రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక కుదుపు కుదుపుతున్న క్యాసినో అంశంపై.. ఏపీ మాజీ మంత్రి, సీఎం జగన్ కు మేనమామ వరసయ్యే.. బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తను కూడా.. క్యాసినోకు వెళ్తుంటానని ఆయన చెప్పారు. అయితే.. ప్రవీణ్ చీకోటి అనే వ్యక్తి ఎవరో మాత్రం ఆయనకు తెలియదని చెప్పడం విశేషం. క్యాసినో విషయంపై అడ్డమైన రాతలు రాస్తే.. బాగోదని.. మీడియాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
“నేను ఎప్పుడైనా క్యాసినోకు పోయి వస్తుంటా. కానీ, ఈ ప్రవీణ్ ఎవరో.. నాకు తెలీదు. కానీ, ఏదొచ్చినా.. మాపై బురద జల్లే కార్యక్రమం మంచి పద్దతి కాదు. అన్ని టీవీలకు ఒక్కటే చెబుతున్నా.. కావాలంటే.. ఎంక్వయిరీ చేసుకోండి. ప్రవీణ్‌కుమార్‌తో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నేను ఉన్న విషయం చెబుతా.. ఎప్పుడైనా.. నేను పేకాట ఆడతా.. చెబుతున్నాకదా.. పేకాట ఆడతా. అంతేకానీ.. డ్రామాలు చేసి నటించడం మాకు చేతకాదు” అని బాలినేని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో తనకు అబద్దాలు చెప్పడం చేతకాదని ఆయన అన్నారు. అయితే.. కావాలని.. తమ పేర్లపై దుష్ప్రచారం చేస్తే.. మాత్రం బాగుండదని.. ఆయన వార్నింగ్ ఇచ్చారు. కట్ చేస్తే.. అటు తెలంగాణలోనూ.. క్యాసినో వ్యవహారంలో కొందరు మంత్రుల పాత్ర ఉన్నట్టు స్పష్టంగా తెలిసింది. అయితే.. వీరెవరికీ కూడా ప్రవీణ్ అంటే.. ఎవరో తెలియదని చెప్పడమే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది.
అసలు ఇలాంటి వారి అండ చూసుకునే ప్రవీణ్ ఇలాంటి దందాలు నిర్వహిస్తున్నాడనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. కానీ, వీరు మాత్రం తమకు ప్రవీణ్ అంటే.. ఏంటో తెలీదని.. తమ పేర్లు మీడియాలో వస్తే.. బాగోదని వార్నింగులు ఇవ్వడం.. ఇప్పుడు మరింత ఆశ్చర్యకరంగా ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates