఎస్మా ప్రయోగిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం అల్టిమేటం జారీ చేసింది. అయినా సరే వెనక్కి తగ్గబోయేది లేదని అంగన్వాడీలు తమ …

Read More »

మూడో జాబితా రెడీ అయ్యిందా ?

వైసీపీలో మూడో జాబితా సిద్ధమైనట్లు సమాచారం. తాడేపల్లి నుండి ఫోన్ వచ్చిందంటేనే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో మూడో జాబితాను జగన్మోహన్ రెడ్డి ప్రకటించబోతున్నారట. ఇందుకు అనుగుణంగా చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలను పిలిపించుకుని జగన్ మాట్లాడారు. అందుబాటులోని సమాచారం ఏమిటంటే మూడోజాబితాలో 12 లోక్ సభ, 13 అసెంబ్లీ స్ధానాల్లో మార్పులుండే అవకాశాలున్నాయట. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, …

Read More »

వైసీపీ ఎంపీ చంద్రబాబుతో భేటీ అయ్యారా ?

వైసీపీ నెల్లూరు జిల్లాలో కీలకపరిణామం చోటుచేసుకున్నదా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఈమధ్యనే చంద్రబాబునాయుడుతో భేటి అయినట్లు సమాచారం. వైసీపీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీచేయమని జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డిని అడిగారట. ఇపుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డిని రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో నెల్లూరు నుండి పోటీచేయించాలన్నది జగన్ ఆలోచన. అందుకు వేమిరెడ్డి కూడా అంగీకరించారు. అయితే ఒక షరతు విధించారట. అదేమిటంటే …

Read More »

జగన్ కు షాక్..అంబటి రాయుడు ఔట్

సీఎం జగన్ కు షాకిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్, వైసీపీ నేత అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో చేరి వారం రోజులు గడవక ముందే పార్టీకి రాజీనామా చేస్తున్నానని అంబటి రాయుడు చేసిన ప్రకటన ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ వీడుతున్నట్లు అంబటి రాయుడు చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని రాయుడు అన్నారు. …

Read More »

2024 – ఏపీ రాత రాసేది బీసేలేనా

రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా బీసీల ఓట్లే కీలకంగా మారాయి. జనాభాలో బీసీ సామాజికవర్గాలు సగమున్నాయి. దాదాపు 139 ఉపకులాలున్న బీసీలు ఎన్నికల విషయంలో దాదాపు ఐకమత్యంగానే ఉంటాయి. అందుకనే ఇపుడు బీసీలను ప్రసన్నం చేసుకునేందుకు, ఆకర్షించేందుకు ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. బీసీల్లో పట్టు నిలుపుకునేందుకు జగన్ పాట్లు పడుతుంటే పోయిన పట్టును తిరిగి సాధించేందుకు చంద్రబాబు అవస్తలు పడుతున్నారు. రెండు పార్టీలు …

Read More »