న‌గ‌రిలో రోజా VS భాను… ఇదో స‌రికొత్త వార్‌…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నగ‌రిలో ఏం జ‌రుగుతోంది? నాయ‌కులు ఏం చేస్తున్నారు? అంటే.. అంతా ప్ర‌స్తుతం సైలెంట్‌గానే ఉంద‌ని స‌మాచారం. వాస్త‌వానికి చిత్తూరు జిల్లాలో అంతో ఇంతో రాజ‌కీయంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం మాత్ర‌మే త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తుంది. గ‌త రెండు మాసాల కింద‌టి వ‌రకు ఇక్క‌డ రాజ‌కీయాలు భిన్నంగా ఉన్నాయి. వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి రోజా దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

దీనికి ధీటుగా టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యే భాను ప్ర‌కాశ్ నాయుడు స్పందించారు. ఇక‌, ఎక్క‌డిక‌క్క‌డ ప‌నులు కూడా చేయిస్తున్నారు. అయితే.. రోజా ఇప్పుడు స్థానికంగా ఉండ‌డం లేదు. ఆమె చెన్నై, బెంగళూరు, హైద‌రాబాద్‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. దీంతో రాజ‌కీయ జాడ ఇక్క‌డ క‌నిపించ‌డం లేదు. అయితే.. దీనిని త‌న‌కు అవ‌కాశంగా మార్చుకుని ఎమ్మెల్యే భాను ప‌నులు చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. కానీ, ఆయ‌న కూడా ఇంటికే ప‌రిమితం అవుతున్నార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్నారు. కానీ గ‌త నెల రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేద‌ని.. నాయ‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గెలుపు కీలకం. గ‌త ఎన్నిక‌లే కాదు.. వ‌చ్చే 2029 ఎన్నిక‌లు కూడా.. అత్యంత ముఖ్య‌మే. ఈ విష‌యాన్ని ముందుగానే గ్ర‌హించాల‌ని నాయ‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ విష‌యంలోను.. ప్ర‌జ‌ల విష‌యంలోనూ ప‌ట్టు చేజార‌కుండా చూడాల‌ని సూచిస్తున్నారు.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు న‌గ‌రిలోని అన్నిప్రాంతాల్లోనూ భాను ప్ర‌కాశ్ నాయుడు తిరిగారు. స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి న‌గ‌రి ప్ర‌ధాన మండ‌లాల వ‌ర‌కు కూడా ప‌నులు చేయించారు. అయితే.. రోజా దూకుడును అంచనా వేసి.. మ‌రింత జోరుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించాల‌ని అంటున్నారు. ఏమాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా.. పార్టీలో అనిశ్చితి ఏర్ప‌డుతుంద‌ని.. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నిశ్తేజంగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. సో.. సైలెంట్ పాలిటిక్స్ కాకుండా.. జోరుగా స్పందించాల‌ని కోరుతున్నారు.