కుప్పంపై వైసీపీ భ‌య‌ప‌డుతోందా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌డిచిన 35 సంవ‌త్స‌రాలుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం.. చిత్తూరు జిల్లాలోని కుప్పం. రాజ‌కీయాల్లో ఆయ‌న‌కు విరోదులు ఉన్నారు. ఆయ‌నంటే.. గిట్ట‌ని వారు కూడా ఉన్నారు. అయినా.. ఎప్పుడూ.. ఆయ‌న‌ను ఓడించాల‌ని.. కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని స్వాధీనం చేసుకోవాల‌ని.. ఎవ‌రూ ప్ర‌య‌త్నించ‌లేదు. సాధార‌ణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రో ఒక‌రికి.. టికెట్ ఇవ్వాలి క‌నుక‌.. ఇచ్చేవారు. ఉదాహ‌ర‌ణ‌కు..కాంగ్రెస్‌తో విభేదించిన చంద్ర‌బాబుకు.. ఆ పార్టీలో కీల‌క నాయ‌కుడిగా ఉన్న దివంగ‌త వైఎస్‌తోనూ.. రాజ‌కీయంగా వివాదాలు ఉన్నాయి.

అయితే.. అవి.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్య‌క్ర‌మాలు.. ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల వ‌ర‌కే ప‌రిమితం అయ్యా యి. అంతేత‌ప్ప‌.. వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబును ఓడించేయాలి. కుప్పంను కాంగ్రెస్ స్వాధీనం చేసుకోవాల‌నే కుళ్లు రాజ‌కీయాలు ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. హుందాగా వ్య‌వ‌హ‌రించేవారు. ఎక్క‌డైనా.. ఎప్పుడైనా.. క‌ల‌వాల్సి వ‌స్తే.. ప‌క్క ప‌క్క‌నే కూర్చున్న సంద‌ర్భాలు కూడా వైఎస్‌, బాబుల విష‌యంలో మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అయితే.. ఇప్పుడు.. ఏపీలో `ఓ త‌ర‌హా` రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి.

అంతా నాదే.. అన్నీనావే.. అనే సంస్కృతికి బీజం ప‌డింద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి ఆశ ఉండొచ్చు.. కానీ.. అత్యాస మాత్రం ఉండ‌కూడ‌దు. ఇప్పుడు వైసీపీకి అత్యాశే ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న చంద్ర‌బాబును ఓడించేస్తే.. త‌మ కు పేరు వ‌చ్చేస్తుంద‌ని.. ఇక‌, రాష్ట్రంలో త‌మ‌కు ఎలాంటి తిరుగు ఉండ‌ద‌ని.. నాయ‌కులు భావిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అందుకే.. కుప్పంపై వైసీపీ కీల‌క నాయ‌కులు క‌న్నేశార‌నేది ప‌రిశీల‌కుల మాట‌.

పోనీ..రాజ‌కీయంగా చూసుకున్నా.. ఇది కూడా ఎవ‌రూ త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రంలేదు. ప్ర‌త్య‌ర్థి పార్టీన‌ని సాధ్య‌మైనంత ఓడించాల‌నేది.. రాజ‌కీయాల్లో ఉన్న‌దే. అయితే.. అసలు.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో అక్క‌డి ఎమ్మెల్యేనే అడుగు పెట్ట‌నివ్వ‌కుండా చేసే సంస్కృతిని తీసుకురావ‌డ‌మే.. మేధావుల‌ను ప్ర‌జా స్వామ్య వాదుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్న ప్ర‌ధాన విష‌యం. తాజాగా మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌… చంద్ర‌బాబు అక్క‌డ అడుగు కూడా పెట్ట‌నివ్వ‌రాద‌నే సంకేతాలు వ‌చ్చాయో.. లేక‌.. స్థానిక నాయ‌క‌త్వం నిర్ణ‌యించుకుందో తెలియ‌దు కానీ.. కుప్పాన్ని రెండు రోజులుగా ర‌ణ‌రంగంగా మార్చేశారు.

ఒకే.. చంద్ర‌బాబు అడుగు పెట్ట‌క‌పోతే.. వైసీపీ గెలిచేస్తుంద‌నే ధీమా ఏమైనా.. ఉందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత హోదాలో ఉన్న చంద్ర‌బాబు గ‌త 30 ఏళ్లుగా ఎలాంటి ప్ర‌చారం చేయ‌కుండానే ఇక్క‌డ విజ‌యంద‌క్కించుకుంటున్నారు. దీనిని బ‌ట్టి.. ఆయ‌న‌కు పెద్ద‌గా ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. అయితే.. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని .. ఆయ‌న ఒకింత అలెర్ట్ అయ్యారు.

ఈ మాత్రం దానికే వైసీపీ ఉలిక్కి ప‌డుతుండ‌డం.. చంద్ర‌బాబును అస‌లు అక్క‌డ అడుగే పెట్ట‌నివ్వ‌కుండా.. వ్యూహాత్మ‌కంగా విధ్వంసం సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం వంటివి ఎవ‌రూ మెచ్చుకునే విష‌యాలు కావ‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనివ‌ల్ల చంద్ర‌బాబుకే సింప‌తీ పెరుగుతుంద‌ని.. అంటున్నారు.