కొణిదెల రూపురేఖలు మార్చేసిన పవన్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాటిస్తే.. అది అమ‌లు కావాల్సిందే!. అది గిరిజ‌న ప్రాంత‌మైనా.. మైదాన ప్రాంత‌మైనా.. చెప్పిన‌ట్టు చేయ‌డ‌మే ఆయ‌న ప‌ని!. ఇప్పుడు కూడా అదే ప‌ని చేసి చూపించారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని కొణిదెల‌(ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంటి పేరు కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం) గ్రామాన్ని తాను ద‌త్త‌త తీసుకుంటాన‌ని.. అభివృద్ధి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఆ మాట ప్ర‌కారం.. గ‌త 20 మాసాల్లోనే ఇక్క‌డ ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు.

స్వయంగా త‌న సొంత నిధుల నుంచి గ్రామం అభివృద్ధికి 50 ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు నిధులు ఇచ్చారు. దీంతో పాటు పంచాయ‌తీ అభివృద్ధి గ్రాంట్ల‌ను నేరుగా కొణిదెల గ్రామానికే అందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించాల్సిన వాటాను కూడా ఆయ‌న స‌త్వ‌ర‌మే అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో కొణిదెల గ్రామంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు వ‌డివ‌డిగా ముందుకు సాగాయి. ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి వ‌స్తున్న జ‌ల ధార‌తో కొణిదెల ప్ర‌జ‌ల దాహార్తి తీర‌డంతోపాటు.. స్వ‌చ్ఛ‌మైన మంచి నీరు కూడా వారికి అందుతోంది.

90 వేల లీట‌ర్ల సామ‌ర్థ్యం ఉన్న ఓవ‌ర్ హెడ్ ట్యాంకును ప‌వ‌న్ ఇచ్చిన సొంత నిధుల‌తోనే అధికారులు నిర్మించారు. మ‌రో రెండు మాసాల్లో వేస‌వి కాలం స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఈ ఓవ‌ర్ హెడ్ ట్యాంకును అధికారులు శ‌నివారం ప్రారంభించారు. దీని నుంచి కొణిదెల గ్రామంలోని 2 వేల కుటుంబాల‌కు సుర‌క్షిత తాగు నీరు అందిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. అధికారులు అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయ‌డం ప‌ట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతోషం వ్య‌క్తం చేశారు.

మ‌రిన్ని ప‌నులు..

+ ప్రభుత్వ పథకాల ద్వారా అంతర్గత రహదారులను నిర్మించారు.

+ 45 లక్షల రూపాయ‌ల‌తో 7 సీసీ రోడ్ల పనులు నిర్మాణంలో ఉన్నాయి.

+ 4 గోకులాలను నిర్మిస్తున్నారు.

+ గృహ నిర్మాణ శాఖ ద్వారా 19 ఇళ్లు నిర్మించారు.