రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వాటిని పక్కన కూడా పెట్టేస్తారు. కానీ, తమిళనాడుకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై.. తాజాగా భీషణ ప్రతిజ్ఞే చేశారు. పట్టుమని 10 శాతం ఓటు బ్యాంకు కూడా లేని రాష్ట్రంలో ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకువస్తానని చెప్పారు. అప్పటి వరకు తాను చెప్పులు వేసుకునేది …
Read More »అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం? : సిఎం రేవంత్!
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ఉంచగా…కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు టాలీవుడ్ పెద్దలు ఉంచారు. సమావేశంలో హీరో అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చినపుడు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ పై తనకు కోపం లేదని, తనకు చిన్నప్పటి నుంచి బన్నీ, చెర్రీ తెలుసని, వారితో …
Read More »రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు చెప్పిందిదే…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ క్రమంలోనే సినీ పెద్దలు రేవంత్ తో భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. …
Read More »బాబుకు విన్నపం: పింఛన్ల జోలికి వెళ్లకపోతేనే బెటర్!
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం. దీనిపై ఆధారపడి దాదాపు 80 లక్షల ఓట్లు ఉన్నాయి. వీరిలో దివ్యాంగులు , వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా అనేక వర్గాలు ఉన్నాయి. ఇలాంటి సెన్సిటివ్ అంశాన్ని ఆలంబనగా చేసుకునే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి సర్కారు విజయం దిశగా దూసుకుపోయింది. పించన్లను రూ.4000లకు పెంచుతామన్న …
Read More »టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టయ్యి బెయిలు మీద బయటికి వచ్చాక జరిగిన పరిణామాలతో పాటు ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించుకునే ప్రయత్నంగా దీన్ని నిర్వహించారు. నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్, కళ్యాణ్ రామ్, అడవి …
Read More »‘సగం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్రబాబు విన్నపం!
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని కొన్ని విషయాల్లో అసంతృప్తులు.. అలకలు ఉన్నాయి. అయితే.. ఎవరూ బయటకు చెప్పరు. అలాగని అంతర్మథనంతో వదిలేయరు. రాజధానికి నిధులు, పోలవరానికి నిదులు, అభివృద్ధి నిధులు వంటివి మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. వీటిపైనే ఎప్పుడూ చర్చిస్తున్నారు. అయితే.. ఇప్పటికి ఆరు మాసాలు గడిచిపోయిన తర్వాత.. ప్రజలకు చేయాల్సిన పనులు చాలా …
Read More »మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించే పేరుతో ఏళ్ల తరబడి ఓదార్పు యాత్ర చేసి కావాల్సినంత సానుభూతిని రాబట్టుకున్నాడు జగన్. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి సానుభూతి ఫ్యాక్టర్ బాగా ఉపయోగపడిందన్నది స్పష్టం. ఐతే అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ …
Read More »బాబుతో పాటు ‘ఈ బ్రాండూ’ పెరుగుతోంది!
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని నిరూపిస్తున్నారు. సతీమణి నారా భువనేశ్వరి కోరిక మేరకు.. చంద్రబాబు.. అరకు కాఫీని ప్రొమోట్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో ఉన్నప్పుడు.. నారా భువనేశ్వరి.. విశాఖకు వెళ్లారు. అప్పట్లో ఓ కాఫీ క్లబ్లో అరకు కాఫీని సేవిస్తూ.. వాట్సాప్లో చంద్రబాబుతో ముచ్చటించారు. అరకు కాఫీ బాగుందని తెలిపారు. అంతేకాదు.. దీనిని …
Read More »వైఎస్ ఎఫెక్ట్.. వెంటాడిన పాపం.. సిరి కోల్పోయిన శ్రీలక్ష్మి!
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే తొలిసారి ఒక మహిళా ఐఏఎస్ అధికారి సుదీర్ఘకాలం జైల్లో ఉండడం! కారణాలు ఏవైనా కూడా.. అవినీతి చుట్టూ అలుముకున్న పంజరంలో చిక్కిన శ్రీలక్ష్మి.. అక్రమాలకు ఒత్తాసు పలికారని.. అప్పట్లోనే సీబీఐ తేల్చింది. తర్వాత.. కేసులో అరెస్టు కావడం.. సుదీర్ఘ కాలం జైల్లోనే ఉండడం అప్పట్లో సంచలనాలు. అయితే.. ఇప్పుడు …
Read More »పదహారు వేల పదవులు.. చంద్రబాబు బీసీ మంత్రం.. !
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన విషయం తెలిసిందే. మంత్రి వర్గంలో చోటు పెట్టారు. అదేవిధంగా కార్పొ రేషన్ పదవులు కూడా ఇచ్చారు. అయినా.. ఎక్కడో బీసీల్లో అసంతృప్తి పెరుగుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు సరికొత్త మంత్రం దిశగా అడుగులు వేస్తున్నారు. ఏకంగా 16500 బీసీ నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు. నిజానికి …
Read More »మరణశిక్షపై ట్రంప్ కఠిన వైఖరి!
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరణశిక్ష అమలుపై తన కఠినమైన వైఖరిని వ్యక్తం చేశారు. అత్యంత క్రూరమైన నేరస్తులకు మరణశిక్ష తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. రేపిస్టులు, హంతకులు వంటి ఘోర నేరస్తులను క్షమించే అవకాశం తన పరిపాలనలో ఉండదని, న్యాయశాఖకు తగిన ఆదేశాలు జారీ చేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. సమాజ శాంతి భద్రతల పునరుద్ధరణకు ఈ నిర్ణయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. …
Read More »జనసేనాని దూకుడు.. కేంద్రం ఫిదా!
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా.. పనితీరు విషయంలో మాత్రం దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. పనుల పర్యవేక్షణ.. నిధుల సమీకరణ.. ఈ రెండు విషయాల్లో పవన్ కల్యాణ్ చాలా నిక్కచ్చిగా ఉంటున్నారు. చంద్రబాబు సైన్యంలో జనసేనాని డిఫరెంట్ అనే టాక్ వచ్చేలా ఆయన చేసుకున్నారు. పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ది శాఖలను అత్యంత కీలకంగా భావిస్తున్న …
Read More »